Jump to content

Current generation Kids/parents


Recommended Posts

Posted

👉 ఆమె సింగిల్ పేరెంట్ . కొడుకు మూడేళ్ళ వయసులోనే,  భర్త చనిపోయాడు . కొడుకునే  తన భవిష్యత్తుగా చేసుకొని కష్టాల కడలి ఈదుతోంది . కొడుకు బాగా చదివి ఐఐటీ  లో సీట్ సాధిస్తే వాడి జీవితం స్థిరపడినట్టే . అప్పుడే  తన  జీవితానికి అర్థం పరమార్థం. ఐదో తరగతి దాకా బుద్ధిగా చదివే వాడు . తొంబై శాతానికి పైగా మార్కులు వచ్చేవి . ఐఐటీ లో సీట్ కొట్టాలంటే ఎనిమిదో తరగతి నుంచి ప్రతి మెట్టు కీలకం అని తనకు తెలుసు  . కానీ వాడి మార్కులు , ఈ మధ్య బాగా తగ్గిపోతున్నాయి . ఏమిదో తరగతి కీలకం . తాను ఎంత చెప్పినా చదవడు. చదవమంటే విసుక్కొంటాడు . బలవంత పెడితే చదివి నట్టు నటిస్తాడు .ఒక్కో సారి తనపైకే తిరగబడుతాడు  . ఇంటినుంచి పారిపోతానంటాడు . మొన్నటికి మొన్న పరీక్షల్లో నలబై మార్కులు కూడా రాలేదు . తాను చేసిన తప్పేంటో తనకు తెలియదు . భర్తతో బాటే తానే పోయుంటే బాగుండు అనిపిస్తుంది . రాత్రుళ్ళు  దిండు ఒక పక్క తడిసిపోతోంది . ఆమె కన్నీటికి అంతం  ఎప్పుడు ?  ఎలా ?

👉 ఒక పట్టణంలో  అదొక సింగల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ . అక్కడొక   దిగువ మధ్య తరగతి కుటుంబం . భర్త ది ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం . భార్య గృహిణి . ఎదుగు బొదుగు లేని బతుకు .  నెల సంపాదన నెల తిరక్కుండానే ఖర్చయిపోతుంది  . మిగిలేది అప్పులే . తాము సరిగ్గా చదువు కోలేదు . అందుకే ఇన్ని తిప్పలు . పిల్లలకు తమ గతి పట్టకూడదు .  తమ ఆదాయానికి ఒక చిన్న బడ్జెట్ స్కూల్ లో చదివించాల్సిన స్థితి . కానీ పిల్లలలు బాగా చదవాలి . మంచి ప్రొఫషనల్ కాలేజీ లో సీట్ లు సంపాదించి మంచి ఉద్యోగాలు సాదించాలి . తమలా అష్టకష్టాలు పడకూడదు . అందుకే ఊళ్లోని కొంత పొలాన్ని,  పూర్వీకుల ఇంటిని అమ్మి,  పిల్లల్ని "మంచి స్కూల్" లో చదివిస్తున్నారు . చిన్నపుడు బాగానే వుంది .  ఐఐటీ లో సీట్ కొట్టి  ఏరోనాటికల్ ఇంజనీర్ అవుతానని పెద్దాడు అనేవాడు . చిన్నది ,   గయినకాలజిస్ట్ అయ్యి ఆపెర్షన్ లేకుండానే పిల్ల్లల్ని పుట్టిస్తానని మూడో తరగతి లో అమ్మ ఉదరం పై సిజేరియన్ తాలూకు ఎండిన గాయాన్ని చూసి నప్పుడే చెప్పింది . అందుకు తగ్గట్టుగానే బాగా చదివేది . పెద్దాడు ఇప్పుడు పదోతరగతి . మాథ్స్ లో ముప్పై దాటడం లేదు . అసలు పదో తరగతి  గండం గట్టెక్కుతాడన్న నమ్మకం పోయింది . మూడేళ్ళుగా తాను ఎంత మొత్తుకొంటున్నా వాడి ధోరణి వాడిదే ! ఏదో లోకం లో ఉంటాడు . చిన్నది ఎనిమిదో తరగతి . పాత అప్పులాడు ఇంటి ముందు ఒక పక్క తిరుగుతుంటే తనకు ఆపిల్ ఫోన్ కావాలని,  తన ఫ్రెండ్స్ సమ్మర్ లో దుబాయ్ టూర్ వెళుతున్నారని మనం కూడా వెళుదామని ఒకటే గోల !" పిల్లలని ఎందుకు కన్నమురా దేవుడా ! ఇదేమి శిక్ష ?" అని వారికి అనిపిస్తుంది . ఏమి చెయ్యాలో పాలు పోవడం లేదు . 

