Jump to content

Writing a short story...


dasari4kntr

Recommended Posts

1

City కి దూరంగా ఒక farmhouse, రాత్రి పది గంటలు సుమారుగా...

 

పెద్ద శబ్దాలతో...చిందులు కేకలతో కోలాహలంగా ఉంది ఆ farmhouse.

అప్పటి వరకూ గొంతులు చించుకుని ...CK దేవేంద్ర జిందాబాద్... CK ఫణీంద్ర జిందాబాద్... CK దేవేంద్ర జిందాబాద్... CK ఫణీంద్ర జిందాబాద్...మనశక్తి పార్టీ జిందాబాద్... మనశక్తి పార్టీ జిందాబాద్.. అని అరిచిన గొంతులు పార్టీ జెండాలని పక్కన పడేసి....తలా ఒక చీప్ లిక్కర్ చేతిలో పట్టుకుని మాయం అయ్యారు...

తాగే వాళ్ళు తాగుతున్నారు, గంజా పీల్చే వాళ్లు  పీలుస్తున్నారు...

గంగత్త కంపెనీ నుండి వచ్చిన అమ్మాయలతో కొంత మంది చిందులేస్తుంటే... మరికొంత మంది వాళ్లని అలా భుజాల మీద ఎక్కించుకుని మోసుకుంటూ చీకట్లోని చెట్టు పొదల్లోకి జారుకుంటున్నారు...

నెమ్మదిగా జనాలు పల్చబడుతున్నారు, ఒక చిన్నపాటి స్టేజ్ పైన ఎవరి కామవాంచకి నోచుకోని ఇద్దరమ్మాయలు...తాగిన మత్తులో ఒక బూతు పాటకి అలా ఒళ్లు కదిలిస్తూ నెమ్మదిగా ఊగుతున్నారు...

 

పదకొండు గంటలా ముప్పై నిమిషాలు అయ్యింది....

 

జనాలు బాగా తగ్గారు...ఆ ప్రాంగణంలో స్టేజ్ పైన అలా ఊగుతా నాట్యం చేసే ఇద్దరు అమ్మయలు...వాళ్లకి కొంత దూరంలో టేబుల్ పైన ఈ ప్రపంచంతో సంభందం లేకుండా మందు కొడుతూ చాలా తీక్షణంగా మాట్లాడుకుంటున్న ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు...

ఇంతలో ఆ డాన్స్ చేసే ఒక అమ్మాయి  లయభద్దంగా ఊగుతూ డాన్స్ చేసుకుంటూ ఆ మాట్లాడుకుంటున్న అబ్బాయిల దెగ్గరకి వెళ్లి మందు తాగుతున్న రాంకీ వళ్లో వాలి కూర్చుంది...వాడి నోట్లో ఉన్న సిగిరెట్ తీసి తను ఒక దమ్ము లాగి రాంకీ పెదాల పైన ముద్దుపెట్టి తన నోట్లో పొగ ఊదింది..అంతే మత్తుగా రాంకీ తన నాసికారంద్రాల నుంచి ఆ పొగ విడిచి సున్నితంగా ఆ అమ్మాయిని పైకి లేపి... “ఫణి బాబు తో మాట్లాడొస్తా wait చెయ్యి” అని ఆ అమ్మాయి పిఱ్ఱ మీద చరిచి పంపేసాడు...

ఇదంతా ఏమి పట్టనట్లుగా ఎదురుగా ఫణీంద్ర సిగిరెట్ దమ్ము లాగుతూ తన దీర్ఘాలోచనలో ఉన్నాడు...

“ఫణి బాబు...వాళ్లు ఇద్దరున్నారు...వేద్దామా...? రేపు US వెళ్తున్నావ్ మళ్లీ ఈ నాటు సరుకు దొరకదు” అన్నాడు రాంకీ...

“లేదు రాంకీ అన్నా నాకు...interest లేదు...” ముక్తసరిగా బదులిచ్చాడు...ఫణి...

