psycopk Posted October 26, 2023 Report Posted October 26, 2023 Chandrababu: అత్యవసరంగా విచారణ జరపాలంటూ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ 26-10-2023 Thu 12:18 | Andhra పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు 3 నెలల క్రితం బాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందన్న న్యాయవాదులు టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలయింది. చంద్రబాబు తరపు అడ్వకేట్లు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. 3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని... ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు, చంద్రబాబు కంటి సమస్యలకు చికిత్స అవసరమని ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చినట్టు టీడీపీ నేతలు చెపుతున్నారు. అయితే నివేదికను మార్చి ఇవ్వాలంటూ వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని వారు మండిపడుతున్నారు. హెల్త్ బులెటిన్ లో కంటి సమస్యను ప్రస్తావించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనిపై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ స్పందిస్తూ... చంద్రబాబుకు నాలుగు నెలల క్రితం ఒక కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, రెండో కంటికి ఇప్పుడే ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు చెప్పారని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు అడ్వకేట్లు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 1 Quote
psycopk Posted October 26, 2023 Author Report Posted October 26, 2023 Chandrababu: చంద్రబాబు కంటికి ఆపరేషన్ అవసరం లేదంటూ వైద్యుల నివేదిక.. జైలు అధికారులు మార్చేశారంటున్న టీడీపీ నేతలు 26-10-2023 Thu 11:01 | Andhra బుధవారం చంద్రబాబును పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు కంటికి చికిత్స అవసరమంటూ జైలు అధికారుల హెల్త్‌బులెటిన్ టీడీపీ నేతల ఆరోపణలు నిజం కాదంటున్న జైలు సూపరింటెండెంట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి కంటి సమస్యలకు చికిత్స అవసరమంటూ వైద్యులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వం దాచిపెడుతోందని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం చంద్రబాబును పరీక్షించిన వైద్యులు నివేదిక ఇచ్చారని, అందులో ఆయన కంటికి చికిత్స అవసరమని పేర్కొన్నారని తెలిపారు. అయితే, జైలు అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో కంటి సమస్యను ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు కంటికి చికిత్స అవసరమని వైద్యులు చెబితే.. ఆ నివేదికను మార్చి ఇవ్వాలని వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఈ ఆరోపణలపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ వివరణ ఇస్తూ.. చంద్రబాబు నాలుగు నెలల క్రితం ఓ కంటికి ఆపరేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయనను పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు.. రెండో కంటికి వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారని వివరించారు 1 Quote
Popular Post Aquaman Posted October 26, 2023 Popular Post Report Posted October 26, 2023 thelarindha samara 3 Quote
psycopk Posted October 26, 2023 Author Report Posted October 26, 2023 Chandrababu: స్కిల్ కేసు: కాల్ డేటా అంశంలో కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు 26-10-2023 Thu 17:35 | Andhra స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ సీఐడీ అధికారుల కాల్ డేటా కోరిన చంద్రబాబు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ అధికారులకు కోర్టు ఆదేశం విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు స్కిల్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ లో పాలుపంచుకున్న సీఐడీ అధికారుల కాల్ డేటా అందించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ న్యాయస్థానం సీఐడీ అధికారులను ఆదేశించింది. అక్టోబరు 26వ తేదీని తుది గడువుగా పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు నేడు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారుల కాల్ డేటా అందిస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, కాల్ డేటా అందించడం భద్రతా రీత్యా కూడా ఆందోళన కలిగించే అంశం అని సీఐడీ అధికారుల తరఫు న్యాయవాదులు కౌంటర్ లో పేర్కొన్నారు. కాగా, వాదనలు విన్న అనంతరం ఏసీబీ కోర్టు తదుపరి విచారణను రేపటి వాయిదా వేసింది. 1 Quote
