Swatkat Posted November 10, 2022 Report Posted November 10, 2022 Desham lo yakada em jarigina e picha l..k… danlo untaaru. Quote
Swatkat Posted November 10, 2022 Author Report Posted November 10, 2022 @southyx delhi lo ed arrest chesindhi 3 days grilled Quote
southyx Posted November 10, 2022 Report Posted November 10, 2022 2 hours ago, Swatkat said: @southyx delhi lo ed arrest chesindhi 3 days grilled Delhi liquor scam lo arrest chesaru ani vinna. Konni weeks back grill chesaru. Aa time lo two weeks veedu Delhi lo ne unnadu. Adhe lo social media use cheyyadam kooda apesaadu. Modi ni ae vindham ga please cheyyalo ani every chance use chsukuntunnadu. Modi Vizag sabha ki dhaggarudi arrangments chesthunnadu. 3 lakh people sekharinchadaniki working ippudu. Quote
southyx Posted November 10, 2022 Report Posted November 10, 2022 Delhi liquor scam: దిల్లీ మద్యం కుంభకోణం.. మరో ఇద్దరు తెలుగువాళ్లు అరెస్టు దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేసింది. Updated : 10 Nov 2022 12:26 IST దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెనక శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్‌బాబును అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఇద్దరికి రూ.కోట్ల విలువైన మద్యం వ్యాపారం ఉందని ఈడీ పేర్కొంది. దిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు శరత్‌పై అభియోగాలున్నాయి. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్‌గా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌ను ఎఫ్‌ఆర్‌ఐలో గతంలో సీబీఐ ఎఫ్‌ఆర్‌ఐలో చేర్చింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో దిల్లీలో శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారుల ప్రశ్నించారు. దిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలను శరత్ చెల్లించారు. ఈ క్రమంలోనే ఆయన్ను విచారించిన ఈడీ.. గురువారం దిల్లీలో అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే గతంలో హైదరాబాద్‌కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. Quote
southyx Posted November 10, 2022 Report Posted November 10, 2022 పాపం నీలి బాచ్ .. గాలి రెడ్డి కేసులో శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ వచ్చింది అని చదివేలోపే .. అరబిందో రెడ్డి లోనికి పోయాడనే న్యూస్ వచ్చా .. మరీ ఈ అరబిందో రెడ్డి బాచ్ ఇట్టున్నారేంది? వీరు ఆల్రెడీ జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో వున్నారు .. ఓసారంటే ఏదో పొరపాటు అనుకోవచ్చు .. మరీ ప్రతిసారీనా ? ఆ హెటిరో రెడ్డి & రాంకీ రెడ్డి కూడా అంతే .. జగన్ రెడ్డి కేసుల్లో గాక మళ్లీ రీసెంట్ గా కొన్ని .. జగన్ రెడ్డి , విసా రెడ్డి , గాలి రెడ్డి , అరబిందో రెడ్డి , హెటిరో రెడ్డి , రాంకి రెడ్డి .. బలే తోడయ్యారులే ! ఈ ఫోటోలో అతనే ఈరోజు అరెస్టైన శరత్ రెడ్డి Quote
southyx Posted November 10, 2022 Report Posted November 10, 2022 లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన అరబిందో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్…. మోడీ సభకు 3 లక్షల మందిని తెస్తాం అన్నా లోపలేసేత్తారా దుర్మార్గులు… 1 Quote
RedThupaki Posted November 10, 2022 Report Posted November 10, 2022 1 hour ago, southyx said: పాపం నీలి బాచ్ .. గాలి రెడ్డి కేసులో శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ వచ్చింది అని చదివేలోపే .. అరబిందో రెడ్డి లోనికి పోయాడనే న్యూస్ వచ్చా .. మరీ ఈ అరబిందో రెడ్డి బాచ్ ఇట్టున్నారేంది? వీరు ఆల్రెడీ జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో వున్నారు .. ఓసారంటే ఏదో పొరపాటు అనుకోవచ్చు .. మరీ ప్రతిసారీనా ? ఆ హెటిరో రెడ్డి & రాంకీ రెడ్డి కూడా అంతే .. జగన్ రెడ్డి కేసుల్లో గాక మళ్లీ రీసెంట్ గా కొన్ని .. జగన్ రెడ్డి , విసా రెడ్డి , గాలి రెడ్డి , అరబిందో రెడ్డి , హెటిరో రెడ్డి , రాంకి రెడ్డి .. బలే తోడయ్యారులే ! ఈ ఫోటోలో అతనే ఈరోజు అరెస్టైన శరత్ రెడ్డి జగన్ రెడ్డి , విసా రెడ్డి , గాలి రెడ్డి , అరబిందో రెడ్డి , హెటిరో రెడ్డి , రాంకి రెడ్డి *Dodhukovadaam daachukovadamm...peru la thokaa unnnodikii dochii pettadamm...polisshhh ni addam petuukoni brathakatamm idhhii maaa REdddiiii lakii vachinaa brathuku dheruvuuu Quote
