Jump to content

Recommended Posts

Posted

వివేకా హత్యకేసు తెలంగాణకు బదిలీ

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై ఆంధ్రప్రదేశ్‌లో న్యాయమైన విచారణ, స్వేచ్ఛగా జరిగే అవకాశం కనిపించనందున దాని వెనుక ఉన్న విస్తృత కుట్రకోణాన్ని వెలికితీసేందుకు కేసు విచారణను హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

Published : 30 Nov 2022 03:20 IST
 
 
 
 
 
 

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయమైన విచారణ, స్వేచ్ఛాయుత దర్యాప్తుపై అనుమానం
ఈ కేసులో విస్తృత కుట్రకోణాన్ని వెలికితీయాలి
తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు
ఈనాడు - దిల్లీ

291122ap-main1a.jpg

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై ఆంధ్రప్రదేశ్‌లో న్యాయమైన విచారణ, స్వేచ్ఛగా జరిగే అవకాశం కనిపించనందున దాని వెనుక ఉన్న విస్తృత కుట్రకోణాన్ని వెలికితీసేందుకు కేసు విచారణను హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో కేసు విచారణ గాడి తప్పే ప్రమాదం ఉందని హతుడి భార్య, కుమార్తె వ్యక్తం చేసిన అనుమానాలు హేతుబద్ధంగా కనిపిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని సొంతింట్లోనే వివేకా హత్యకు గురయ్యారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినా, స్థానికంగా రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు సాక్షులను బెదిరిస్తూ విచారణ ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారని, అందువల్ల తెలంగాణకు గానీ, మరేదైనా రాష్ట్రానికి గానీ బదిలీచేయాలని వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారం తీర్పును వెలువరించింది. ‘ఈ కేసులోని వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విచారణ నిజాయతీగా, స్వతంత్రంగా జరిగే అవకాశం లేదని, సంఘటన స్థలంలో జరిగిన సాక్ష్యాల ధ్వంసం, హత్య వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు తదుపరి చేపట్టాల్సిన దర్యాప్తు సజావుగా జరగదేమోనని హతుడి భార్య, కుమార్తె వ్యక్తం చేసిన అనుమానాలను కాదనలేం. ఇందులో పిటిషనర్లు హతుడి కుమార్తె, భార్య కాబట్టి న్యాయం పొందే ప్రాథమిక హక్కు వారికి ఉంటుంది. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా హత్య కేసు విచారణ నిజాయతీగా, నిష్పాక్షికంగా జరగాలని వారు ఆశించడం న్యాయమే. ఈ నేపథ్యంలో మొత్తం దర్యాప్తును ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి ఇది సరైన కేసుగా మేం భావిస్తున్నాం. న్యాయసూత్రాల ప్రకారం న్యాయం చేయడమే కాదు... న్యాయం జరిగినట్లు కనిపించడం ముఖ్యం. రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం న్యాయమైన, స్వేచ్ఛాయుత విచారణ జరగడం ముఖ్యం. ఆ విచారణ పక్షపాతంగా జరిగితే న్యాయవ్యవస్థ, క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలు ప్రమాదంలో పడటంతోపాటు, వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం దెబ్బతింటుంది. పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించాల్సి ఉన్నందున.. వారికి ఇబ్బంది కలగకూడదని ఈ కేసును దిల్లీకి బదులు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేయాలని నిర్ణయించాం. అందువల్ల కడప సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో అన్ని వివరాలనూ హైదరాబాద్‌ కోర్టుకు బదిలీ చేయాలి. ఛార్జిషీట్లు, సప్లిమెంటరీ ఛార్జిషీట్లు వెంటనే అక్కడికి పంపాలి. ఈ కేసులో విస్తృత కుట్ర దాగి ఉందని, సాక్ష్యాల ధ్వంసం జరిగిందని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో సీబీఐ సాధ్యమైనంత త్వరగా ఎలాంటి వివక్షకు తావులేకుండా ఆ అంశాలపై స్వతంత్రంగా దర్యాప్తు పూర్తిచేయాలి’ అని జస్టిస్‌ ఎంఆర్‌ షా స్పష్టం చేశారు.

