Jump to content

ముగిసిన నారా లోకేశ్ సీఐడీ విచారణ*


kevinUsa

Recommended Posts

*

 

*బుధవారం మళ్లీ విచారణకు రావాలంటూ నోటీసులు*

 

*ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో లోకేశ్ పై ఆరోపణలు*

 

*ఇటీవల 41ఏ కింద నోటీసులు ఇచ్చిన సీఐడీ*

 

*విచారణకు హాజరైన లోకేశ్*

 

*లోకేశ్ ను 50 ప్రశ్నలు అడిగిన సీఐడీ అధికారులు*

 

ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో మాజీ మంత్రి నారా లోకేశ్ ను సీఐడీ నేడు సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ ఉదయం లోకేశ్ తాడేపల్లి సిట్ కార్యాలయానికి విచ్చేశారు. ఉదయం 10 గంటల తర్వాత విచారణ మొదలవగా, సాయంత్రానికి విచారణ ముగిసింది. వాస్తవానికి అక్టోబరు 4నే విచారణకు హాజరు కావాలని సీఐడీ లోకేశ్ కు నోటీసులు పంపింది. అయితే, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోకేశ్ ను ఇవాళ (అక్టోబరు 10) విచారించారు. లోకేశ్ ను 50 ప్రశ్నలు అడిగారు. కాగా మరింత సమాచారం కోసం బుధవారం మరోసారి విచారణకు రావాలని నారా లోకేశ్ కు 41ఏ నోటీసులు ఇచ్చారు. తాను రేపు కూడా విచారణకు హాజరవుతానని లోకేశ్ తెలిపారు.

 

 

*గూగుల్ చేస్తే తెలిపేవి న‌న్నడిగారు*

 

*సీఐడీ విచార‌ణ అనంత‌రం మీడియాతో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్* 

 

గుంటూరు, సూర్య ప్రధాన ప్రతినిధి : దాదాపు ఆరున్నర గంటలపాటు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని 50 ప్రశ్నలు త‌న‌ను అడిగార‌ని, ఇందులో 49 ప్ర‌శ్న‌లు గూగుల్‌లో కొడితే వ‌చ్చేవి ఉన్నాయ‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఐడీ విచార‌ణ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మీరు ఏం చేస్తుంటారు? హెరిటేజ్‌లో పని చేసినప్పుడు మీ హోదా ఏంటి? ప్రభుత్వం లో మీరు ఏ బాధ్యతలు నిర్వహించారు? ఇటువంటి గూగుల్ లో దొరికేవ‌న్నీ త‌న‌ని విచార‌ణాధికారులు అడిగార‌న్నారు. త‌న ముందు ఈ కేసుకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పెట్టలేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన ప్ర‌తిప‌క్ష‌మైనా, ప్ర‌జ‌ల‌నైనా క‌క్ష సాధించ‌డం అల‌వాటుగా మారింద‌న్నారు. పోల‌వ‌రం ఎందుకు పూర్తి చేయ‌లేద‌ని, యువ‌త‌కి ఉద్యోగాలు ఎందుకు క‌ల్పించ‌లేద‌ని నిల‌దీసినందుకే ఆధారాలు లేని కేసులో అక్ర‌మ అరెస్టు చేసి చంద్ర‌బాబుని జైలులో వేశార‌న్నారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చ‌ర్యేన‌న్నారు. తాను యువ‌గ‌ళం పాద‌యాత్ర ద్వారా అరాచ‌క స‌ర్కారుపై ప్ర‌జ‌ల్ని చైత‌న్య‌ప‌రుస్తుంటే ఇదిగో ఇలా త‌ప్పుడు కేసుతో యువ‌గ‌ళం ఆగిపోయేలా చేశార‌ని మండిప‌డ్డారు. ఈ త‌ప్పుడు కేసుల‌న్నీ ప్ర‌జ‌ల్లో ఉంటోన్న తెలుగుదేశం పార్టీని క‌ట్ట‌డి చేయ‌డానికి నేను, చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే కుట్రల్లో భాగ‌మేన‌న్నారు. తాను లండ‌న్‌లో ఉన్న‌ప్పుడు త‌న‌కి తెలియ‌కుండా చంద్ర‌బాబు అరెస్టు జ‌రిగింద‌ని జ‌గ‌న్ అంటున్నార‌ని, ఏసీబీ-సీఐడీ సీఎం కింద ప‌నిచేస్తాయ‌నే క‌నీస అవ‌గాహ‌న‌లేని పిచ్చి జ‌గ‌న్ డిజిపి ద‌గ్గ‌ర పాఠాలు నేర్చుకోవాల‌న్నారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా ఈరోజే ఎంత సమయమైనా ఉంటా అని చెప్పాన‌ని, మళ్లీ రేపు రమ్మని 41a నోటీసు ఇచ్చారని, ఉదయం 10గంటలకు హాజ‌రు అవుతాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌ప్పుచేయ‌న‌ప్పుడు తానెందుకు భ‌య‌ప‌డాలని ప్ర‌శ్నించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...