psycopk Posted October 18, 2023 Report Posted October 18, 2023 Chandrababu: చంద్రబాబు పీటీ వారెంట్... ఏసీబీ కోర్టు నిర్ణయం 20కి వాయిదా 18-10-2023 Wed 17:30 | Andhra ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై నిర్ణయం వాయిదా చంద్రబాబును కోర్టులో హాజరుపరచాల్సి ఉండటంతో మెమో దాఖలు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై నిర్ణయాన్ని ఏసీబీ న్యాయస్థానం 20వ తేదీకి (ఎల్లుండి శుక్రవారం) వాయిదా వేసింది. ఈ రోజు చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరచవలసి ఉండటంతో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఫైబర్ నెట్ విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేయడంతో కోర్టు నిర్ణయం వాయిదా పడింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. ఈలోగా టీడీపీ అధినేతను అరెస్ట్ చేయవద్దని కూడా సీఐడీ తరఫు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది. 1 Quote
psycopk Posted October 18, 2023 Author Report Posted October 18, 2023 Chandrababu: రింగ్ రోడ్డు కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే నెలకు వాయిదా వేసిన హైకోర్టు 18-10-2023 Wed 14:13 | Andhra బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు న్యాయవాదులు నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పై స్టే కొనసాగింపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. 7వ తేదీ వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉందని... సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తే ఈ కేసులో కూడా వర్తిస్తుందని చెప్పారు. విచారణను నవంబర్ కు వాయిదా వేయాలని కోరారు. మరోవైపు ఇదే కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పై హైకోర్టు ఇప్పటికే స్టే విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్టేను నవంబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. 1 Quote
psycopk Posted October 18, 2023 Author Report Posted October 18, 2023 harsha kumar: చంద్రబాబు ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా బెయిల్ ఇవ్వాలి: మాజీ ఎంపీ హర్షకుమార్ 18-10-2023 Wed 16:10 | Andhra చంద్రబాబుపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శ చంద్రబాబుపై నేరారోపణ జరిగిందని, నేరం రుజువు కాలేదని వెల్లడి ఎలాంటి నేరారోపణ నిర్ధారణ కాకపోయినా నలబై రోజులుగా జైల్లో ఉంటున్నారన్న హర్ష కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఆయనపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేతపై నేరారోపణ మాత్రమే జరిగిందని, ఆయన నేరం చేసినట్లు ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. ఆయన నేరం చేసినట్లు ఎలాంటి నిర్ధారణ జరగకపోయినా నలభై రోజులుగా జైల్లో ఉంటున్నారన్నారు. ఆయన ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేయాలని కాంక్షించారు. చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్నారని, ఈ జైలు వ్యవహారాలను సాధారణంగా అధికారులు పర్యవేక్షించాలని, కానీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేత సజ్జల పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. 1 Quote
psycopk Posted October 18, 2023 Author Report Posted October 18, 2023 Siddharth Luthra: ఆదిరెడ్డి అప్పారావు బెయిల్ ను సమర్థించిన సుప్రీంకోర్టు 18-10-2023 Wed 14:35 | Andhra జగత్ జనని చిట్ ఫండ్ కేసులో టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు అరెస్ట్ అప్పారావుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీఐడీ అప్పారావు తరపున వాదనలు వినిపించిన లూథ్రా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అప్పారావుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సమర్థిస్తున్నామని చెప్పింది. జగత్ జనని చిట్ ఫండ్ కంపెనీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను సీఐడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇద్దరికీ ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీఐడీ సవాల్ చేసింది. సీఐడీ పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. సీఐడీ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా... ఆదిరెడ్డి అప్పారావు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. లూథ్రా వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు... హైకోర్టు బెయిల్ ను సమర్థించింది. చంద్రబాబు కేసులను కూడా లూథ్రా వాదిస్తున్న సంగతి తెలిసిందే. Quote
lokesh_rjy Posted October 18, 2023 Report Posted October 18, 2023 Tupas case ki kuda bail ravatledu ga 1 1 Quote
