Skip to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Brahmastra review

Featured Replies

3 hours ago, BReBeL said:

Trailer reminded the graphics of devipurtudu and anji 🙏🏻

lol, i still remmber oka chota,

"open box lid.gif" ani kanipisthundhi 🤣

thammareddy bharadwaj ki relative ki idhi first vfx project

 

  • Replies 31
  • Views 3.3k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Brahmastra.webp

బాలీవుడ్‌లో ర‌ణ‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ జంట‌గా న‌టించిన 'బ్ర‌హ్మాస్త్ర' సినిమాను తెలుగులో 'బ్ర‌హ్మాస్త్రం' పేరుతో రిలీజ్ చేస్తున్నార‌నీ, దాన్ని య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి ప్రెజెంట్ చేస్తున్నాడ‌నీ తెలిసిన‌ప్పుడు.. స‌హజంగానే తెలుగు ప్రేక్ష‌కులు ఆ మూవీపై ఆస‌క్తి చూపించారు. త‌నే పిచ్చోడిన‌నుకుంటే, త‌న‌కంటే అయాన్ ముఖ‌ర్జీ ('బ్ర‌హ్మాస్త్ర' డైరెక్ట‌ర్‌) మ‌రింత పిచ్చోడిలా క‌నిపిస్తున్నాడ‌ని రాజ‌మౌళి ఇచ్చిన కితాబుతో ఈ సినిమాపై చాలామందిలో న‌మ్మ‌కం ఏర్ప‌డింది. 'వేక‌ప్ సిద్' డైరెక్ట‌ర్‌గా అప్ప‌టికే అయాన్ మంచి పేరు తెచ్చుకుని ఉన్నాడు. క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన 'బ్ర‌హ్మాస్త్రం మొద‌టి భాగం: శివ' ఇప్పుడు మ‌న ముందుకు వ‌చ్చేసింది.

క‌థ‌

శివ (ర‌ణ‌బీర్ క‌పూర్‌) అనే అబ్బాయి అనాథాశ్ర‌మంలో పెరుగుతాడు. అత‌నికి ఏడాది వ‌య‌సు ఉండ‌గా అగ్నిప్ర‌మాదంలో త‌ల్లి చ‌నిపోతుంది. కానీ అత‌డిని అగ్ని ఏమీ చేయ‌లేదు. తండ్రి గురించి అత‌నికేమీ తెలీదు. ద‌స‌రా, దీపావ‌ళి పండ‌గ‌ల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ట‌న‌లతో త‌న‌లో త‌న‌కే తెలీని ఏదో ర‌హ‌స్యం ఉంద‌ని అనుమానం క‌లుగుతుంది. అత‌డిని యోధుడిగా మార్చ‌గ‌ల కొన్ని శ‌క్తులు ఉన్నాయ‌ని తెలుస్తుంది. అస్త్రాల‌న్నింటికీ అధిప‌తి అయిన బ్ర‌హ్మాస్త్రం మూడు ముక్క‌లై, ఒక్కో ముక్క ఒక్కొక్క‌రి ద‌గ్గ‌ర ఉంద‌నే విష‌యం తెలుస్తుంది. విశ్వాన్ని అధీనంలోకి తెచ్చుకోవాల‌ని చూసే దేవ్ అనే ఓ మ‌హాశ‌క్తిసంప‌న్నుడి మ‌నుషులు జునూన్ (మౌనీ రాయ్‌) ఆధ్వ‌ర్యంలో ఆ బ్ర‌హ్మాస్త్రం ముక్క‌ల కోసం అన్వేషిస్తుంటారు. ఒక‌ముక్క మోహ‌న్ భార్గ‌వ (షారుక్ ఖాన్‌) అనే సైంటిస్ట్ ద‌గ్గ‌ర‌, ఇంకో ముక్క అనీశ్ శెట్టి (నాగార్జున‌) అనే ఆర్టిస్ట్‌ ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు క‌నిపెడుతుంది జునూన్‌. మూడో ముక్క ఎక్క‌డ ఉందో బ్ర‌హ్మాంశ గురువు (అమితాబ్ బ‌చ్చ‌న్‌)కు కూడా తెలీదు. అది ఎక్క‌డ ఉంది? జునూన్ బృందం బ్ర‌హ్మాస్త్రాన్ని సాధించిందా? అస‌లు శివ ఎవ‌రు? ఇషా (ఆలియా భ‌ట్‌)తో అత‌ని ప్రేమ క‌థ ఏ తీరానికి చేరింది? అనే విష‌యాలు మిగ‌తా క‌థ‌లో తెలుస్తాయి.

'బ్ర‌హ్మాస్త్రం' మొద‌టి భాగం ఒకింత నిరాశ‌ప‌రిచింది. ఇంత‌కుముందు మ‌నం చూడ‌నిదేదీ ఈ మూవీలో లేదు. ఈ త‌ర‌హా క‌థ‌లు, పాత్ర‌లు, స‌న్నివేశాలు, ఘ‌ట‌న‌లు, యాక్ష‌న్ సీన్లు ఎన్నెన్నింటినో ఇప్ప‌టికే మ‌నం చూసేశాం. ఓటీటీ వీక్ష‌కులైతే ఇలాంటివి కొల్ల‌లుగా చూసేసి ఉంటారు. మార్వెల్‌, డీసీ కామిక్స్ సినిమాల్లో మ‌నం చూసిన వాటినే 'బ్ర‌హ్మాస్త్రం'లో చూస్తాం. అంటే.. పార్సిల్ కొత్త‌దే కానీ, అందులో ఉన్న వ‌స్తువు పాత‌ది! విష‌యం బ‌ల‌హీనం! విజువ‌ల్‌గా మాత్రం ఈ సినిమా మెప్పిస్తుంది. For more information visit Teluguone.com official website

Click here to get full details about Brahmastra movie review

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.