Telugumoviereviews Posted July 29, 2022 Report Posted July 29, 2022 కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం 'సార్'(తమిళ్ లో 'వాతి'). తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకుడు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్ డైరెక్ట్ తెలుగులో నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. నేడు(జులై 28) ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా 'సార్' టీజర్ ను విడుదల చేశారు. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాకి రూపొందిస్తున్నట్లు టీజర్ ని బట్టి తెలుస్తోంది. 1990 లలో జరిగే కథ ఇది. విద్యని వ్యాపారంగా మార్చి విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటున్న వారిపై హీరో పోరాడినట్లుగా టీజర్ లో చూపించారు. ఈ సినిమా కోసం ధనుష్ సొంతంగా డబ్బింగ్ చెబుతుండటం విశేషం. టీజర్ లో 90ల నాటి రోజులను గుర్తు చేసేలా రియలిస్టిక్ గా ఉన్న విజువల్స్, జీవీ ప్రకాష్ మ్యూజిక్, ధనుష్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. For more information visit Teluguone.com official website Click here to get more details about Dhanush's Sir Teaser Quote
JambaKrantu Posted July 29, 2022 Report Posted July 29, 2022 Decent screenplay and elevations unte it might be a hit.. Quote
ShruteSastry Posted July 29, 2022 Author Report Posted July 29, 2022 Super 30 Shades unnay, but it will work in Tamil and Telugu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.