Jump to content

Cbn gets bail in high court for skill development case


Recommended Posts

Posted

Chandrababu: స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు 

20-11-2023 Mon 14:56 | Andhra
  • టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట
  • సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనలను కొట్టిపారేసిన హైకోర్టు
  • చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన జస్టిస్ టి.మల్లికార్జునరావు
  • చంద్రబాబు ఈ నెల 29 నుంచి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని వెల్లడి
  • ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లనక్కర్లేదని స్పష్టీకరణ
 
AP High Court granted bail to Chandrababu in skill case

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. వాదనలు విన్న పిమ్మట ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. 

ఇటీవల చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వగా, ఆ బెయిల్ గడువు నాలుగు వారాలుగా న్యాయస్థానం పేర్కొంది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లనక్కర్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని వివరించింది. 

చంద్రబాబు నవంబరు 29 నుంచి రాజకీయ సభలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ నెల 30న చంద్రబాబు విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తన చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. 

కాగా, ఇవాళ తీర్పు సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఆధారాల్లేవని హైకోర్టు అభిప్రాయపడింది. వాదనలను పరిశీలించిన అనంతరం జస్టిస్ టి.మల్లికార్జునరావు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించారు.

  • Haha 1
Posted

Chandrababu: చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చే క్రమంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు 

20-11-2023 Mon 16:12 | Andhra
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట
  • రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా తీవ్రస్థాయిలో వాదోపవాదాలు
  • చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు అంగీకరిస్తున్నామన్న హైకోర్టు
 
AP High Court observations in Chandrababu bail plea hearing

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ సందర్భంగా హైకోర్టులో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. 

చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు. చంద్రబాబు ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఆయనకు ఈ దశలో బెయిల్ ఇవ్వరాదని కోర్టును కోరారు. సీఐడీ వాదనల పట్ల హైకోర్టు ధర్మాసనం స్పందించింది. 

నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని హైకోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు స్పందించారు. చంద్రబాబు పార్టీ ఖాతాకు నిధులు మళ్లించినట్టు ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దాంతో హైకోర్టు కూడా చంద్రబాబు తరఫు న్యాయవాదులతో ఏకీభవించింది. 

టీడీపీ ఖాతాలోకి నిధులు మళ్లాయన్న ప్రాసిక్యూషన్ ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. తగిన ఆధారాలు లేకుండా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయలేరని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు అంగీకరిస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. 

ప్రతి సబ్ కాంట్రాక్టర్ తప్పులకు ముఖ్యమంత్రిని బాధ్యుడ్ని చేయలేమని అన్నారు. ఉల్లంఘనలపై అధికారులు ముఖ్యమంత్రికి చెప్పినట్టు ఆధారాలు లేవని తెలిపారు. స్కిల్ వ్యవహారంలో దర్యాప్తు మొదలయ్యాక చంద్రబాబు 22 నెలలు బయటే ఉన్నారని ధర్మాసనం వెల్లడించింది. విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం కూడా లేదు కదా అని వాఖ్యానించింది. 

చంద్రబాబుపై కొన్నిరోజుల ముందే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వెల్లడించింది. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్ జీ భద్రతలో ఉన్నారని, అలాంటి వ్యక్తి కేసు విచారణ నుంచి తప్పించుకుంటారా? అని ప్రశ్నించింది. కేసు విచారణకు చంద్రబాబు విఘాతం కలిగిస్తారన్న వాదనలను తాము అంగీకరించబోమని హైకోర్టు స్పష్టం చేసింది.

