Jump to content

Update on CID tuppas cases


Recommended Posts

Posted

Chandrababu: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చాలంటూ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్... సుప్రీంలో విచారణ వాయిదా 

29-11-2023 Wed 14:51 | Andhra
  • తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు
  • సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసిన ఆర్కే
  • ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వినతి
  • విచారణ వాయిదా కోరిన చంద్రబాబు న్యాయవాది లూథ్రా
  • రెండు వారాలు వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం
 
Supreme Court adjourns hearing on cash for vote case petitions filed by MLA Alla Ramakrishnareddy
Listen to the audio version of this article

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరును కూడా చేర్చాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. అంతేకాదు, ఈ కేసును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆర్కే మరో పిటిషన్ వేశారు. దర్యాప్తులో ఏసీబీ విఫలమైందని, అందుకే సీబీఐకి అప్పగించాలని కోరారు. 

ఈ పిటిషన్లపై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. అయితే, విచారణను వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తి చేశారు. లూథ్రా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. 

ఓటుకు నోటు కేసును తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లొచ్చారు.

Posted

Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా 

29-11-2023 Wed 16:05 | Andhra
  • చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదు చేసిన సీఐడీ
  • ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
  • తదుపరి విచారణ డిసెంబరు 1కి వాయిదా వేసిన హైకోర్టు 
 
Hearing on Inner Ring Road case adjourns fro Dec 1
Listen to the audio version of this article

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ డిసెంబరు 1కి వాయిదా వేసింది. 

అటు, అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపైనా హైకోర్టులో విచారణ జరిగింది. నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్, క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం డిసెంబరు 11కి వాయిదా వేసింది. 

అంతేకాదు, తనపై లుకౌట్ నోటీసులు జారీ చేయడంపై నారాయణ అల్లుడు వరుణ్ దాఖలు చేసిన పిటిషన్ కూడా నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. సీఐడీ లుకౌట్ సర్క్యులర్ ను సవాల్ చేస్తూ వరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. వరుణ్ సైతం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిందితుడిగా ఉన్నారు. 

వరుణ్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ సందర్భంగా... కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని సీఐడీ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనలు ముగిసిన పిమ్మట తదుపరి విచారణను హైకోర్టు డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేసింది. 

 

Posted

BTech Ravi: టీడీపీ పులివెందుల ఇన్ఛార్జీ బీటెక్ రవికి బెయిల్ మంజూరు 

29-11-2023 Wed 16:38 | Andhra
  • బీటెక్ రవికి బెయిల్ మంజూరు చేసిన కడప కోర్టు
  • ఈ నెల 14 నుంచి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రవి
  • కడప విమానాశ్రయం వద్ద పోలీసులతో వాగ్వాదం నేపథ్యంలో రవిపై కేసు
 
Kadapa Court grants bail to TDP leader BTech Ravi
Listen to the audio version of this article

టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జీ, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి కడప కోర్టులో ఊరట లభించింది. ఆయనకు కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన ఈ సాయంత్రం జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి కడప జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

ఈ నెల 14న బీటెక్ రవిని వల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బీటెక్ రవి అరెస్ట్ వివరాల్లోకి వెళ్తే... నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఆ సందర్భంగా లోకేశ్ కు స్వాగతం పలికేందుకు బీటెక్ రవి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. విమానాశ్రయంలోకి వెళ్లడానికి ఆయన ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Posted

Chandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

30-11-2023 Thu 14:35 | Andhra
  • పిటిషన్ ను విచారించిన జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం
  • తదుపరి విచారణ డిసెంబర్ 12వ తేదీకి వాయిదా
  • అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం
 
Supreme Court adjourns Chandrababu bail plea hearing in Fibernet case
Listen to the audio version of this article

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదీల ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పిటిషన్ ను విచారిస్తామని... అంతవరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

మరోవైపు ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల 9, గత నెల 13, 17, 20వ తేదీల్లో జరిగింది. అయితే, స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాత ఈ పిటిషన్ ను పరిశీలిస్తామని ధర్మాసనం ఇంతకు ముందే తెలిపింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడకపోవడంతో విచారణను మరోసారి వాయిదా వేసింది.