Popular Post RedThupaki Posted November 10, 2022 Popular Post Report Posted November 10, 2022 1 1 1 Quote
southyx Posted November 10, 2022 Report Posted November 10, 2022 Delhi liquor scam: దిల్లీ మద్యం కేసులో శరత్, వినయ్‌బాబుకు వారంపాటు ఈడీ కస్టడీ దిల్లీ మద్యం కేసులో శరత్ చంద్రారెడ్డి కీలకసూత్రధారిగా కస్టడీ రిమాండ్ రిపోర్టులో ఈడీ వెల్లడించింది. శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులకు వారంపాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. Updated : 10 Nov 2022 19:41 IST దిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వేగవంతం చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెనక శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్‌బాబును ఈడీ అరెస్టు చేసింది. ఈ ఇద్దరికి రూ.కోట్ల విలువైన మద్యం వ్యాపారం ఉందని ఈడీ పేర్కొంది. దిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు శరత్‌పై అభియోగాలున్నాయి. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్‌గా ఉన్నారు. శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఈడీ అధికారులు ఈరోజు మధ్యాహ్నం దిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. నిందితులిద్దరినీ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయగా .. వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. 24 గంటలకు ఒకసారి నిందితులకు వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది. సీసీ టీవీ పర్యేవేక్షణలో విచారణ జరపాలని, రోజుకు ఒకసారి సాయంత్రం 5 నుంచి 6గంటల మధ్య కుటుంబ సభ్యులను కలిసేందుకు అవకాశం కల్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. తదుపరి విచారణను ప్రత్యేక కోర్టు ఈనెల 17కి వాయిదా వేసింది. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడి దిల్లీ మద్యం కేసులో శరత్ చంద్రారెడ్డి కీలక సూత్రధారిగా కస్టడీ రిమాండ్ రిపోర్టులో ఈడీ వెల్లడించింది. ‘‘దిల్లీ లిక్కర్ మార్కెట్‌లో 30శాతం తన గుప్పిట్లో పెట్టుకున్నారు. బినామీ కంపెనీల ద్వారా శరత్ చంద్రారెడ్డి 9 రిటైల్ జోన్స్ పొందారు. ఆయన ఆధ్వర్యంలోనే సౌత్‌గ్రూప్ ఏర్పాటు చేశారు. సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్లు చెల్లించారు. విజయ్‌నాయర్ ద్వారా రూ.100 కోట్లు ముడుపులు చెల్లించారు. శరత్‌కు చెందిన 3 కంపెనీల ద్వారా రూ.64కోట్లు అక్రమంగా సంపాదించారు. సుమారు రూ.60కోట్లు ఇండో స్పిరిట్స్ కంపెనీకి తరలించారు’’ అని ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. Quote
southyx Posted November 10, 2022 Report Posted November 10, 2022 140 ఫోన్లు.. లంచాలకు ప్రత్యేక వ్యవస్థ.. లిక్కర్ స్కామ్‌లో 34 మంది పాత్ర బయటపడిందని, 6 రిటైల్ జోన్ల కోసం పెద్ద మొత్తంలో ముడుపులను ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది.. అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రూ.64 కోట్ల వరకు మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడని ఈడీ తెలిపింది.. లంచాలు ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాడని తెలిపింది.. స్కామ్ లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రోలు కీలకపాత్ర పోషించినట్లు తేల్చింది.. 100 కోట్ల వరకు లంచాలు ఇచ్చినట్లు తెలిపింది.. 34మంది నిందితులు 140 ఫోన్లు మార్చారని.. లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే ఫోన్లు మార్చినట్లు తెలిపింది.. సెల్‌ఫోన్లు మార్చడం కోసం ₹1.20 కోట్లు ఖర్చు చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.. ఇదే ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఉంది మరి.. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ప్రాణాలు మరి.. __కె సత్యనారాయణ Quote
