megadheera Posted June 10, 2022 Report Posted June 10, 2022 12 hours ago, JollyReddy said: Antha cheppi 3.25 antadendi mari Quote
Telugumoviereviews Posted June 10, 2022 Report Posted June 10, 2022 రెండు మతాలకు చెందిన ఇద్దరు యువతీ యువకులు ప్రేమలో పడితే, ఆ మతాలకు సంబంధించిన విశ్వాసాల కారణంగా వారు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయనే అంశంతో మనం ఇదివరకు కొన్ని సినిమాలు చూశాం. వాటిలో 'మరో చరిత్ర' లాంటి క్లాసిక్స్ కూడా ఉన్నాయి. కానీ మత విశ్వాసాల జోలికి పోకుండా రెండు భిన్న మతాలకు చెందిన ఓ యువకుడు, ఓ యువతి ప్రేమకథ రెండు అబద్ధాల కారణంగా ఎలాంటి ఇక్కట్లు పాలయ్యిందనే విషయాన్ని వినోదభరితంగా చెప్పడాన్ని మనం 'అంటే సుందరానికీ' మూవీలో చూస్తాం. అయితే ప్రథమార్ధంలో సుందర్, లీల స్కూలు డేస్ సీన్స్ మరీ ఎక్కువవడం, సుందర్ కంటే ముందే వంశీ అనే అతనితో లీల ప్రేమలో పడిందని చూపే సీన్స్ బోర్ కొట్టించాయి. సుందర్ క్యారెక్టరైజేషన్‌ను బిల్డప్ చేయడంలో బాల్యం నాటి ఘటనలు అతనిపై ప్రభావం చూపాయని తెలియజేయడానికి చైల్డ్‌హుడ్ సీన్స్ ఎక్కువగా పెట్టేయడంలో స్టోరీలో టెంపో పలుచనైపోయింది. సుందర్, లీల కలిసే ప్లాన్ చేసుకొని అమెరికాకు ప్రయాణమయ్యారని ఇంటర్వెల్‌లో ఓపెన్ అవడం బాగానే ఉంది కానీ.. అంతకు ముందు స్టోరీలో ల్యాగ్ ఎక్కువైందనే ఫీలింగ్ కలగడం సినిమాకు హాని చేకూర్చే ప్రమాదం ఉందని దర్శకుడు వివేక్ ఆత్రేయ గుర్తించలేకపోయాడు. అమెరికా నుంచి వచ్చాక లీలను భాగస్వామిగా చేసి సుందర్ చెప్పిన రెండు అబద్ధాలు సెకండాఫ్‌లో మంచి డ్రామాను పండించాయి. ఆ ఇద్దరి ఫ్రస్ట్రేషన్ మన ఫ్రస్ట్రేషన్ అవుతుంది. కానీ ఒక పెద్ద అబద్ధాన్ని కప్పిపుచ్చుకోడానికి సుందర్ పదే పదే అబద్ధాలు చెప్తూ రావడంతో మనకు అతడిపై సానుభూతితో పాటు కోపం కూడా వచ్చేస్తుంటుంది. ఇంక ఈ అబద్ధాలకు స్వస్తి చెప్పొచ్చు కదా అనిపిస్తుంది. అదే సమయంలో లీల అసహాయత, సుందర్‌ని నమ్మి తను కూడా అబద్ధాలు చెప్తూ, అలా చెప్తున్నందుకు ఆమె పడే యాతన మనల్ని కదిలిస్తుంది. సుందర్‌కూ, అతని తండ్రికీ మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. అనేక బ్రాహ్మణ ఇళ్లల్లోని వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ఆ తండ్రి కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు తన తల్లి అంటే సుందర్ వాళ్ల బామ్మ మీద ఆధారపడటం ఆ ఇళ్లల్లో సాధారణంగా కనిపించే మరో అంశం. క్లైమాక్స్‌లో లీలకు సంబంధించి మరో ట్విస్ట్ పెట్టి కథ ముగింపును మరింత ఆసక్తికరం చేయడానికి యత్నించాడు వివేక్ ఆత్రేయ. ఆ ట్విస్ట్‌కు ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అవుతారనేది సందేహం. అయితే ప్రేక్షకుల ఊహకు తగ్గట్లే ముగింపు ఉండటం రిలీఫ్‌నిస్తుంది. Fore more information visit Teluguone.com official website. Click here to get more information about Ante Sundaraniki movie. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.