Posted

Chandrababu: చంద్రబాబుకు భారీ ఊరట.. సీఐడీ పీటీ వారెంట్లను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు 

05-12-2023 Tue 11:43 | Andhra
  • ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ పీటీ వారెంట్లు
  • చంద్రబాబు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారన్న ఏసీబీ కోర్టు
  • పీటీ వారెంట్లకు విచారణ అర్హత లేదని స్పష్టీకరణ
 
ACB court rejects CID PT warrants on Chandrababu in IRR and Fiber Net cases

టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు భారీ ఊరటనిచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబును విచారించేందుకు సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సమయంలోనే సీఐడీ పీటీ వారెంట్లు దాఖలు చేసింది. ఈరోజు ఈ పిటిషన్లను విచారించిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారని... అందువల్ల పీటీ వారెంట్లకు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. 

Posted

Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా 

06-12-2023 Wed 15:47 | Andhra
  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్
  • ఉచిత ఇసుక కేసులోనూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
  • రెండు పిటిషన్లపై విచారణ 12వ తేదీకి వాయిదా
 
High Court adjourned Chandrababu bail petitions
Listen to the audio version of this article

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణను రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 12వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అలాగే ఉచిత ఇసుక కేసులోనూ చంద్రబాబు పిటిషన్‌పై విచారణను డిసెంబర్ 12వ తేదీకే వాయిదా వేసింది. ఈ కేసులోనూ ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

Posted

Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జనవరి 19కి వాయిదా 

08-12-2023 Fri 15:58 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్
  • రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్
  • ఈ కేసు వ్యవహారం 17ఏ అంశంతో ముడిపడి ఉందన్న చంద్రబాబు న్యాయవాది 
 
Supreme Court adjourns hearing on Chandrababu bail cancellation petition
Listen to the audio version of this article

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై నేడు విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. నేటి విచారణలో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. తాము కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. ఈ కేసు వ్యవహారం 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని సాల్వే ప్రస్తావించారు. 

చంద్రబాబుకు ధర్మాసనం గతంలో నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు ముగిసిన అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... దీనిపై విచారణను జనవరి మూడో వారంలో చేపడతామని తెలిపింది. దాంతో, తేదీ ఖరారు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు విన్నవించారు. సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.

Posted

Assigned Lands Case: అమరావతి అసైన్డ్ భూముల కేసు.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు 

14-12-2023 Thu 15:37 | Andhra
  • కేసులో మరికొందరిని నిందితులుగా చేర్చామన్న సీఐడీ
  • కేసును రీఓపెన్ చేయాలని హైకోర్టుకు విన్నపం
  • తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు
 
AP High Court adjourned Assigned lands case
Listen to the audio version of this article

అమరావతి అసైన్డ్ భూముల అంశంపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ వేసిన క్వాష్ పిటిషన్లపై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈనాటి విచారణ సందర్భంగా... ఈ కేసులో మరికొందరిని నిందితులుగా చేర్చామని హైకోర్టుకు సీఐడీ తెలిపింది. కేసును రీఓపెన్ చేయాలని కోర్టును కోరింది. కేసును రీఓపెన్ చేయడంపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

 

Posted

Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ 

18-12-2023 Mon 10:28 | Andhra
  • ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ కేసు
  • ఇన్నర్ రింగ్ రోడ్ కాంట్రాక్టులో అక్రమాలంటూ మరో కేసు
  • రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ చీఫ్ పిటిషన్
 
Chandrababu Anticipatory Bail Petitions Will Be Heard In The Ap High Court Today
Listen to the audio version of this article

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం బ్రేక్ తర్వాత ఈ పిటిషన్లపై విచారణ జరగనుందని హైకోర్టు వర్గాలు తెలిపాయి. టీడీపీ పాలనలో అమలు చేసిన ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని సీబీఐ అధికారులు చంద్రబాబుపై కేసు పెట్టారు. దీంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్ఆర్) కాంట్రాక్టు విషయంలో అవకతవకలు జరిగాయని, క్విడ్ కో ప్రో కు పాల్పడ్డారంటూ చంద్రబాబుపై మరో కేసు నమోదు చేశారు.

సీఐడీ పెట్టిన ఈ రెండు కేసులలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. నేడు విచారించనుంది. లంచ్ బ్రేక్ తర్వాత ఈ పిటిషన్లపై విచారణ జరగనున్నట్లు సమాచారం.