southyx Posted November 10, 2022 Report Posted November 10, 2022 దిల్లీ మద్యం వ్యాపారంలో.. 30 శాతం శరత్ గుప్పిట్లోనే! దిల్లీ మద్యం కుంభకోణంలో పెనక శరత్ చంద్రారెడ్డి కీలకంగా చక్రం తిప్పారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో ఈడీ పలు అభియోగాలను ప్రస్తావించింది. Updated : 11 Nov 2022 02:58 IST బినామీ కంపెనీలతో కలిసి 9 జోన్లు నిర్వహిస్తున్నారు ఇప్పటివరకు రూ.64 కోట్లు మూటగట్టుకున్నారు ఆయన భాగస్వామిగా ఉన్న సౌత్‌గ్రూప్ సిండికేట్ రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పింది రిమాండ్ రిపోర్టులో ఈడీ వెల్లడి ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణంలో పెనక శరత్ చంద్రారెడ్డి కీలకంగా చక్రం తిప్పారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో ఈడీ పలు అభియోగాలను ప్రస్తావించింది. ‘దిల్లీ మద్యం విధానం ప్రకారం ఏ వ్యక్తి కూడా రెండు రిటైల్ జోన్లకు మించి నియంత్రించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా శరత్‌చంద్రారెడ్డి తన గ్రూప్ అయిన ట్రైడెంట్ కెమ్‌ఫర్ ప్రైవేట్ లిమిటెడ్, బినామీ సంస్థలైన ఆగ్రానోమిక్స్ ఎకో సిస్టమ్స్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ద్వారా 5 రిటైల్ జోన్లను నియంత్రిస్తున్నారు. శరత్ చంద్రారెడ్డి పెట్టుబడుల ద్వారా ఈ బినామీ కంపెనీలను తన గుప్పిట్లో ఉంచుకున్నారు. శరత్ ఆదేశాల మేరకు పైన పేర్కొన్న మూడు కంపెనీలకు చెందిన కార్యకలాపాలను తాము చూస్తున్నట్లు ఆయన కింద పనిచేసే ఉద్యోగులు చెప్పారు. తయారీదారులు, టోకు, చిల్లర వ్యాపారులతో కలిపి సౌత్‌గ్రూప్ పేరుతో ఏర్పాటైన అతిపెద్ద సిండికేట్‌లో శరత్ చంద్రారెడ్డి ప్రధాన భాగస్వామి. ఈ సిండికేట్‌లో మద్యం తయారీదారు సమీర్ మహేంద్రుతో పాటు, దేశంలో అతిపెద్ద మద్యం తయారీ సంస్థ అయిన పెర్నాడ్ రికార్డ్ (పీఆర్‌ఐ) భాగస్వాములుగా ఉన్నాయి. ఇండో స్పిరిట్స్ అనే సంస్థను పీఆర్‌ఐ సంస్థ తన హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్‌గా నియమించింది. అయితే ఇండోస్పిరిట్స్ సంస్థ సమీర్ మహేంద్రు, అరుణ్‌పిళ్లై, ప్రేమ్ రాహుల్ మండూరిల చేతుల్లో ఉంది. ఇందులో శరత్ చంద్రారెడ్డితో పాటు, ఇతర బినామీలకు ఆర్థిక ప్రయోజనాలున్నాయి. ఇండో స్పిరిట్స్‌లో శరత్ చంద్రారెడ్డి కూడా పెట్టుబడులు పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. * శరత్ చంద్రారెడ్డి నడుపుతున్న సౌత్‌గ్రూప్ పలు బినామీ సంస్థల ద్వారా తొమ్మిది రిటైల్ జోన్లను తన అధీనంలో ఉంచుకుంది. తన మూడు కంపెనీల ద్వారా 5 రిటైల్ జోన్లను, సిండికేట్‌లో సభ్యులుగా ఉన్న ఇతరుల ద్వారా మరో 4 జోన్లను శరత్ నడుపుతున్నారు. ముడుపులు ముట్టచెప్పడం, బినామీ సంస్థలు నడపడం, మద్యం పరిశ్రమలోని వివిధ భాగస్వాములతో కుట్ర పన్నడం లాంటి అవినీతి కార్యకలాపాలతో ఈ సిండికేట్ దిల్లీ మద్యం మార్కెట్‌లో 30 శాతాన్ని నియంత్రిస్తోంది. * శరత్ చంద్రారెడ్డి, ఇతరుల ఆధ్వరంలో నడుస్తున్న సౌత్‌గ్రూప్ సిండికేట్ విజయ్‌నాయర్ ద్వారా రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పింది. ఇలా చేసిన చెల్లింపులను పలు రిటైల్ జోన్లు, ఇండోస్పిరిట్స్ ద్వారా ముందుగా రాబట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దర్యాప్తు పురోగతిలో ఉంది. * శరత్ చంద్రారెడ్డికి చెందిన రిటైల్‌జోన్లలో ఉన్న సర్వర్లను ఉద్యోగులు వేరే చోటికి తరలించేందుకు ప్రయత్నించినట్లు సోదాలు నిర్వహించినప్పుడు తెలిసింది. ఆ సర్వర్లను విశ్లేషించినప్పుడు అవంతిక, ట్రైడెంట్ సంస్థలకు చెందిన రెండు రిటైల్ జోన్లకు సంబంధించిన సమాచారం అందులో ఉన్నట్లు తేలింది. శరత్ నిర్దేశాల మేరకు కీలకమైన డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను తమ కార్యాలయ ప్రాంతాల నుంచి తొలగించినట్లు ఒక ఉద్యోగి చెప్పారు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేశారు. ట్రైడెంట్ మినహా మిగిలిన సంస్థల పేరుతో తనకు ఎలాంటి రిటైల్ జోన్లు లేవని శరత్ చంద్రారెడ్డి చెప్పినప్పటికీ అవంతిక, ట్రైడెంట్ సంస్థలకు చెందిన సర్వర్లను తరలించమని ఆయన ఆదేశాలు జారీచేశారు. ఆ సర్వర్లను విశ్లేషించినప్పుడు నేరనిరూపణకు అవసరమైన సమాచారం అందులో ఉన్నట్లు తేలింది. * ఇండో స్పిరిట్స్ సంస్థ సొంతంగా శరత్ చంద్రారెడ్డి సంస్థలకు అధిక క్రెడిట్ నోట్లు జారీ చేసింది. తయారీదారులేమీ ఆ క్రెడిట్‌నోట్స్‌ను ట్రైడెంట్, అవంతిక, ఆగ్రానోమిక్స్‌కి జారీ చేయమని కోరుతూ ఇండోస్పిరిట్‌కి ఇవ్వలేదు. తయారీదారులు ఇవ్వకపోయినా క్రెడిట్‌నోట్స్ జారీ చేయడం మోసపూరితం. రూ.4.35 కోట్ల విలువైన క్రెడిట్‌నోట్స్‌ను ఇండో స్పిరిట్ ఈ మూడు