Jump to content

Pawan Kalyan Shoes: ఆ ట్రోలింగ్ ఏంట్రా నాయనా? ఇక మారరా?


southyx
 Share

Recommended Posts

సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు చేస్తున్న హడావుడి చూస్తుంటే.. ‘కాదేది ట్రోలింగ్‌కి అనర్హం’ అనిపిస్తోంది. ఏ విషయమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ వస్తువైనా.. ఇలా ఏదైనా సరే.. ట్రోల్ చేయడానికి వెనుకాడటం లేదు.. అంతగా సోషల్ మీడియాని వారు వాడుతున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ (Rahul Gandhi) వేసుకున్న టీ షర్ట్‌పై బీజేపీ శ్రేణులు ట్రోలింగ్‌కు దిగితే.. ప్రధాని మోడీ కాస్ట్యూమ్స్ మార్చే తీరుపై కాంగ్రెస్, ఇతర పార్టీలు ట్రోలింగ్ నడిపాయి. సరే, అవి పాలిటిక్స్ అనుకుంటే.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, అందులోని వ్యక్తుల గురించి.. సోషల్ మీడియాలో నిత్యం ఏదో విధంగా ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అసలు ‘ట్రోలింగ్’ అనే పదం పుట్టిందే సినిమా ఇండస్ట్రీలో అన్నట్లుగా ఉంటుంది. అంతలా ఇండస్ట్రీపై ‘ట్రోలింగ్’ అనే పదం పెత్తనం చేస్తోంది. 

 

 

ఇక విషయంలోకి వస్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ (HariHara VeeraMallu) సినిమాకు సంబంధించిన ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఈ వర్క్‌షాప్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలలో పవన్ కల్యాణ్‌ని చూసిన వారంతా.. ఆశ్చర్యపోతుంటే.. ట్రోలింగ్ బాబులకి మాత్రం ఆ ఫొటోలలో ట్రోల్ చేయడానికి కొన్ని వస్తువులు కనిపించాయి. అవేంటని అనుకుంటున్నారా? పవన్ కల్యాణ్ చేతికి ఉన్న వాచ్ (Watch).. అలాగే ఆయన వేసుకున్న షూస్. ఆ వాచ్, షూస్ చాలా ఖరీదైనవని, కారు EMI కట్టడానికే డబ్బులు లేవన్నవాడు.. ఇలాంటి ఖరీదైన వస్తువులను ఎలా కొనుగోలు చేశాడు? అంటూ కొందరు ట్రైలర్ రాయుళ్లు పవన్ కల్యాణ్‌పై ట్రోలింగ్‌కి దిగారు. ఆయన వేసుకున్న వాచ్ ఖరీదు 14 లక్షల 37 వేలు అని, అలాగే షూస్ ఖరీదు 10 లక్షలు అని.. ఆయా వస్తువులకు సంబంధించిన ఖరీదు వివరాలను తెలిపే ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. వారు చూపిస్తున్న ఫొటోలలో ఆ షూస్ ధర 119 యూరోస్ అని ఉంది. ఆ లెక్కన చూస్తే.. వాటి ధర 10 వేల రూపాయలకి కూడా తక్కువే. కానీ యూరోస్‌ని ఇండియన్ కరెన్సీలో చూపించే విధానంలో మధ్యలో ఉన్న గుర్తుతో.. దానిని 10 లక్షలకు పరిగణిస్తూ.. కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాదండోయ్.. ‘జనసేన’ పార్టీకి వచ్చిన విరాళాలతో పవన్ ఇలా ఎంజాయ్ చేస్తున్నాడంటూ.. పెద్ద పెద్ద మాటలను కూడా వాడుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే.. మా హీరో షూస్ ఖరీదు కూడా చేయరు అంటూ.. కొందరు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ షూస్ విషయంలో ట్రోలింగ్‌లో భాగమవడం విడ్డూరమనే చెప్పుకోవాలి.

 

ఇక ఈ కామెంట్స్‌కు, ట్రోలింగ్‌కు కొందరు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ.. ఆయన ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలియదా. షూస్, వాచ్ అంటూ కూడా ఆయనపై ట్రోలింగ్‌కు దిగుతున్నారేంట్రా? మీ దుంపలు పిలకెయ్య.. ఏం పోయే కాలం రా మీకు.. అంటూ పవన్ కల్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.

 

Pawan Kalyan Shoes: ఆ ట్రోలింగ్ ఏంట్రా నాయనా? ఇక మారరా?

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

 Share

×
×
  • Create New...

Important Information

We have placed cookies on your device to help make this website better. You can adjust your cookie settings, otherwise we'll assume you're okay to continue.