psycopk Posted October 18, 2023 Author Report Posted October 18, 2023 Nara Bhuvaneswari: తల్లి వర్ధంతికి కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా?: నారా భువనేశ్వరి 18-10-2023 Wed 09:32 | Andhra కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ చేయడంపై భువనేశ్వరి మండిపాటు ప్రభుత్వ వైఖరి తనను బాధించిందని వ్యాఖ్య వ్యక్తిగత హక్కులను రాజకీయాలతో ముడిపెట్టవద్దని విన్నపం టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల నిర్బంధం తీవ్ర ఆవేదనను కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. ఒక మాజీ మంత్రిని తన తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఇలా అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి తనను ఎంతో బాధించిందని చెప్పారు. ఇదేమి చట్టం, ఇదెక్కడి న్యాయం అని ఆమె ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో ఈ ఘటన చూస్తే అర్థమవుతుందని భువనేశ్వరి అన్నారు. కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత హక్కులను, సంప్రదాయాలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నానని చెప్పారు. 1 Quote
Sucker Posted October 18, 2023 Report Posted October 18, 2023 Thupaass case lo meeru dorakatam yendhayya 2 Quote
psycopk Posted October 18, 2023 Author Report Posted October 18, 2023 margadarshi: మార్గదర్శి క్వాష్ పిటిషన్‌పై విచారణను 8 వారాలు వాయిదా వేసిన హైకోర్టు 18-10-2023 Wed 17:48 | Andhra యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని హైకోర్టులో మార్గదర్శి పిటిషన్ ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన హైకోర్టు దర్యాఫ్తును ఎనిమిది వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు కౌంటర్ దాఖలు చేయాలని యూరిరెడ్డి, సీఐడీకి నోటీసులు మార్గదర్శి క్వాష్ పిటిషన్‌పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎనిమిది వారాలు వాయిదా వేసింది. యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని హైకోర్టులో మార్గదర్శి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం... యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ దర్యాఫ్తును ఎనిమిది వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని యూరిరెడ్డి, సీఐడీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. 1 Quote
psycopk Posted October 18, 2023 Author Report Posted October 18, 2023 Kala Venkata Rao: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది: కళా వెంకట్రావు 18-10-2023 Wed 17:53 | Andhra జైల్లో చంద్రబాబును కలిసి భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ముగిసిన ములాఖత్ జైలు వద్దకు వచ్చిన టీడీపీ సీనియర్ నేతలు వీళ్లిచ్చే మందులతో చంద్రబాబుకు ఉపశమనం లేదన్న కళా వెంకట్రావు స్కిల్ కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ కుటుంబ సభ్యులు కలిశారు. నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి రాజమండ్రి జైలులో చంద్రబాబును ములాఖత్ లో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జైలు వద్దకు టీడీపీ సీనియర్ నేతలు కిమిడి కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, చినరాజప్ప తదితరులు కూడా వచ్చారు. చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ అనంతరం టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వెల్లడించారు. వీళ్లిచ్చే మందులతో ఆయనకు ఏమీ ఉపశమనం లేదని తెలుస్తోందని వివరించారు. చంద్రబాబుకు చేసే వైద్య పరీక్షల వివరాలను, డాక్టర్ల సిఫారసుల తాలూకు నివేదికకు సంబంధించిన ఓ కాపీని చంద్రబాబు కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వాలని తాము నిన్న టీడీపీ ఆఫీసు నుంచి డిమాండ్ చేశామని కళా వెంకట్రావు స్పష్టం చేశారు. దీనిపై నారా భువనేశ్వరమ్మ ఒక లేఖ కూడా రాశారని తెలిపారు. ఎప్పటికప్పుడు నివేదిక కాపీని ఇవ్వడం వల్ల చంద్రబాబు బ్లడ్ లెవల్స్ ఎలా ఉన్నాయనేది తెలుస్తుందని అన్నారు. చంద్రబాబుకు హైదరాబాదులో, విజయవాడలో వ్యక్తిగత వైద్య బృందాలు ఉన్నాయని, నివేదిక కాపీని వారికి పంపిస్తే చంద్రబాబు వాడే మందుల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలేమో సూచిస్తారన్నది చంద్రబాబు కుటుంబ సభ్యుల అభిప్రాయం అని కళా వెంకట్రావు వివరించారు. "చంద్రబాబు వైద్య నివేదికలు ఎందుకు ఇవ్వడంలేదు? ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? జగన్ రాక్షస క్రీడకు తెరలేపారు. ఇలాంటివాటికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి. కానీ జగన్ హయాంలో దీనికి అంతం కనిపించడంలేదు. 40 రోజులుగా చంద్రబాబును జైల్లో ఉంచి, ఇప్పటివరకు ఏ కోర్టులోనూ లిఖితపూర్వక ఆధారాలు చూపించలేకపోయారు. రాష్ట్రంలో ఇలాంటి నికృష్ట ప్రభుత్వం ఉంది. నువ్వు (జగన్) చేయగలిగింది ఏంటంటే... రాజ్యాంగం ప్రకారం అధికారంలో ఉన్నావు కాబట్టి రాక్షస క్రీడ కొనసాగిస్తున్నావు. మానవత్వం లేకుండా, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్న పరిమితులు కూడా దాటిపోయి వ్యక్తిగత కక్ష సాధిస్తున్నారు. మొన్న డీఐజీ మాట్లాడిన భాష చూశాం. పాలకులను మెప్పించడానికి మాట్లాడడం కాదు... జైలుకు ఓ మాన్యువల్ ఉంటుంది, పోలీసులకు ఓ మాన్యువల్ ఉంటుంది అని గుర్తించాలి. అందరినీ మేం అనడంలేదు. కొందరిని పావులుగా చేసుకుని వాడుకుంటున్నారు. అలాంటి వాళ్లు తమ భాష మార్చుకోవాలి" అని హితవు పలికారు. 1 Quote