సంస్థలకు జారీ చేయడానికి ప్రధాన కారణం శరత్ చంద్రారెడ్డి చేతుల్లో ఉన్న రిటైల్‌జోన్లకు అనుచిత లాభాలు/ప్రయోజనాలు బదిలీ చేయడమే. టోకు వ్యాపారులకు అదనంగా ఇచ్చిన 7% మార్జిన్‌ను లంచం రూపంలో ఇలా బదిలీ చేశారు. * దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి చాలా క్రెడిట్‌నోట్స్‌ను వెనక్కు తీసుకున్నట్లు 2022 ఆగస్టులో కాగితాలమీద చూపారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించిన తర్వాత ఆ పనిచేశారు. దీన్నిబట్టి ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన రూ.60 కోట్లు ట్రైడెంట్ కెమ్‌ఫర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆగ్రానోమిక్స్ ఎకో సిస్టమ్స్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ఆధ్వర్యంలోని రిటైల్‌జోన్లకు సంబంధించిందని స్పష్టంగా తెలుస్తోంది. ఎలాంటి సిండికేట్లు లేకుండా వ్యాపారం చేసే జోన్లతో పోలిస్తే వీటి దగ్గర ఇంత భారీ మొత్తం మిగలడం అన్నది అసాధారణం. * శరత్ చంద్రారెడ్డికి చెందిన రిటైల్ గ్రూపుల వద్ద ఉన్న మిగులు మొత్తం గురించి ఏమీ అడగొద్దని సమీర్ మహేంద్రు తన ఫైనాన్స్ బృందానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీన్నిబట్టి ఈ రూ.60 కోట్లు, ఇంతకుముందు పేర్కొన్న రూ.4.35 కోట్ల క్రెడిట్ నోట్స్ అన్నీ నేరపూరితంగా కూడగట్టుకొన్న సొమ్మే. * వివిధ వ్యాపారులు, రాజకీయ నాయకులతో కలిసి శరత్ చంద్రారెడ్డి పక్కా ప్రణాళిక, కుట్ర ప్రకారం మోసపూరిత మార్కెట్ విధానాల ద్వారా దిల్లీ మద్యం విధానం నుంచి అనుచిత ప్రయోజనం పొందడానికి ప్రయత్నించినట్లు ఈ అంశాలు స్పష్టం చేస్తున్నాయి. శరత్ చంద్రారెడ్డి కుట్రపూరితంగా సిండికేట్ ద్వారా విస్తృత మార్కెట్‌ను నడపడం అన్నది కూడా దిల్లీ మద్యం విధానానికి విరుద్ధం. అవినీతిపనులు, కుట్ర ద్వారా ఆయన రూ.64.35 కోట్ల సొమ్మును కూడగట్టారు. * ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తు ప్రకారం నేరపూరితంగా సొమ్మును రాబట్టుకొని, దగ్గర ఉంచుకోవడంతోపాటు దాన్ని ఉపయోగించడంలో శరత్ చంద్రారెడ్డి పాలుపంచుకున్నట్లు తేలింది. మనీలాండరింగ్ నేరం కింద ఆయన నిందితుడు. దర్యాప్తునకు అతిముఖ్యమైన సమాచారం ఆయన వద్ద ఉంది. అందుకే పీఎంఎల్‌ఏ-2002 సెక్షన్ 19 కింద ఆయనను దిల్లీ ఈడీ ఆఫీసులో అరెస్టు చేశాం. వెంటనే ఆ విషయాన్ని ఆయన సతీమణికి ఫోన్ ద్వారా చెప్పాం. * ఇప్పటివరకు నిర్వహించిన 169 సోదాల ద్వారా భారీగా డిజిటల్, ఫిజికల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు అందులోని వివరాల గురించి ఆయనను విచారించాల్సి ఉంది. దిల్లీ ప్రభుత్వానికి జరిగిన రూ.2,631 కోట్ల ఆదాయ నష్టం గురించీ కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది. మొత్తం నేరం పూర్వాపరాలను రాబట్టి ఇప్పటివరకు నేరపూరితంగా సంపాదించిన సొమ్మునంతా వెలికి తీయాల్సి ఉంది’ అని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. 140 ఫోన్లు ధ్వంసం చేశారు దిల్లీ మద్యం కుంభకోణంలో కీలకంగా ఉన్న 34 మంది వ్యక్తులు సాక్ష్యాలను చెరిపేయడానికి ఇప్పటివరకు రూ.1.20 కోట్ల విలువైన 140 ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇందులో ప్రధాన నిందితులు, పెద్ద మద్యం వ్యాపారులు, సీనియర్ ప్రభుత్వాధికారులు, దిల్లీ ఎక్సైజ్ మంత్రి, ఇతర అనుమానితులు ఉన్నట్లు తెలిపింది. ఫోన్లు మార్చిన విషయాన్ని గమనిస్తే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ పని చేసినట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. Quote
southyx Posted November 10, 2022 Report Posted November 10, 2022 దిల్లీ మద్యం కుంభకోణం.. అరబిందో శరత్ ‘అరెస్ట్’ సంచలనం రేపిన దిల్లీ మద్యం కుంభకోణంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో గ్రూప్ డైరెక్టర్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన పెనక శరత్ చంద్రారెడ్డితో పాటు, పెర్నాడ్ రికార్డ్ కంపెనీకి చెందిన బినోయ్ బాబు అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. Updated : 11 Nov 2022 02:55 IST ఆయన.. ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు జగన్ అక్రమాస్తుల కేసులోనూ నిందితుడు దిల్లీ మద్యం వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారని అభియోగం రూ. 64 కోట్ల లాభం ఆర్జించారని ఆరోపణ రూ.