psycopk Posted October 26, 2023 Author Report Posted October 26, 2023 Chandrababu: చంద్రబాబుకు 4 నెలల కిందట ఒక కంటికి ఆపరేషన్ జరిగింది... ఇప్పుడు మరో కంటికి ఆపరేషన్ చేయాలి: చినరాజప్ప 26-10-2023 Thu 17:51 | Andhra రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు చంద్రబాబు కంటి ఆరోగ్యంపై టీడీపీ నేతల్లో ఆందోళన చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందన్న చినరాజప్ప మరో ఆపరేషన్ అవసరం లేదని జైలు అధికారులు ఎలా చెబుతారని ఆగ్రహం రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు కంటి ఆరోగ్యం పట్ల టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశంపై మాజీ హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. చంద్రబాబుకు 4 నెలల కిందట ఓ కంటికి ఆపరేషన్ నిర్వహించారని వెల్లడించారు. ఇది క్యాటరాక్ట్ ఆపరేషన్ అని, మూడు నెలల లోపు మరో కంటికి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉందని వివరించారు. ఇది డాక్టర్లు చెప్పిన మాట అని, కానీ జైలు అధికారులు చంద్రబాబు కంటి ఆరోగ్యం బాగానే ఉంది అనడం హేయమైన విషయం అని చినరాజప్ప తీవ్రంగా విమర్శించారు. "ఎలాంటి తప్పు చేయని చంద్రబాబును 48 రోజులుగా జైల్లో ఉంచారు. చంద్రబాబు తప్పు చేశాడనడానికి ఆధారాలు దొరకడంలేదని, ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామని సజ్జల కూడా చెప్పాడు. చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదని, ఆయన బలహీనంగా ఉన్నాడని చాలాసార్లు చెప్పాం. జైలు అధికారులు, పోలీసులు సజ్జల డైరెక్షన్ లో నడుస్తున్నారు. చంద్రబాబు కంటికి ఆపరేషన్ అవసరంలేదని జైలు సూపరింటిండెంట్ కూడా చెబుతున్నాడు. ఆపరేషన్ అవసరం ఏంటో, దాని బాధ ఏంటో రోగికి తెలుస్తుంది కానీ వీళ్లకేం తెలుస్తుంది? చంద్రబాబు ఆరోగ్యంపై ఏదన్నా జరిగితే అధికారులదీ, ముఖ్యమంత్రిదీ, సజ్జలదే బాధ్యత" అని చినరాజప్ప స్పష్టం చేశారు. 1 Quote
psycopk Posted October 26, 2023 Author Report Posted October 26, 2023 Ganta Srinivasa Rao: దీన్ని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా: గంటా శ్రీనివాసరావు 26-10-2023 Thu 17:50 | Andhra స్కిల్ సెంటర్లను ప్రభుత్వం డస్ట్ బిన్లుగా మార్చిందని గంటా మండిపాటు చంద్రబాబుపై రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారని విమర్శ స్కిల్ సెంటర్లలో అక్రమాలు జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లలో అక్రమాలు జరిగినట్టు నిరూపించగలిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. స్కిల్ సెంటర్లపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని చెప్పారు. మంత్రులు, సామంతులు, సలహాదారులు ఎవరు చర్చకు వచ్చినా రెడీ అని అన్నారు. స్కిల్ సెంటర్లను జగన్ ప్రభుత్వం డస్ట్ బిన్లుగా మార్చేసిందని విమర్శించారు. రాజకీయ కారణాలతో వాటిని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. చంద్రబాబుపై రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారని అన్నారు. కోర్టు సెలవుల తర్వాత చంద్రబాబుకు అక్రమ కేసుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పారు. ఆంధ్ర యూనివర్శిటీలోని స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఈరోజు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గంటా పైవ్యాఖ్యలు చేశారు. 1 Quote
Popular Post psycopk Posted October 26, 2023 Author Popular Post Report Posted October 26, 2023 Raghavendra Rao: ప్రజల ఆగ్రహ జ్వాలలు వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో దహించి వేస్తాయి: రాఘవేంద్రరావు, అశ్వనీ దత్ 26-10-2023 Thu 15:48 | Entertainment భువనేశ్వరి యాత్రకు సంఘీభావం తెలిపిన రాఘవేంద్రరావు, అశ్వనీదత్ నిజంగానే నిజం గెలుస్తుందని వ్యాఖ్య బాబు అరెస్ట్ పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోందన్న సినీ దిగ్గజాలు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ అరెస్ట్ అక్రమమని వారు అన్నారు. నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' యాత్రకు వారు సంఘీభావం ప్రకటించారు. తమ సోదరి భువనేశ్వరి చేపట్టిన యాత్రకు వస్తున్న భారీ స్పందనను చూస్తుంటే... నిజంగానే నిజం గెలుస్తుందని అనిపిస్తోందని చెప్పారు. నిజం గెలిచి, ప్రజలు విజయభేరి మోగించే సమయం దగ్గర్లోనే ఉందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోందని... ప్రజల ఆగ్రహ జ్వాలలు వైసీపీ ప్రభుత్వాన్ని దహించి వేస్తాయని చెప్పారు. భువనేశ్వరి యాత్ర రేపటి చంద్రబాబు ఘన విజయానికి హృదయపూర్వక ఆహ్వానం అని అన్నారు. 3 Quote