291122ap-main1b.jpg

291122ap-main1c.jpg


కేసు విచారణ బదిలీకి కోర్టు చెప్పిన కారణాలివీ..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ్ముడు, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న అయిన వైఎస్‌ వివేకానందరెడ్డి అనుమానాస్పద రీతిలో మరణించారు. మరణించిన వ్యక్తి కుమార్తె డాక్టర్‌ నర్రెడ్డి సునీత ఈ కేసును కడప సీబీఐ కోర్టు నుంచి దిల్లీ లేదా హైదరాబాద్‌కు బదిలీచేసి నిర్దిష్ట గడువులోగా సీబీఐ విచారణ పూర్తిచేసేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరారు.

* ఈ కేసులోని ప్రధాన సాక్షులకు ప్రాణాపాయం ఉందని, కొందరు సాక్షులు ఇప్పటికే ప్రభావితమయ్యారన్నది పిటిషనర్ల ప్రధాన అనుమానం. ఈ కేసులోని నిందితుడు, రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం ప్రభావం కారణంగా ఈ హత్యవెనుక ఉన్న కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసంపై తదుపరి దర్యాప్తు న్యాయంగా, నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదన్నది వారి అభిప్రాయం.

* జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రెండుసార్లు సిట్‌ మార్పు: 2019 మార్చి 14-15 తేదీల మధ్య రాత్రి వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఆ వెంటనే రాష్ట్రప్రభుత్వం సిట్‌ వేసింది. తర్వాత సునీత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేసు దాఖలు చేశారు. 2019 మే 30వ తేదీన జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత రెండుసార్లు సిట్‌ను పునరుద్ధరించారు. కానీ దర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేదు. మారిన పరిస్థితుల నేపథ్యంలో జగన్‌ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో దాఖలుచేసిన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు. కానీ హైకోర్టు మాత్రం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ ఛార్జిషీట్లు, అనుబంధ ఛార్జిషీట్లు దాఖలుచేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో ఉన్న విస్తృత కుట్ర, సాక్ష్యాల ధ్వంసంపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులకు వ్యతిరేకంగా కేసులు నమోదుచేయగా, హైకోర్టు స్టే ఇచ్చింది. సీబీఐ తదుపరి దర్యాప్తు కొనసాగించకుండా వారిని వేధించడానికే ఇలా తప్పుడు, నకిలీ కేసులు పెడుతున్నట్లు కనిపిస్తోంది. దీన్ని బట్టి ప్రస్తుత దర్యాప్తు ఏమాత్రం స్వేచ్ఛగా కొనసాగే అవకాశం లేదని అనిపిస్తోంది.

* ముఖ్యసాక్షులు షేక్‌ దస్తగిరి, రంగన్న ఇప్పటికే పోలీసు భద్రత పొందుతున్నారు. ప్రాణాపాయంఉందన్న కారణంతో వారికి రక్షణ కల్పిస్తూ సెషన్స్‌ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సమర్పించారు.

* ఒక సాక్షి సీఆర్‌పీసీ 164 కింద స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి అంగీకరించి, తర్వాత మాటమార్చారు. అతని సస్పెన్షన్‌ ఎత్తేసి తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడమే ఆ వ్యక్తి మాట మార్చడానికి కారణం.

* కె.గంగాధర్‌రెడ్డి అనే ముఖ్యసాక్షి కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి 164 స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి అంగీకరించారు. తర్వాత దాన్నుంచి వెనక్కు తగ్గడంతోపాటు, సీబీఐ తనను వేధిస్తోందని మీడియా ముందు చెప్పారు. తర్వాత అతను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో ఈ కేసు తదుపరి దర్యాప్తు స్వేచ్ఛగా జరగకపోవచ్చన్న బాధితుల అనుమానాలను కొట్టిపారేయలేం.