వందల కోట్లు చేతులు మారాయి సాక్ష్యాలను చెరిపేసేందుకు 140 ఫోన్లను ధ్వంసం చేశారు మరో నిందితుడు సహా కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ 7 రోజుల కస్టడీకి అప్పగించిన కోర్టు 11.69% పడిపోయిన అరబిందో ఫార్మా షేరు ఈనాడు, దిల్లీ: సంచలనం రేపిన దిల్లీ మద్యం కుంభకోణంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో గ్రూప్ డైరెక్టర్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన పెనక శరత్ చంద్రారెడ్డితో పాటు, పెర్నాడ్ రికార్డ్ కంపెనీకి చెందిన బినోయ్ బాబు అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్ ఏర్పాటు చేసుకొని అవినీతి మార్గంలో సొమ్ము కూడగట్టుకొని ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారన్న అభియోగాలపై బుధవారం అర్ధరాత్రి దాటాక 12.20 గంటల సమయంలో ఈడీ వీరిద్దర్నీ అదుపులోకి తీసుకుంది. గురువారం మధ్యాహ్నం ఇక్కడి రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరించింది. దిల్లీ మద్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి కీలక వ్యక్తి అని ఈడీ తన రిమాండ్ నివేదికలో ఆరోపించింది. ఆయన తన సొంత, బినామీ కంపెనీలతో కలిసి 9 జోన్లను చేజిక్కించుకొని మొత్తం దేశరాజధాని దిల్లీలో జరిగే మద్యం వ్యాపారంలో 30 శాతాన్ని నియంత్రిస్తున్నారని పేర్కొంది. ఇప్పటివరకు దొరికిన సాక్ష్యాధారాలను బట్టి కుంభకోణం నడిచిన విధానాన్ని వెలుగులోకి తీసుకురావాల్సి ఉన్నందున వీరిని 14 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా కోర్టు వారిని ఏడు రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. నిందితుల తరఫు న్యాయవాదుల కోరిక మేరకు విచారణను సీసీ కెమెరాల పర్యవేక్షణలో చేయాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.కె.నాగ్‌పాల్ ఆదేశించారు. రోజూ సాయంత్రం అయిదు-ఆరు గంటల మధ్యలో శరత్ చంద్రారెడ్డి భార్య, బినోయ్ బాబు భార్య, తమ్ముళ్లలో ఒకరు, ఇద్దరు న్యాయవాదులు వారిని కలిసి మాట్లాడే అవకాశం కల్పించారు. భద్రతా కారణాల నేపథ్యంలో ఇంటి భోజనానికి అవకాశం ఇచ్చేందుకు జడ్జి తిరస్కరించారు. శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో అరబిందో ఫార్మా షేరు విలువ 11.69 శాతం మేర పడిపోయింది. బుధవారం నాటితో పోల్చితే.. రూ. 3700 కోట్ల మార్కెట్ విలువను ఆ కంపెనీ కోల్పోయింది. దిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణలో ఇంతకుముందే సీబీఐ, ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేసి బోయినపల్లి అభిషేక్‌రావును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోనూ మరికొన్ని అరెస్టులుంటాయన్న ప్రచారం జరుగుతోంది. శరత్‌కు భారీగా లబ్ధి: దిల్లీ మద్యం విధాన కుంభకోణంలో శరత్ భారీగా లబ్ధి పొందినట్లు ఈడీ వెల్లడించింది. దిల్లీ మద్యం విధానాన్ని ఆసరాగా చేసుకొని సిండికేట్ ద్వారా అక్రమ మార్గంలో పెద్దమొత్తం కూడగట్టుకున్నట్లు ఆధారాలు సేకరించిన ఈడీ.. శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులను బుధవారం విచారణకు పిలిపించింది. అనంతరం అర్ధరాత్రి అరెస్టు చేసింది. గురువారం మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.కె.నాగ్‌పాల్ ఎదుట ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది భూషణ్ వాదనలు వినిపించారు. ‘దిల్లీ మద్యం విధానం ద్వారా శరత్ చంద్రారెడ్డి భారీగా లబ్ధి పొందారు. మద్యం వేలంలో పాలొన్న వివిధ కంపెనీలకు విజయ్ నాయర్‌కు చెందిన ఇండో స్పిరిట్ ద్వారా రూ.200 కోట్ల బ్యాంకు గ్యారంటీలను ఇప్పించారు. వివిధ కంపెనీలను సిండికేట్‌గా మార్చడం ద్వారా రూ.64 కోట్ల లాభం పొందినట్లు తెలుస్తోంది. ఈ దందాలో రూ.వందల కోట్లు చేతులు మారాయి. సాక్ష్యాలను చెరిపేసేందుకు శరత్ చంద్రారెడ్డి కంపెనీల ఉద్యోగులు మొబైల్ ఫోన్లు, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలను ధ్వంసం చేశారు. మరిన్ని వివరాల సేకరణకు 14 రోజుల పాటు ఆయనను ఈడీ కస్టడీకి ఇవ్వాలి’ అని జడ్జిని కోరారు. ‘ఉద్యోగులను ఈడీ అధికారులు హింసిస్తున్నారు’ శరత్ చంద్రారెడ్డి న్యాయవాది మనూ శర్మ వాదనలు వినిపిస్తూ ‘దిల్లీ మద్యం విధానంలో ఎవరిని అరెస్టు చేసినా ఈడీ ఒకే కథ చెబుతోంది. అక్కడ ఎటువంటి కుంభకోణం లేదు. విచారణకు పిలిచిన సమయంలో శరత్ చంద్రారెడ్డి కంపెనీకి చెందిన ఉద్యోగులను ఈడీ అధికారులు హింసిస్తున్నారు. చందన్ అనే ఉద్యోగిని తీవ్రంగా కొట్టడంతో అతని