ShruteSastry Posted October 26, 2023 Report Posted October 26, 2023 Hey Idhi kotta scheme aaa 1 Quote
ticket Posted October 26, 2023 Report Posted October 26, 2023 1 hour ago, psycopk said: Chandrababu: స్కిల్ కేసు: కాల్ డేటా అంశంలో కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు 26-10-2023 Thu 17:35 | Andhra స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ సీఐడీ అధికారుల కాల్ డేటా కోరిన చంద్రబాబు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ అధికారులకు కోర్టు ఆదేశం విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు స్కిల్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ లో పాలుపంచుకున్న సీఐడీ అధికారుల కాల్ డేటా అందించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ న్యాయస్థానం సీఐడీ అధికారులను ఆదేశించింది. అక్టోబరు 26వ తేదీని తుది గడువుగా పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు నేడు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారుల కాల్ డేటా అందిస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, కాల్ డేటా అందించడం భద్రతా రీత్యా కూడా ఆందోళన కలిగించే అంశం అని సీఐడీ అధికారుల తరఫు న్యాయవాదులు కౌంటర్ లో పేర్కొన్నారు. కాగా, వాదనలు విన్న అనంతరం ఏసీబీ కోర్టు తదుపరి విచారణను రేపటి వాయిదా వేసింది. Call data lo..mana sheem name untundi ani bhayama . Quote
Vaaaampire Posted October 26, 2023 Report Posted October 26, 2023 Unlimited unstoppable comedy 2 Quote
Vaaaampire Posted October 26, 2023 Report Posted October 26, 2023 1 hour ago, psycopk said: Raghavendra Rao: ప్రజల ఆగ్రహ జ్వాలలు వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో దహించి వేస్తాయి: రాఘవేంద్రరావు, అశ్వనీ దత్ 26-10-2023 Thu 15:48 | Entertainment భువనేశ్వరి యాత్రకు సంఘీభావం తెలిపిన రాఘవేంద్రరావు, అశ్వనీదత్ నిజంగానే నిజం గెలుస్తుందని వ్యాఖ్య బాబు అరెస్ట్ పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోందన్న సినీ దిగ్గజాలు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ అరెస్ట్ అక్రమమని వారు అన్నారు. నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' యాత్రకు వారు సంఘీభావం ప్రకటించారు. తమ సోదరి భువనేశ్వరి చేపట్టిన యాత్రకు వస్తున్న భారీ స్పందనను చూస్తుంటే... నిజంగానే నిజం గెలుస్తుందని అనిపిస్తోందని చెప్పారు. నిజం గెలిచి, ప్రజలు విజయభేరి మోగించే సమయం దగ్గర్లోనే ఉందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోందని... ప్రజల ఆగ్రహ జ్వాలలు వైసీపీ ప్రభుత్వాన్ని దహించి వేస్తాయని చెప్పారు. భువనేశ్వరి యాత్ర రేపటి చంద్రబాబు ఘన విజయానికి హృదయపూర్వక ఆహ్వానం అని అన్నారు. Nijam gelavali ani korukuntunna. Corruption chesina mf’s jail ki povali 2 Quote
JANASENA Posted October 26, 2023 Report Posted October 26, 2023 This will end up like Karunanidhi and JayaLalitha rift. Repodnna TDP vachaka jaggadu jail ki, jagan acha ka CBN jail ki Quote
Sonu_PateI Posted October 26, 2023 Report Posted October 26, 2023 1 hour ago, Aquaman said: thelarindha samara He did not sleep no from CBN arrest 2 Quote
futureofandhra Posted October 26, 2023 Report Posted October 26, 2023 3 minutes ago, JANASENA said: This will end up like Karunanidhi and JayaLalitha rift. Repodnna TDP vachaka jaggadu jail ki, jagan acha ka CBN jail ki only difference tdp time lo development jaggad time lo nothing 1 Quote
Sanjiv Posted October 26, 2023 Report Posted October 26, 2023 thanks for today’s dose of comedies. Konchem veella latkoor list, news media list veskondi ikkada all the vague reasons they quoted so far, for the release of CBN… a/c, fans hot water 74 year old man cataract surgery … … need more comedy Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.