“ఇంకా మృదులా గురించి ఆలోచిస్తున్నావా...తను హస్పిటల్ లో ఏ క్షణమైనా బతకొచ్చు అని మన పార్టీకి పనిచేసే డాక్టర్ చెప్పాడు...తను తీసుకున్న పాయిజన్ కి ఇంత కాలం చావకుండా కోమా లో ఉండడమే పెద్ద అద్బుతం అంట అలాంటిది ఇప్పుడు స్పృహ లోకి వచ్చి బతికిందంటే గట్టి పిండమే...!! అయినా ఈ రోజు వినయ్ ని చంపిన కేస్ లో నీకు అనుకూలంగా జడ్జిమెంట్ రావడం...ఇంతకాలం కోమాలో ఉన్న మృదులాకి మెలుకవ రావడం రెండూ కేవలం కాకతాళీయమే.…దీని గురించి పెద్దగా ఆలోచించకు...నీకు వినయ్ కేస్ లో కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది అందుకే ఈ పార్టీ కూడా...నీ పెద్దన్న దేవేంద్రన్న కూడా హ్యాపీనే..కాబట్టి అన్నీ మరిచిపోయి ఎంజాయ్ చేయ్…” అని రాంకీ చెబతుంటే…

“అన్న తో మాట్లాడావా…ఎలా ఉన్నాడు..” అని అడిగాడు ఫణి..

“బానే ఉన్నాడు…పార్టీ మీటింగ్స్ లో బిజీ ఉన్నాడు…నిన్ను ఎప్పుడెప్పడీ దేశం దాటించాలా అని ఎదురు చూస్తున్నాడు..ఎందుకంటే ఈ కేస్ లో మృదులా ఇంకా ప్రత్యక్ష సాక్షి..ఇప్పుడు తను బ్రతికి కేస్ ని తిరగతోడే ప్రమాదం ఉంది...నువ్వేమో ఇంకా నీ లవర్ మృదులా..నీ ఫ్రెండ్  వినయ్ అనుకుంటా ఆ పీడకలలోనే బతుకుతున్నావ్..అక్కడ ఒక పక్క నీ అన్న దేవేంద్రన్న…ఆయన భయం ఆయన్దీ...తన పెద్ద తమ్ముడిని ప్రణాలతో  కాపాడుకో లేక పోయాడు...చిన్న తమ్ముడివి నిన్నైనా కాపాడుకుందామని...ఆయన ఆరాటం” అన్నాడు రాంకీ...

“వినయ్, నేను, మృదులా..మేము బెష్ట్ ఫ్రండ్స్ అన్నా కాలేజిలో.... కానీ ఏదో కొన్ని పరిస్తితుల వళ్ల నేను వినయ్ ని అలా..” అని ఫణి చెప్తుంటే...

“ఆపేయ్...ఆ మాట నీ నోట రానీయకు...ఇంత కష్టపడి మీ అన్నయ్య జడ్జ్ ని కొనింది...నీకు నువ్వే అప్రూవర్ గా మారడానికి కాదు...అయినా ముడ్డి కిందకి ఇరవై ఏళ్లు వచ్చినా ఈ లవ్వులు...ఈ ఫ్రండ్‌షిప్‌లు ఏంటప్పా..? ప్రపంచం  నడిచేది స్వార్దం పైన...ప్రతి సంభందం వెనకా ఏదో లాభం ఏదో భోగం ఏదో లాబాపేక్ష లేదా ఏదో దురుద్దేసం...ఇదే అప్ప ఈ లోకం..అంతే కదా!! నువ్వు ప్రేమించిన పిల్ల నీకు దక్కలేదనే స్వార్దం కాదా నీది… ఆ పిల్లోడిని చంపిం...(తనని తాను అదుపు చేసుకుని)....వద్దలే మల్లీ నా నోటితో ఆ మాట ఎందుకు... 

అయినా ఇదే అప్ప ప్రపంచం పోకడ... ప్రతిఒక్కడూ, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం చూసేది తరవాతి క్షణంలో ఎంత బాగుపడ్డామనే..దానికే ఏదేదో ఆ GDP అని  ఈ index అని మనిషి జీవితాన్ని అంకెల్లో కొలుస్తారే తప్పా...ఒక నిమిషం నిలబడి..దెబ్బతిన్నవాళ్ల గురించి ఆలోచించరు...ఇది తప్పా ఒప్పా అని ఆలోచించే ఓపిక ఎవరికీ లేదప్పా...ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఈ సమాజం ఎప్పుడో మరిచిపోయింది...ఇప్పుడున్నదంతా మందిస్వామ్యం(mob ideocracy) నలుగురు పాటించిందే న్యాయం..జయించినోడికే మాట్లేడే హక్కు ఉన్న కాలం ఇది...అందులో తప్పు, ఒప్పు, పాపం, పుణ్యం ప్రసక్తిలే...ఒక్క స్వార్దం తప్ప...