ఎడమ చెవి వినిపించడం లేదు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం’ అన్నారు. దీనిపై ఈడీ తరఫు న్యాయవాది ఖండించారు. తాము తప్పు చెప్పడం లేదని, చందన్ చెవి వినపడకపోవడంపై సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నివేదిక ఇచ్చిందని శరత్ న్యాయవాది పేర్కొంటూ దాన్ని జడ్జికి అందజేశారు. దీనిపై పోలీసు కేసు నమోదైందని తెలిపారు. ఈడీ న్యాయవాది స్పందిస్తూ సాక్ష్యాలను ధ్వంసం చేసిన వారు అమాయకులనడం సరికాదన్నారు. సాక్ష్యాలను చెరిపేసినట్లుగానే చెవి దెబ్బతిన్నట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈడీ తీరుతో తమ క్లయింట్‌కు చెందిన కంపెనీ ఉద్యోగులు భయంతో ఉద్యోగాలు మానేశారని, ఆయనకు ఎంతో నష్టం వాటిల్లిందని శరత్ చంద్రారెడ్డి న్యాయవాది తెలిపారు. విచ్చలవిడిగా వ్యవహరించే వారికి కొంత భయం ఉండడం మంచిదేనని ఈడీ న్యాయవాది వ్యాఖ్యానించారు. ఇరుపక్షాల న్యాయవాదులు తీవ్రంగా వాదనలు కొనసాగిస్తుండడంతో జోక్యం చేసుకున్న ప్రత్యేక జడ్జి ఎం.కె.నాగ్‌పాల్ కొంత భయం మంచిదే కానీ తీవ్రంగా భయపెట్టడం సరికాదని చమత్కరించారు. ఈడీ కస్టడీలో హింసిస్తున్నందున సీసీ కెమెరా పర్యవేక్షణలో విచారణ జరిపేలా చూడాలని శరత్ తరఫు న్యాయవాది కోరగా అందుకు జడ్జి అంగీకరించారు. ఇదే కేసులో అరెస్టయిన బినోయ్‌బాబు తరఫు న్యాయవాది మదన్ ఖురానా వాదనలు వినిపిస్తూ సీబీఐ విచారణలో సాక్షిగా ఉన్న బినోయ్ బాబు ఈడీ కేసులో నిందితునిగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సీబీఐ కేసులో ఇదే కోర్టులో బినోయ్ బాబు బుధవారం విచారణకు హాజరయ్యారని.. అర్ధరాత్రి ఈడీ అదుపులోకి తీసుకుందని తెలిపారు. వాదనల అనంతరం జడ్జి నాగ్‌పాల్.. శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులను 7 రోజుల ఈడీ కస్టోడియల్ విచారణకు ఇచ్చారు. జగన్‌కు సంబంధించిన సీబీఐ, ఈడీ కేసుల్లోనూ.. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల్లోనూ శరత్‌చంద్రారెడ్డి నిందితుడిగా ఉన్నారు. హెటిరో, అరబిందోలకు భూకేటాయింపుల కేసులో సీబీఐ దాఖలు చేసిన మొదటి అభియోగ పత్రంలో 8వ నిందితుడిగా శరత్‌చంద్రారెడ్డిని పేర్కొన్నారు. అరబిందోకు కేటాయించిన 30.33 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా అనుబంధ కంపెనీ అంటూ ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌కు బదలాయింపుల వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందుకు ప్రతిఫలంగా ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో రూ.7 కోట్లు పెట్టుబడులు పెట్టింది. అరబిందో ఛైర్మన్ పి.వి.రాంప్రసాద్‌రెడ్డి రూ.5 కోట్లు రుణం తీసుకుని ట్రైడెంట్ లైఫ్‌సైన్సెస్‌కు బదలాయించగా అదే రోజు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ జగన్ కంపెనీ జగతిలో పెట్టుబడుల నిమిత్తం చెక్ జారీ చేసింది. మరో రూ.2 కోట్లు ట్రైడెంట్ అనుబంధ కంపెనీ ట్రైడెంట్ చెంపహార్ నుంచి రుణం తీసుకుని జగతిలోకి మళ్లించింది. దీనికి సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కూడా ఈడీ కేసు నమోదు చేసింది. ఇందులో శరత్ చంద్రారెడ్డి 12వ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులపై సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతోంది. కుప్పకూలిన అరబిందో ఫార్మా షేరు విలువ ఒకే రోజు 11.69 శాతం పతనం ఈనాడు, హైదరాబాద్: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో పి.శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేయడం స్థానిక కార్పొరేట్ వర్గాల్లో, స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో చర్చనీయాంశంగా మారింది. ఈ అరెస్టు ప్రభావం అరబిందో ఫార్మా షేరు ధరపై కనిపించింది. కొంతకాలంగా అరబిందో ఫార్మా షేరు స్టాక్ మార్కెట్లో మదుపరులను పెద్దగా ఆకర్షించడం లేదు. గరిష్ఠ ధర అయిన రూ.900 నుంచి గత ఏడాదిన్నర కాలంలో ఈ షేరు విలువ బాగా పతనమైంది. గత మూడు నెలలుగా రూ.550- 575 శ్రేణిలో ట్రేడ్ అవుతోంది. శరత్ చంద్రారెడ్డి అరెస్టు కాగానే, గురువారం అరబిందో ఫార్మా షేరు ఒక్కసారిగా తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్‌ఈలో బుధవారం ముగింపు ధర రూ.541 కాగా, గురువారం 11.69 శాతం (రూ.63.30) నష్టపోయి రూ.478.10 వద్ద స్థిరపడింది. బుధవారంతో పోల్చితే దాదాపు రూ.3,700 కోట్ల మార్కెట్ విలువను ఈ కంపెనీ కోల్పోయింది. అరబిందో ఫార్మాకు సంబంధం లేదు: ఈ నేపథ్యంలో అరబిందో ఫార్మా వివరణ ఇచ్చింది. శరత్ చంద్రారెడ్డికి అరబిందో ఫార్మా కార్యకలాపాలతో కానీ, దాని అనుబంధ కంపెనీల కార్యకలాపాలతో కానీ సంబంధం లేదని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన కంపెనీ బోర్డులో హోల్‌టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారని వివరించింది. Quote