Posted

Babu garu nippu...ae thappu cheyaledu...anduke mundasthu bail...adi workout avakapothey health reasons...

idi vayya visionary ante...emi vision..!! etla tappinchukoni tiragalo CBN ni chusi nerchukovali..

Rey Jagga...CB ni chusi nerchukvayya...

  • Haha 2
Posted

Chandrababu: ఐఆర్ఆర్ కేసు: లిఖితపూర్వక వాదనలను కోర్టులో సమర్పించిన చంద్రబాబు న్యాయవాదులు 

22-12-2023 Fri 16:04 | Andhra
  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ1గా చంద్రబాబు
  • ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ అధినేత
  •  నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు
  • ఇరుపక్షాల లిఖితపూర్వక వాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు వెల్లడి
 
Chandrababu advocates files written arguments in AP High Court
Listen to the audio version of this article

అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే ఇతర రోడ్ల అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేయడంతో తెలిసిందే. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1గా పేర్కొంది. 

ఈ నేపథ్యంలో, చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో సెప్టెంబరులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలను కోర్టుకు సమర్పించారు. 

అటు, సీఐడీ తరఫున ప్రభుత్వ న్యాయవాదులు కూడా లిఖితపూర్వక వాదనలను కోర్టులో దాఖలు చేశారు. ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి ఇరుపక్షాల లిఖితపూర్వక వాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు హైకోర్టు పేర్కొంది. అనంతరం, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

Posted

Nara Lokesh: నారా లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతినివ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ 

22-12-2023 Fri 14:47 | Andhra
  • దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేశ్ బెదిరిస్తున్నారన్న సీఐడీ
  • ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపణ
  • ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాలని విన్నపం
 
AP CID files petition to arrest Nara Lokesh
Listen to the audio version of this article

టీడీపీ యువనేత నారా లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు తమకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. రెడ్ బుక్ లో మీ పేర్లు రాశానని చెపుతూ పోలీసు విచారణ అధికారులను లోకేశ్ బెదిరిస్తున్నారని పిటషన్ లో పేర్కొంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేసుల్లో ఉన్న దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని సీఐడీ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. 

దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా? అని సీఐడీ లాయర్ ను కోర్టు ప్రశ్నించింది. దీంతో, పేపర్ కటింగ్ లను కోర్టుకు ఆయన చూపించారు. ఐఆర్ఆర్ కేసులో 41ఏ కింద లోకేశ్ కు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని... అయితే, కోర్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతిని ఇవ్వాలని కోరారు. రెడ్ బుక్ పేరుతో చేస్తున్న హెచ్చరికలను సీరియస్ గా తీసుకోవాలని విన్నవించారు. 

Posted

Chandrababu Bail: చంద్రబాబు ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వ్ 

23-12-2023 Sat 13:04 | Andhra
  • ఐఆర్ఆర్ కేసులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం
  • శుక్రవారం లిఖిత పూర్వక వాదనలు సమర్పించిన ఇరు పక్షాలు
  • పరిశీలించి తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
 
AP High Court Reserved Verdict On Chandrababau Anticipatory Bail Plea
Listen to the audio version of this article

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే ఇతర రోడ్ల అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో ఏపీ సీఐడీ చంద్రబాబు సహా పలువురిపై కేసు నమోదు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1 గా పేర్కొంటూ విచారణ చేపట్టింది.

ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు సెప్టెంబర్ లో హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. శుక్రవారం ఏపీ సీఐడీ, చంద్రబాబు తరఫు లాయర్లు సమర్పించిన లిఖితపూర్వక వాదనలు పరిశీలించింది. శనివారం తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. 

 

Posted
On 12/18/2023 at 3:57 PM, Android_Halwa said:

Babu garu nippu...ae thappu cheyaledu...anduke mundasthu bail...adi workout avakapothey health reasons...

idi vayya visionary ante...emi vision..!! etla tappinchukoni tiragalo CBN ni chusi nerchukovali..

Rey Jagga...CB ni chusi nerchukvayya...

Ne badha cbn tappinchuku tiruguntundu ana? Leka jagga M levatleda ana?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...