కాబట్టి మీ అన్న మాట విని నువ్వు నీ స్వార్దం చూసుకుని ఆ అమెరికా పో...ఆ గంగత్త కూతురు ఇందాకటి నుంచినా కోసం ఎదురు చూస్తంది...పక్కన ఇంకో పిల్ల ఉంది మరి నువ్వూ....?” అని తన మాటల ప్రవాహాణికి ఒక సందేహం తో అడ్డుకట్ట వేసాడు...రాంకీ...

వద్దు అని తల వూపి...”నేను ఇంటికెల్తా అన్నా రేపు అమెరికా పోతా” అని ఒక్కసారిగా ముందున్న  హాఫ్ బాటిల్ ఎత్తి కసిగా RAW తాగేసి తన కార్ దెగ్గరకి బయలుదేరాడు...

తాను కారు డ్రైవ్ చేసే స్తితిలో లేకున్నా...ఇంటికేసి ప్రయాణం ప్రారంభించాడు...తూలుతూ…

 

 

 

ఇంకా ఉంది....

 

Link to comment
Share on other sites

Thx.. will read it but on only one condition change names to cbn and lokesh..  bomna 100days aduddi.. manani USA ki pampinchu ayanagurunchi manam em cheyyagalam 

itlu

babu army

Link to comment
Share on other sites

Good anna.. akkadakkada thappulu dhorlina pattinchukonentha peddavem kadhu..

Opening scene varaki okay.. next ento rasthe sadhivi khandistham

  • Thanks 1
Link to comment
Share on other sites

7 hours ago, TOM_BHAYYA said:

Good anna.. akkadakkada thappulu dhorlina pattinchukonentha peddavem kadhu..

Opening scene varaki okay.. next ento rasthe sadhivi khandistham

will correct those typos in next episode….

Link to comment
Share on other sites

13 minutes ago, Guest said:

Intha opika and time yetla anna..damn

ekuhva raayledhu kada..bro…

daily few lines…

ainaa ee story ni long drive ki vellinappudu alochincha..

Link to comment
Share on other sites

2

కారు నెమ్మదిగా కదులుతుంది... 

తాగిన మందు తలకి బాగా ఎక్కడంతో...కళ్లు మూతలు పడుతున్నాయి, ఫుల్ గా తాగిన వాడు కారు ఎలా అయితే నడుపుతాడో...అంత కంటే అద్వాన్నంగా నడుపుతున్నాడు ఫణి కారుని. కారు రోడ్డు ఆ కోసని ఈ కోసని ఒకదాని తర్వాత ఒకదానిని పలకరిస్తూ అడ్డదిడ్డంగా వెల్తుంది...అర్ధరాత్రి అవ్వడం వలన అది సిటీకి బాగా ధూరంగా ఉండడం వలన రోడ్లపైన జనసంచారం ఎక్కువ లేదు. రోడ్డంతా ఖాలీ గా ఉండడంతో పెద్దగా ప్రయాస పడకుండానే వెలుతున్నాడు...ఫణి నెమ్మదిగా..

ఈ గందరగోళ డ్రైవింగ్ లో...ఫణికి తన గత ఙ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి, ఒక సంవత్సరం కృతం జరిగిన సంఝటనలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి...

అది B.Tech చివరి సంవత్సరం చదువుతున్న రోజులు...క్యాంపస్ బయట ఒక కారు...ఆ కారు ముందు..కొంత మంది రౌడీలు ఒకడిని చుట్టుముట్టి తెగ కొడుతున్నారు..వాడు కిందపడి వదిలేయండి అని వేడుకుంటున్నా...వాళ్ళు వినడంలేదు...

కారు లో కూర్చుని వేడుకలా చూస్తున్నాడు ఫణి...ఆ రౌడీ గ్యాంగ్ లో ఒకడు ఫణి వైపు తిరిగి..కొట్టడం ఆపాలా అని సైగ చేసాడు....దానికి ఫణి వద్దు ఇంకా కొట్టండి అని తన తీక్షణమైన కళ్ళతోనే చెప్తూ తల అడ్డంగా ఊపాడు...అది అర్దమైన రౌడీ రెట్టించిన ఉత్సాహంతో బలంతో ఆ కింద పడిన వాడిని ఒక తన్ను తన్నాడు..కాలితో.. ఆ దెబ్బకి వాడు పెద్దగా మూలిగాడు...