southyx Posted November 10, 2022 Report Posted November 10, 2022 విజయసాయి అల్లుడికీ లింకు! వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డికి దిల్లీ మద్యం కుంభకోణంలో సంబంధం ఉన్నట్లు బయటపడింది. Updated : 11 Nov 2022 02:54 IST దిల్లీ మద్యం కుంభకోణంలో శరత్‌చంద్రారెడ్డి అరెస్టుతో వెలుగులోకి.. ట్రైడెంట్ కెమ్‌ఫర్ సంస్థలో రోహిత్‌రెడ్డి డైరెక్టర్ ఈనాడు- హైదరాబాద్, అమరావతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డికి దిల్లీ మద్యం కుంభకోణంలో సంబంధం ఉన్నట్లు బయటపడింది. రోహిత్‌రెడ్డి సోదరుడు, అరబిందో గ్రూపు డైరెక్టర్ అయిన పి.శరత్‌చంద్రా రెడ్డిని దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూస్తోంది. శరత్ అరెస్టు తర్వాత కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ అనేక కీలకాంశాలను వెల్లడించింది. దిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యపాత్ర పోషించిన లబ్ధిదారుల్లో శరత్ చంద్రారెడ్డి ఒకరని, అధికారిక విధానం పరిమితిని దాటి తన గ్రూప్ కంపెనీ అయిన ట్రైడెంట్ కెమ్‌ఫర్ లిమిటెడ్, మరికొన్ని బినామీ కంపెనీల ద్వారా అధిక రిటైల్ వ్యాపార జోన్లను నియంత్రిస్తున్నారని అందులో ఉంది. ఈడీ పేర్కొన్న ట్రైడెంట్ కెమ్‌ఫర్ లిమిటెడ్ నేపథ్యం ఏమిటా అని తీగ లాగితే విజయసాయి అల్లుడు రోహిత్‌రెడ్డి పేరు బయటకు వచ్చింది. ట్రైడెంట్‌లో 99.99 శాతం వాటాలు ఆర్.పి.ఆర్. సన్స్ అడ్వయిజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుమీద ఉన్నాయి. అంటే ట్రైడెంట్‌కు మాతృసంస్థ ఆర్.పి.ఆర్. సన్స్ అన్నమాట. ఆ కంపెనీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డిదే. రోహిత్‌రెడ్డి ఆర్.పి.ఆర్.లో డైరెక్టర్‌గా 2021 ఏప్రిల్ 21న చేరారు. ఇందులో ఆయనతోపాటు పి.వెంకట రామ్‌ప్రసాద్‌రెడ్డి, పి.సుశీలారాణి కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. అంటే దిల్లీ మద్యం కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన ట్రైడెంట్ కెమ్‌ఫర్ కంపెనీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు చెందినదేనని స్పష్టమవుతోంది. ఆంధ్ర మద్యం వ్యాపారంతోనూ లింకులు ప్రస్తుతం దిల్లీ మద్యం కుంభకోణంలో కూరుకుపోయిన ట్రైడెంట్ వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వ ఆశీస్సులతో మారుపేర్లతో కొనసాగుతున్నాయి. వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక 2019 డిసెంబరులో నమోదైన ‘ఆదాన్ డిస్టిలరీస్’ అనే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.1164 కోట్ల విలువైన 68 లక్షల కేసుల మద్యం సరఫరాకు ఆర్డర్లు ఇచ్చింది. ఆదాన్ డిస్టిలరీస్‌కు డైరెక్టర్‌గా ఉన్న కాశీచయనుల శ్రీనివాస్.. దిల్లీ మద్యం కుంభకోణంలో పాత్రధారి కంపెనీ అయిన ట్రైడెంట్‌కు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. దీన్ని బట్టి రెండు సంస్థలకు కేంద్ర బిందువు ఒక్కటేనని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వ పెద్దలు ఎంత ‘విజయ’వంతంగా తమ దోపిడీకి అనుకూలంగా మలుచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రలో అవినీతి కిక్కుకు బాగా అలవాటుపడి దాన్ని దేశ రాజధాని వరకు విస్తరించారని ఈ ఉదంతంతో స్పష్టమవుతోంది. ఏంటీ ఆదాన్ కథ? వైకాపా ప్రభుత్వం 2019 అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి తెచ్చింది. తర్వాత సరిగ్గా రెండు నెలలకు డిసెంబరు 2న ‘ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేటు లిమిటెడ్’ సంస్థ హైదరాబాద్‌లో పురుడుపోసుకుంది. సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేకపోయినా ఆ సంస్థ ఏర్పాటైన రెండేళ్లలోనే (2019 డిసెంబరు 2 నుంచి 2021 నవంబరు 30 మధ్య) ఏపీఎస్‌బీసీఎల్ రూ.1164.86 కోట్ల విలువైన 68.02 లక్షల కేసుల మద్యం సరఫరా కోసం ఆర్డర్లు ఇచ్చింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వద్ద వందకు పైగా కంపెనీలు నమోదు చేసుకుంటే వాటిలో 16 కంపెనీలకే 