అవినాశ్‌రెడ్డిపై అనుమానం

సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పులో సునీత తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీబీఐ తరఫు న్యాయవాది నటరాజన్‌ చేసిన వాదనలను ప్రస్తావించింది. - ఛార్జిషీటులో అధికారపార్టీకి చెందిన ఎంపీ అవినాశ్‌రెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చింది. అతన్ని అనుమానితుడిగా పేర్కొన్నారు. సాక్ష్యాల ధ్వంసంలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు, వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని తప్పుడు వార్తలు ప్రచారంలో పెట్టినట్లు పేర్కొన్నారు. వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని ఇప్పటివరకూ అరెస్టు చేయలేదు. రాష్ట్రంలో అధికార ప్రభావం ఉన్నవారు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, అతని అనుచరుడు డి.శివశంకర్‌రెడ్డిని రక్షించాలని.. దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టారు. దాంతో వారు స్టే కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఫిర్యాదు పెండింగ్‌లో ఉండటంతో సీబీఐ అధికారులు దర్యాప్తు ఆపి ఏపీని వదిలిపెట్టిపోయారు. దర్యాప్తు పునఃప్రారంభిస్తే నిందితులు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారి జోక్యంతో మరిన్ని కేసులు పెడతారేమోనన్న భయంతో సీబీఐ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టలేదు.

* ఈ నేరంలో పాల్గొన్నవారిని రక్షించడానికి అధికారంలో ఉన్నవారు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సాక్షులను, దర్యాప్తును, న్యాయప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

* ఈ కేసులో సాక్షులను డి.శివశంకర్‌రెడ్డి అనచరులు బెదిరిస్తున్నారు. ముగ్గురు ప్రధాన సాక్షులు ఇప్పటికే శివశంకర్‌రెడ్డి, ఇతరకుట్రదారుల ప్రభావంలో ఉన్నారు.

* ప్రాణాలకు ప్రమాదం ఉండటంతో ఇద్దరు ప్రధాన సాక్షులకు ఇప్పటికే పోలీసు భద్రత కల్పించారు. దీన్నిబట్టి సాక్షులను ప్రభావితం చేయడానికి, సాక్ష్యాధారాలను చెరిపేయడానికిఅవకాశాలున్నాయి. సీబీఐ సిబ్బందిపై ఒత్తిడి తేవడంతోపాటు, వారిని బెదిరిస్తూ చివరకు తప్పుడు కేసులు పెడుతున్నందున తదుపరి దర్యాప్తు న్యాయబద్ధంగా జరుగుతుందని చెప్పడానికి లేదు.



Posted
వాళ్ళ కుటుంబంలో ప్రేమలు,ఆప్యాయత ఇలానే ఉంటాయి..
వచ్చే ఎలక్షన్ కి సానుభూతి ఓట్లు కోసం ఎవరో మరి!!😢
275135943_2777944545832972_7792499930671
  • Haha 1
Posted
దీనెక్క ..ఇదెక్కడి బాబాయ్ పోటు రా మావ 😂😂 ఏసేసి మళ్ళీ విగ్రహాలు ప్రా"రంభోత్సవాలు"
అవినాష్ అన్నియ .. ఎదో అనుకున్నా అన్నియ ..నువ్వు వేరే లెవెల్ అన్నియ 😂😂

 

 

 

Posted
8 minutes ago, southyx said:
వాళ్ళ కుటుంబంలో ప్రేమలు,ఆప్యాయత ఇలానే ఉంటాయి..
వచ్చే ఎలక్షన్ కి సానుభూతి ఓట్లు కోసం ఎవరో మరి!!😢
275135943_2777944545832972_7792499930671

RIP Vijayamma

Posted
అసలు ఫ్యామిలీలో ఇలా ఎలా డిస్కషన్స్ నడుస్తాయి బాసూ? వింటుంటేనే ఏదోలా వుంది
అన్నయ్యా .. మా నాన్నని .. మన చిన తమ్ముడు ఏసేశాడని డౌట్ : చెల్లి
అన్న పెద్దగా నవ్వి .. బావ ఏమన్నా మామూలోడా షెల్లెమ్మా .. బావే నరికేశాడేమో : అన్న
అన్నా .. మా అయ్యని .. మా ఆయన నరికాడంటే వూరుకోను స్టేషన్ కి పోతా : చెల్లి
సర్లే .. తమ్ముడో , బావో ఎవురో ఒకరు నరికార్లే .. మనోళ్లేగా అంతా .. ఈమాత్రానికే స్టేషన్లకి ఎందుకు : వదిన & పెద్దమ్మ
ఇదంతా చూస్తా కూర్చున్న ఇంకో పెద్దమ్మ & పిన్ని , ఇద్దరు బాబాయ్ లు .. మధ్యలో టీ తాగొస్తా అని బయటకి వెళ్లిన ఇంకో బాబాయ్
Posted

Bathroom Lo babai, kodi kathi….ivi patukuni election ki pothe public #23 tho return gift ichi kusapetinaru…

