psycopk Posted October 13, 2023 Report Posted October 13, 2023 Chandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను వాయిదా వేసిన సుప్రీంకోర్టు 13-10-2023 Fri 16:17 | Andhra బుధవారం వరకు చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయబోదన్న ముకుల్ రోహత్గి అరెస్ట్ లేనప్పుడు బెయిల్ ప్రస్తావన ఎందుకన్న సుప్రీంకోర్టు మంగళవారానికి విచారణను వాయిదా వేసిన ధర్మాసనం ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. వాదనల సందర్భంగా ఫైబర్ నెట్ కేసులో కూడా 17ఏను పరిగణనలోకి తీసుకోలేదని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్ వచ్చిందని, ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని చెప్పారు. మరోవైపు ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ బుధవారం వరకు చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయబోదని చెప్పారు. పీటీ వారంట్లను బుధవారం వరకు అమలు చేయొద్దని ఏసీబీ కోర్టుకు విన్నవిస్తామని తెలిపారు. దీంతో ఆయన అండర్ టేకింగ్ ను సుప్రీంకోర్టు రికార్డు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ... అరెస్ట్ చేయనప్పుడు బెయిల్ ప్రస్తావన ఎందుకంటూ మంగళవారానికి విచారణను వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సోమవారం నాడు ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబును హాజరుపరచాల్సిన అవసరం లేదని న్యాయవాదులు చెపుతున్నారు. Quote
psycopk Posted October 13, 2023 Author Report Posted October 13, 2023 Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు 13-10-2023 Fri 15:56 | Andhra మంగళవారం మధ్యాహ్నానికి విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పై విచారణ ప్రారంభం ఈ కేసుకు కూడా 17ఏ వర్తిస్తుందన్న సిద్ధార్థ్ లూథ్రా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణను వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలను వినిపించారు. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పై ఇదే బెంచ్ ముందు ప్రస్తుతం వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ కేసుకు కూడా 17ఏ వర్తిస్తుందని సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.