74 శాతం ఆర్డర్లు దక్కాయి. వాటిలో అధిక శాతం ఆర్డర్లు దక్కించుకున్న సంస్థ ఆదాన్ కావడం గమనార్హం. సొంతంగా డిస్టిలరీలు లేకపోవడంతో ఆదాన్... విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్, నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లను లీజుకు తీసుకుని.. ఏసీ బ్లాక్ రిజర్వ్ విస్కీ, ఆదాన్స్ సుప్రీం బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ, అరిస్టోక్రాట్ ప్రీమియం క్లాసిక్ విస్కీ తదితర బ్రాండ్ల మద్యాన్ని ఉత్పత్తి చేస్తోంది. అప్పట్లో రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొన్ని నెలలపాటు ఆ బ్రాండ్ల మద్యాన్నే విక్రయించాలని సిబ్బందికి లక్ష్యాలు కూడా నిర్దేశించారు. ఈ అనుబంధాలు చాలా స్ట్రాంగ్ గురూ..! ప్రభుత్వ ఆశీస్సులు, అండదండలతో స్వల్పకాలంలోనే రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో కీలక శక్తిగా ఎదిగిన ఆదాన్ సంస్థ.. అధికార పార్టీ అగ్రనేతలదేనన్న ఆరోపణలున్నాయి. కానీ వారెవరూ తెరమీద ఉండరు. కంపెనీ రికార్డుల్లోనూ వారి పేర్లు కనిపించవు. తీగ లాగితే.. ఆదాన్ డైరెక్టర్లకు, ప్రభుత్వ పెద్దలకు మధ్య ఉన్న అనుబంధాల డొంక కదులుతుంది. * కాశీచయనుల శ్రీనివాస్, ముప్పిడి అనిరుధ్‌రెడ్డి డైరెక్టర్లుగా ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. కాశీచయనుల శ్రీనివాస్... ట్రైడెంట్ కెమ్‌ఫర్ లిమిటెడ్ సీఎఫ్‌వోగా 2017 జనవరి 2న నియమితులయ్యారు. అక్కడ ఆయన నెల జీతం రూ.75 వేలు మాత్రమే. అలాంటి వ్యక్తి సహభాగస్వామిగా ఒక కంపెనీని ఏర్పాటు చేసి, స్వల్ప వ్యవధిలోనే అన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. * ఆదాన్ డిస్టిలరీస్‌లో మరో డైరెక్టర్ ముప్పిడి అనిరుధ్‌రెడ్డి ఇటీవల వరకు రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి తోడల్లుడు. ముఖ్యమంత్రి జగన్‌కు రాజశేఖర్‌రెడ్డి సన్నిహితుడు. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి? మద్యం దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్‌ల మద్యం అమ్మాలన్నది ఆయన ఆదేశాల మీదకే జరిగేదని విపక్షాలు ఆరోపించాయి. అనిరుధ్‌రెడ్డి 2020 జూన్ 26న ఆదాన్ డిస్టిలరీస్ డైరెక్టర్ పోస్టు నుంచి వైదొలగారు. ఆ స్థానంలోకి బొల్లారం శివకుమార్ వచ్చారు. * ట్రైడెంట్ కెమ్‌ఫర్ లిమిటెడ్‌లో పెనక శరత్ చంద్రారెడ్డి 2007 ఫిబ్రవరి 21 నుంచి 2016 మే 27 వరకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన సోదరుడు, ఎంపీ సాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి 2010 జనవరి 27 నుంచి 2018 మార్చి 9 వరకు డైరెక్టర్‌గా కొనసాగారు. ఇప్పుడు వారిద్దరూ సాంకేతికంగా ఆ కంపెనీలో డైరెక్టర్లుగా లేకపోయినప్పటికీ... దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ దాఖలు చేసిన కస్టడీ రిపోర్టులో ట్రైడెంట్ సంస్థ శరత్‌చంద్రారెడ్డికి చెందిన గ్రూప్ కంపెనీయేనని పేర్కొంది. * కాశీచయనుల శ్రీనివాస్, పెనక రోహిత్‌రెడ్డి శ్రేయాస్ బయోలాజికల్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. ఆ పోస్టు నుంచి 2021 జూన్ 19న శ్రీనివాస్ వైదొలగారు. * శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ చిరునామా, దిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్ కెమ్‌ఫర్ లిమిటెడ్ రిజిస్టర్ చిరునామాలు ఒకటే కావడం మరో విశేషం. హైదరాబాద్‌లోని మియాపూర్ సర్వే నంబర్ 66, 67 చిరునామాలతో ఈ రెండు కంపెనీలు రిజిస్టరై ఉన్నాయి. కెమ్‌ఫర్ నుంచి అరబిందో రియాలిటీకి నిధులు ట్రైడెంట్ కెమ్‌ఫర్ నుంచి అరబిందో రియాలిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 2020 ఏప్రిల్‌లో రూ.250 కోట్ల నిధులు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం వచ్చాక అరబిందో రియాలిటీ తెలుగు రాష్ట్రాల్లో అనేక భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ కంపెనీలోనూ విజయసాయి అల్లుడు రోహిత్‌రెడ్డి డైరెక్టర్ కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో ఆదాన్ మద్యం వ్యాపారం చేపట్టాకే అరబిందో రియాలిటీలోకి ఈ రూ.250 కోట్లు వెళ్లడం గమనార్హం. Quote
Thokkalee Posted November 10, 2022 Report Posted November 10, 2022 Em scam vaa idi… oka thousand crores kuda ledu mottam.. maree chillar scams pattukuntunnaru.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.