psycopk Posted November 19, 2023 Report Posted November 19, 2023 Team India: వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి కారణాలు ఇవే! 19-11-2023 Sun 22:53 | Sports బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టిన ఆస్ట్రేలియా వేగంగా ఆడడమే గానీ పెద్ద స్కోరుపై దృష్టిపెట్టని కెప్టెన్ రోహిత్ కోహ్లీ-కేఎల్ రాహుల్ భాగస్వామ్యంలో నెమ్మదించిన జట్టు రన్‌రేట్ ఫైనల్‌లో ఓటమికి దారి తీసిన పలు కారణాలు భారత్ మూడోసారి ప్రపంచ కప్‌ను గెలవాలని కోరుకున్న అభిమానుల కలలు నెరవేరలేదు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. 240 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించింది. అయితే లీగ్ దశలో కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని భారత్ ఫైనల్లో ఓడిపోవడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. అయితే ఫైనల్లో టీమిండియా ఓడిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి గమనిద్దాం.. పెద్ద స్కోర్ చేయలేకపోయిన కెప్టెన్ రోహిత్ ప్రపంచ కప్ ఆరంభం నుంచి రోహిత్ శర్మ ఒకటే దూకుడుని కొనసాగిస్తున్నాడు.ఈ టోర్నీలో అతడి 121 స్ట్రైక్ రేట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఫైనల్ మ్యాచ్‌లో మరింత చెలరేగి ఆడాడు. అయితే వ్యక్తిగత స్కోరు 47 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆరంభంలో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. పేపసర్లు జోష్ హేజిల్‌వుడ్, స్టార్క్ ఓవర్లలో బాగానే పరుగులు రాబట్టాడు. అదే ఊపు స్పిన్నర్ మ్యాక్స్‌వెల్‌పై ప్రదర్శించాడు. ఈ క్రమంలో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జాగ్రత్తగా ఆడి పెద్ద స్కోరు చేయగలిగివుంటే బావుండేదని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆస్ట్రేలియా ఫీల్డింగ్ అదుర్స్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్‌లో అద్బుతమైన ఫీల్డింగ్ చేశారు. టీమిండియా ఫీల్డింగ్‌తో పోల్చితే చాలా బెటర్‌గా మైదానంలో చురుగ్గా కదిలారు. చాలా బౌండరీలను ఆపారు. బౌండరీల వద్ద విన్యాసాలు చేస్తూ బంతులను అడ్డుకున్నారు. సెంచరీ హీరో ట్రావీస్ హెడ్ రోహిత్ శర్మ ఇచ్చిన అత్యంత సంక్లిష్టమైన క్యాచ్‌ని అందుకుని సంచలనం సృష్టించాడు. మరో సీనియర్ డేవిడ్ వార్నర్ వయసుతో సంబంధం లేకుండా పలు బౌండరీలను సేవ్ చేశాడు. ఈ విధంగా భారత్ పరుగులను విజయవంతంగా నియంత్రించారు. కెప్టెన్ కమ్మిన్స్ మంచి ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ చేయడం కూడా వారికి కలిసొచ్చింది. ఇది భారత బ్యాటర్‌లను ఒకింత నిరాశకు గురి చేసిందని చెప్పాల్సిందే. జంకుతూ ఆడిన గిల్, శ్రేయస్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌లకు ఇది మొదటి వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కావడంతో వారిలో ఒకింత ఆందోళన కనిపించింది. సులభమైన బంతిని క్యాచ్‌గా ఇచ్చి గిల్ వెనుదిరగడం మైనస్‌గా మారింది.ఇక నెదర్లాండ్స్, న్యూజిలాండ్‌లపై వరుస సెంచరీలు కొట్టిన శ్రేయస్ ఫైనల్ మ్యాచ్‌లో తేలిపోయాడు.3 బంతుల్లోనే ఇన్నింగ్స్ ముగించాడు. ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవంలేమి వారికి మైనస్‌గా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కోహ్లీ, రాహుల్ పార్ట్‌నర్‌షిప్ ఓకే..కానీ ఇండియా 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత కోహ్లీ, రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిగ్గారు. పరిస్థితికి తగ్గట్టు ఆడాడు. అయితే చాలా నెమ్మదిగా ఆడడంతో జట్టు స్కోరు మందగించింది. వీరిద్దరి భాగస్వామ్యంలో కేవలం ఒకే బౌండరీ ఉందంటే ఎంత నెమ్మదిగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. అదరగొట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్.. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అదరగొట్టాడు. టోర్నీ మొత్తం మీద 10 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లే పడగొట్టినప్పటికీ ఫైనల్ మ్యాచ్‌లో రాణించాడు. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వికెట్లు తీసి జట్టుకు తిరుగులేని ఆధిపత్యాన్నిఅందించాడు. ఆ తర్వాత టీమిండియా ఏ సమయంలో పెద్దగా పరుగులు రాబట్టలేకపోయింది. రన్ రేట్ బాగా నెమ్మదించింది. దీంతో భారత్ తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా విజయవంతమైంది. తేలిపోయిన భారత బౌలర్లు.. వరల్డ్ మొత్తం అదరగొట్టిన టీమిండియా బౌలర్లు ఫైనల్ మ్యాచ్‌లో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయారు. ఆరంభంలో 3 వికెట్లు తీయడంతో ఆరంభంలో ఆశలు చిగురించినా ఆ తర్వాత ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ట్రావిస్ హెడ్, లబూషేన్ నెలకొల్పిన భారీ భాగస్వామ్యం టీమిండియా ఓటమికి బాటలు వేసింది. Quote
Thokkalee Posted November 19, 2023 Report Posted November 19, 2023 1 hour ago, futureofandhra said: aussies played liek professionals india succumbed to pressure fighter jets entira cricket wolrd cup muscle power show debacle idhi Vomerica lo galli sports events ki kuda helicopters and fighter planes vastayi kadaa… World Cup ki vaste emavuddi 1 Quote
veerigadu Posted November 19, 2023 Report Posted November 19, 2023 26 minutes ago, psycopk said: Oka amaravati... Oka chandrayan... Oka worldcup.. Aadini pilavakandi ra ayya... 😂😂😂 golden hand Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.