 

Posted
2 minutes ago, Android_Halwa said:

Bathroom Lo babai, kodi kathi….ivi patukuni election ki pothe public #23 tho return gift ichi kusapetinaru…

 

ఏదో చిన్న ఆశ కాళ్ళు నొక్కుతుంటే ఏదో ఒక రోజు మోడి కేసుల కోట్టేయకపోడా అని అందుకే 175 కు 175 తో 30 సంవత్సరాలు CM కావాలనుకొంటున్నది😂

317406082_5514002098696610_2387633556835

Posted
Just now, southyx said:

ఏదో చిన్న ఆశ కాళ్ళు నొక్కుతుంటే ఏదో ఒక రోజు మోడి కేసుల కోట్టేయకపోడా అని అందుకే 175 కు 175 తో 30 సంవత్సరాలు CM కావాలనుకొంటున్నది😂

317406082_5514002098696610_2387633556835

Ayyayyyo….enni kastallo…!!!

Jaggadu jail ki pothe Bharati CM ayitadi ani chana asha paddaru…

Meeku meeru anukovadame…

Hijdon ki fauz..

Posted
4 minutes ago, Android_Halwa said:

Bathroom Lo babai, kodi kathi….ivi patukuni election ki pothe public #23 tho return gift ichi kusapetinaru…

 

275190950_489942972638698_52868835692531

Posted
1 minute ago, Android_Halwa said:

Ayyayyyo….enni kastallo…!!!

Jaggadu jail ki pothe Bharati CM ayitadi ani chana asha paddaru…

Meeku meeru anukovadame…

Hijdon ki fauz..

275232444_285272373731427_66322789254500

Posted
6 minutes ago, Android_Halwa said:

Ayyayyyo….enni kastallo…!!!

Jaggadu jail ki pothe Bharati CM ayitadi ani chana asha paddaru…

Meeku meeru anukovadame…

Hijdon ki fauz..

వైయస్ సునితారెడ్డి ,వివేకానంద రెడ్డి అల్లుడు చంద్రబాబు చేతిలో పావు - సజ్జల రామకృష్ణారెడ్డి.హమ్మయ్య ఇక రేపోమాపో అవినాష్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు మనిషని ఒక ప్రెస్ మీట్ పెడితే సరిపోతుంది.అంతకు సిబిఐ అసలు సూత్రధారిని కూడా లాగితే ఆయన కూడా చంద్రబాబునాయుడుమనిషిఅనిచెప్తాం.అంతేగా సజ్జల రామకృష్ణారెడ్డి.మద్యమద్యలో ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కోసం కొడాలి నాని చేత కూడా ప్రెస్ మీట్స్ పెట్టించి విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబుమనుషులుఅనిచెప్పించండి.లేకపోతే డౌట్ వస్తుంది...

274725159_486704922962503_44641591819756

Posted
9 minutes ago, southyx said:

275190950_489942972638698_52868835692531

 

6 minutes ago, southyx said:

వైయస్ సునితారెడ్డి ,వివేకానంద రెడ్డి అల్లుడు చంద్రబాబు చేతిలో పావు - సజ్జల రామకృష్ణారెడ్డి.హమ్మయ్య ఇక రేపోమాపో అవినాష్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు మనిషని ఒక ప్రెస్ మీట్ పెడితే సరిపోతుంది.అంతకు సిబిఐ అసలు సూత్రధారిని కూడా లాగితే ఆయన కూడా చంద్రబాబునాయుడుమనిషిఅనిచెప్తాం.అంతేగా సజ్జల రామకృష్ణారెడ్డి.మద్యమద్యలో ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కోసం కొడాలి నాని చేత కూడా ప్రెస్ మీట్స్ పెట్టించి విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబుమనుషులుఅనిచెప్పించండి.లేకపోతే డౌట్ వస్తుంది...

274725159_486704922962503_44641591819756

 

8 minutes ago, southyx said:

275232444_285272373731427_66322789254500

Abbe…Ave whatsapp group forwarded messages by your masters…

Kotha material emi leda ?

Posted
1 minute ago, Android_Halwa said:

 

 

Abbe…Ave whatsapp group forwarded messages by your masters…

Kotha material emi leda ?

Nee phone lo unna Jagan anna app lo untahdi choosuko.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...