👉 అదో గ్రామం . అక్కడో చక్కటి పాఠశాల . ప్రభుత్వ పాఠశాల . ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చదివించడం కొంత మందికి నామోషీ . కానీ ఆ తల్లితండ్రులు మంద మనస్తత్వానికి దూరం . పిల్లల్ని ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు . మొన్న పాఠశాల నుంచి కబురొచ్చింది . తొమ్మిదో తరగతిలో తమ కొడుకు ఆ ఊళ్లోని ఒక అల్లరి బ్యాచ్ లో చేరిపోయాడని వారు దగ్గరలోని అడవికి వెళ్లి రోజంతా గంజాయి కొట్టి రాత్రిళ్ళు తిరిగి వస్తారని , తన వయసుకంటే మూడేళ్లు పెద్దవారయిన వారితో వీడు కూడా చేరి చెడిపోతున్నాడని తమ అనుమానం అని , ఒక కంట కనిపెట్టి ఉండాలని హెడ్ మాస్టర్ చెప్పారు . తనకు ఏమి చెయ్యాలో పాలు పోవడం లేదు .

👉 సిటీ లో అదొక రిచ్ ఏరియా . అందులో ఒక విల్లా . ఒక బడా కాంట్రాక్టర్ కుటుంబం . కోట్ల ఆస్థి . " కొడుకు కూతురు- ఏదో చదివి ఎవరి దగ్గరో ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం ఏముంది ? ఐఏఎస్ ఆఫీసర్  అయినా , సాఫ్ట్ వెర్ ఇంజనీర్ అయినా పనోడే . ఎవరి దగ్గరో నౌకరి చేసి నెల జీతం తీసుకొనే వాడే . తనకు డజను కు పైగా బిజినెస్ లు. వేల మంది ఉద్యోగులు . ఇవన్నీ తన కష్టార్జితం . ముప్పై ఏళ్ళ క్రితం కట్టుబట్టల తో నగరానికి వచ్చాను . కష్టం అయినా , నష్టం అయినా వెనుదీయలేదు . తనకు బాల్య దశలో లేనిది డబ్బు . దాన్ని సంపాదించాలి .  మంచి- చెడు లేదు .  నీతి    నిజాయతీ ఇవన్నీ చేతకాని వారు చెప్పే మాటలు . ధన మూలం మిదం జగత్ ." కొడుకు కూతురు ఎంబీఏ  చేసి తన తరువాత తన బిజినెస్ చూసుకొంటే చాలు . అందుకే ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివించాడు . ఇద్దరినీ స్కూల్ లో డ్రాప్ చేయడానికి లగ్జరీ  కారు .  డ్రైవర్ . అయిదేళ్ల క్రితం డ్రగ్స్ కేసులో కొడుకు పేరు పోలీస్ రికార్డ్స్ లోకి  ఎక్కింది . తన పరపతిని డబ్బు ను ఉపయోగించి దాన్నుంచి బయట పడవేసాడు .ఇప్పుడు  పదకొండో తరగతి లో ఉన్న కూతురిదే అదే దారి . మొన్న బొంకు పబ్బు కేసులో తన పేరు.  . ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు . ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి తాను రెడీ . కొడుకు బక్క చిక్కి పీనుగులా అయ్యాడు . కూతురు ఏమి చేస్తుందో ఎక్కడికి పోతుందో తెలియదు . తన భార్య తన మాట వినదు. పార్టీ లు , క్లబ్బులు .. ఆమె లోకం ఆమెది . ఏమి చెయ్యాలి  ?  జీవితం లో విజేత అనుకొని బతుకుతున్న తనకు పిల్లలు పెద్ద జర్క్ ఇచ్చారు . వారు తనని తన జీవితాన్ని  ఫెయిల్యూర్ గా నిలిపేలా వున్నారు . ఏమైనా చేస్తాను . నేను గెలవాలి . కోట్లు ఖర్చయినా పరవాలేదు . తాను ఫెయిల్ కాకూడదు . ఇది  నయా శ్రీమంతుడి ఆలోచనలు . 

👩‍👩‍👧‍👦👩‍👩‍👧‍👦👨‍👦‍👦👩‍👧‍👧👨‍👧‍👦👩‍👩‍👧‍👦👩‍👦‍👦👩‍👩‍👧‍👦👨‍👦‍👦👨‍👧‍👦👩‍👧‍👧👩‍👩‍👧‍👦👩‍👩‍👧‍👦

నేటి పిల్లలే తల్లి తండ్రుల పాలిట విలన్ లా ? లోపం ఎక్కడుంది ? తల్లి తండ్రుల్లోనా ? లేక పిల్లల్లోనా ? స్కూళ్లలోనా ? పెంపకం లోనా ? విద్య విధానం లోనా ? మొత్తం సమాజం లోనా ?  
   
✳️✳️✳️✳️✳️✳️✳️ 

పిలల్లు దేవుడు చల్లని వారే .. పోస్ట్ ఒకటో భాగం . మరో రెండు భాగాలు త్వరలో ..
🙏🙏🙏🙏🙏 

ఈ మెసేజ్ ని   అందరితో షేర్ చేసుకోండి . ఎందుకంటే పిల్లలని పెంచడం ఒక సైన్స్ . ఒక ఆర్ట్ . అది తెలియక పొతే కుటుంబ,  దేశ భవిషత్తు అగమ్య గోచరం .తల్లితండ్రిగా సరయిన దారిలో సాగక పొతే ..  ఎంత కష్టపడినా ...  ఏమి సాదించినా...  నలబై లో పడితే సుఖం ఉండదు . అప్పుడైనా మేలుకోక పొతే యాభై అరవై లు నరకాన్ని చూపిస్తాయి.  .

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...