కారులో ఫణి పక్కన కూర్చున్న మృదులా అతని ఎడమ జబ్బని పట్టుకుని చిన్నగా గుంజుతూ... "ఆపు ఫణి చచ్చిపోతాడు...వాడు చేసిన చిన్న తప్పుకి ఇంతలా కొట్టాలా" అని వేడుకుంటుంది...

అంతలో వెనుక సీటులో కూర్చున్న వినయ్ తన తలకి తగిలిన దెబ్బని గుడ్డతో అదుముకుంటూ...”రేయ్ ఫణి వాడిని వదిలేయ్ వాడి పాపాన వాడే పోతాడు” అని అన్నాడు...

దానికి ఫణి...”వినయ్ నీకు తెలీదు ఊరుకో...నేనీ తొక్కలో కాలేజికి వచ్చేదే మీ ఇద్దరి కోసం లేకుంటే మా అన్నతో కలిసి రాజకీయాల్లోకి పోయేవాడిని...అట్లాంటిది నేను లేని టైం చూసి...ఈ నా కొడుకు మృదుల పైన పిచ్చి కూతలు కూసి అడ్డొచ్చిన నిన్ను కొడతాడా..!! ఈ రోజు వీడికి చెయ్యో కాలో ఇరగాల్సిందే...” అని ఆవేశంగా బదులిచ్చాడు.

“ఆపరా నీ ఆవేశం... అదేదో నువ్వే వెళ్లి వాడిని కొడుతున్నట్టు బిల్డప్... నీ మనుషులని పెట్టే కదా వాడిని కొట్టిస్తున్నావ్...నీ కంటే వాడే నయం కోతి వేషాలేసినా ధైర్యంగా నా పై కలబడి నన్ను కొట్టాడు...నీ లాగ కార్లో కూర్చుని మనుషులతో కొట్టీలేదు...వాడిని వదిలేయ్..ఇది చిన్న దెబ్బే...రేపటికి తగ్గి పోతుంది...” అన్నాడు వినయ్...

ఇక చేసేది లేక...చిరాకుతో ఫణి కార్ డోర్ విండో తెరచి...తన మనుషులని ఉద్దేసించి “వాడిని వదిలేయండి...కానీ వాడు  చొక్కా ప్యాంట్ తో ఇంటికెల్లకూడదు...అండర్వేర్ పైన ఇంటికెల్లాలి...” అని కోపంగా అరిచాడు...అది విని ఆ రౌడీలు తర్వాత ఏమి చేయాలో అర్దమైనట్టు తలూపారు...

ఆ మాట విని వినయ్.. “వీడు మారడు!!” అని మనసులో అనుకున్నాడు...

కోపం అసహనం బిడియం లాంటి కలగలిసిన భావాలతో మృదులా తన తలని పక్కి తిప్పుకుంది విసురుగా..గోళ్లు కొరుక్కుంటూ...

“lets go pub ...వినయ్ నీకు తగిలిన దెబ్బకు మందు అక్కడే దొరికేది...” అంటూ ఫణి తన డ్రైవర్ సీట్ లో కూర్చుని కార్ స్టార్ట్ చేసి.. pub వైపు స్పీడ్ గా పోనిచ్చాడు...

మిగిలిన ఇద్దరూ...వద్దురా అంటూ తల పట్టుకున్నారు... 

ఇంతలో కారుకు ఏదో చిన్నగా గుద్దుకుంది...జ్ఞాపకాల మత్తులో తూలుతూ డ్రైవ్ చేస్తున్న ఫణి ఉలిక్కిపడ్డాడు..అప్రయత్నంగా బ్రేక్ వేసాడు...కొంచెం స్ప్రుహ లోకి వచ్చాడు...తన పక్కన మృదుల లేదు...తన వెనక వినయ్ లేడు...

దిగి చూస్తే తన కార్ కింద ఒక వీధిలో తిరిగే నల్ల కుక్క పడి వుంది...

 

ఇంకా ఉంది....

Link to comment
Share on other sites

"ఫణి" ane peru inka vaadutunnara..asalu aa peru ni sarigga palakadam ee kalam lo evarikinaa vachaa..

Link to comment
Share on other sites

19 minutes ago, summer27 said:

"ఫణి" ane peru inka vaadutunnara..asalu aa peru ni sarigga palakadam ee kalam lo evarikinaa vachaa..

nenu correct gaane raasana..?

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, dasari4kntr said:

nenu correct gaane raasana..?

perfect gaa rasav..

  • Thanks 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...