psycopk Posted October 18, 2023 Author Report Posted October 18, 2023 https://www.instagram.com/reel/CyikeBpP54R/?igshid=MzRlODBiNWFlZA== Quote
Guest Posted October 18, 2023 Report Posted October 18, 2023 13 minutes ago, psycopk said: Kala Venkata Rao: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది: కళా వెంకట్రావు 18-10-2023 Wed 17:53 | Andhra జైల్లో చంద్రబాబును కలిసి భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ముగిసిన ములాఖత్ జైలు వద్దకు వచ్చిన టీడీపీ సీనియర్ నేతలు వీళ్లిచ్చే మందులతో చంద్రబాబుకు ఉపశమనం లేదన్న కళా వెంకట్రావు స్కిల్ కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ కుటుంబ సభ్యులు కలిశారు. నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి రాజమండ్రి జైలులో చంద్రబాబును ములాఖత్ లో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జైలు వద్దకు టీడీపీ సీనియర్ నేతలు కిమిడి కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, చినరాజప్ప తదితరులు కూడా వచ్చారు. చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ అనంతరం టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వెల్లడించారు. వీళ్లిచ్చే మందులతో ఆయనకు ఏమీ ఉపశమనం లేదని తెలుస్తోందని వివరించారు. చంద్రబాబుకు చేసే వైద్య పరీక్షల వివరాలను, డాక్టర్ల సిఫారసుల తాలూకు నివేదికకు సంబంధించిన ఓ కాపీని చంద్రబాబు కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వాలని తాము నిన్న టీడీపీ ఆఫీసు నుంచి డిమాండ్ చేశామని కళా వెంకట్రావు స్పష్టం చేశారు. దీనిపై నారా భువనేశ్వరమ్మ ఒక లేఖ కూడా రాశారని తెలిపారు. ఎప్పటికప్పుడు నివేదిక కాపీని ఇవ్వడం వల్ల చంద్రబాబు బ్లడ్ లెవల్స్ ఎలా ఉన్నాయనేది తెలుస్తుందని అన్నారు. చంద్రబాబుకు హైదరాబాదులో, విజయవాడలో వ్యక్తిగత వైద్య బృందాలు ఉన్నాయని, నివేదిక కాపీని వారికి పంపిస్తే చంద్రబాబు వాడే మందుల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలేమో సూచిస్తారన్నది చంద్రబాబు కుటుంబ సభ్యుల అభిప్రాయం అని కళా వెంకట్రావు వివరించారు. "చంద్రబాబు వైద్య నివేదికలు ఎందుకు ఇవ్వడంలేదు? ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? జగన్ రాక్షస క్రీడకు తెరలేపారు. ఇలాంటివాటికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి. కానీ జగన్ హయాంలో దీనికి అంతం కనిపించడంలేదు. 40 రోజులుగా చంద్రబాబును జైల్లో ఉంచి, ఇప్పటివరకు ఏ కోర్టులోనూ లిఖితపూర్వక ఆధారాలు చూపించలేకపోయారు. రాష్ట్రంలో ఇలాంటి నికృష్ట ప్రభుత్వం ఉంది. నువ్వు (జగన్) చేయగలిగింది ఏంటంటే... రాజ్యాంగం ప్రకారం అధికారంలో ఉన్నావు కాబట్టి రాక్షస క్రీడ కొనసాగిస్తున్నావు. మానవత్వం లేకుండా, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్న పరిమితులు కూడా దాటిపోయి వ్యక్తిగత కక్ష సాధిస్తున్నారు. మొన్న డీఐజీ మాట్లాడిన భాష చూశాం. పాలకులను మెప్పించడానికి మాట్లాడడం కాదు... జైలుకు ఓ మాన్యువల్ ఉంటుంది, పోలీసులకు ఓ మాన్యువల్ ఉంటుంది అని గుర్తించాలి. అందరినీ మేం అనడంలేదు. కొందరిని పావులుగా చేసుకుని వాడుకుంటున్నారు. అలాంటి వాళ్లు తమ భాష మార్చుకోవాలి" అని హితవు పలికారు. Kaatiki kaaalu chaapukunna vayasulu.....rajakeeyalu avasaramaaa ani prasnisthunna @Sanjiv @ZoomNaidu Quote
psycopk Posted October 18, 2023 Author Report Posted October 18, 2023 YS Jagan: చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టు తీర్పు... డీజీపీ, పొన్నవోలు, సజ్జలతో సీఎం జగన్ సమీక్ష 18-10-2023 Wed 22:39 | Andhra సీఎం నివాసంలో కీలక సమావేశం తీర్పు ఎలా వస్తుందనే అంశంపై న్యాయవాదుల నుంచి అభిప్రాయ సేకరణ తీర్పు ఎలా వచ్చినా అప్రమత్తంగా ఉండాలని డీజీపీకి ఆదేశం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్... డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులతో తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టులో తీర్పు ఎలా వస్తుంది? అనే అంశంపై న్యాయవాదుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారని తెలుస్తోంది. ఎల్లుండి సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారని సమాచారం. తీర్పు ఎలా వచ్చినా అందుకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలని డీజీపీని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో పాటు ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల అంశంపై కూడా చర్చించారు. 1 Quote
futureofandhra Posted October 18, 2023 Report Posted October 18, 2023 5 hours ago, Sucker said: Thupaass case lo meeru dorakatam yendhayya ekkada dorikadu where is the money trail Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.