psycopk Posted June 29, 2022 Report Posted June 29, 2022 పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు భార్య తేజస్విని 29-06-2022 Wed 09:51 2020లో వరంగల్‌కు చెందిన తేజస్వినిని రెండో వివాహం చేసుకున్న దిల్‌రాజు అనారోగ్యంతో 2017లో మృతి చెందిన మొదటి భార్య అనిత మొదటి భార్యతో దిల్‌రాజుకు ఇప్పటికే ఒక కుమార్తె రెండేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్న టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు (52) తండ్రయ్యారు. ఆయన భార్య తేజస్విని ఈ ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. దిల్‌రాజు మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2017లో మరణించారు. ఈ క్రమంలో 10 డిసెంబరు 2020లో వరంగల్‌కు చెందిన తేజస్వినిని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. దిల్‌రాజుకు మొదటి భార్య ద్వారా ఇప్పటికే ఓ కుమార్తె హన్షిత ఉంది. ఇదిలావుంచితే, దిల్‌రాజు ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ‘వారసుడు’ సినిమా చేస్తుండగా, రామ్‌చరణ్-శంకర్ కాంబోలో మరో సినిమా రూపొందుతోంది Quote
ARYA Posted June 29, 2022 Report Posted June 29, 2022 Congrats dil raju reddancle…ne manavadiki mavayya mi kannav.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.