సీమెన్స్ కంపెనీ డైరక్టర్, డిజైన్ టెక్ యజమాని వాట్సాప్ సందేశాలకు, చంద్రబాబుకు ఏమిటి సంబంధం? అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా సీఐడీ న్యాయవాది స్పందిస్తూ, సీమెన్స్ తో ఒప్పందంలో సుమన్ బోస్ పేరుతో సంతకం ఉందని వెల్లడించారు. అందుకు కోర్టు బదులిస్తూ... ఒప్పందాల్లో సంతకాలు పరిశీలించే బాధ్యత ముఖ్యమంత్రిది కాదని పేర్కొంది. సంతకాలపై అభ్యంతరాలు ఉంటే తేల్చడానికి ఫోరెన్సిక్ విభాగం ఉందని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమ లావాదేవీలు జరిగాయని చెప్పేందుకు ఆధారాలు లేవని హైకోర్టు వివరించింది.

  • Haha 1
Posted

Nara Lokesh: చంద్రబాబు బెయిల్ తీర్పులోని హైలైట్స్ ను షేర్ చేసిన నారా లోకేశ్ 

20-11-2023 Mon 17:08 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్
  • సత్యం గెలిచిందన్న నారా లోకేశ్
  • అసత్యంపై యుద్ధం ఆరంభమైందని వెల్లడి
  • తప్పుడు కుట్రలన్నీ న్యాయం ముందు బద్దలయ్యాయని వ్యాఖ్యలు
  • బెయిల్ తీర్పు కాపీలోని కీలక అంశాలను ఎక్స్ లో పంచుకున్న లోకేశ్ 
 
Nara Lokesh shares Chandrababu bail copy highlights

స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. బెయిల్ తీర్పు ప్రతులలోని ముఖ్యాంశాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. తీర్పు కాపీలోని కీలక అంశాలను హైలైట్ చేసి, వాటిని ఎక్స్ లో షేర్ చేశారు. 

ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ... స‌త్యం గెలిచిందని, అస‌త్యంపై యుద్ధం ఆరంభమైందని సమరశంఖం పూరించారు. మ‌న నాయ‌కుడు చంద్ర‌బాబు క‌డిగిన ముత్య‌మే అని అభివర్ణించారు. 

"స‌త్య‌మేవ‌జ‌య‌తే అని మ‌రోసారి నిరూపిత‌మైంది. ఆల‌స్య‌మైనా స‌త్య‌మే గెలిచింది. జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లోని వ్య‌వ‌స్థ‌ల మేనేజ్ మెంటుపై స‌త్యం గెలిచింది. చంద్ర‌బాబు గారి నీతి, నిజాయతీ, వ్య‌క్తిత్వం మ‌రోసారి స‌మున్న‌తంగా త‌ల ఎత్తుకుని నిల‌బ‌డింది. నేను త‌ప్పు చేయ‌ను, త‌ప్పు చేయ‌నివ్వ‌ను అని బాబు గారు ఎప్పుడూ చెప్పేదే మ‌రోసారి నిజ‌మైంది. 

చంద్ర‌బాబు గారిపై పెట్టిన‌ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కేసు... జ‌గ‌న్ కోసం జ‌గ‌న్ వ్య‌వ‌స్థ‌ల ద్వారా బ‌నాయించింద‌ని బెయిల్ మంజూరు చేసిన సంద‌ర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్య‌ల ద్వారా స్ప‌ష్ట‌మైంది. అరెస్టు చేసి 50 రోజుల‌కి పైగా జైలులో పెట్టి క‌నీసం ఒక్క ఆధార‌మూ ఇప్ప‌టికీ కోర్టు ముందు ఉంచ‌లేక‌పోయిన త‌ప్పుడు కుట్ర‌లు న్యాయం ముందు బ‌ద్ద‌ల‌య్యాయి. కేసులో ఆరోపించిన‌ట్టు షెల్ కంపెనీలు అనేవి లేవ‌ని తేలిపోయింది. 

తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు ప‌డ్డాయ‌నేది ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని, వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా బూట‌క‌మ‌ని స్ప‌ష్ట‌మైంది. చంద్రబాబుకి రూపాయి కూడా రాని స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రాజెక్టు కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చార‌నేది అవాస్త‌వ‌మ‌ని న్యాయ‌స్థానమే తేల్చేసింది. 

స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ స్కీంని స్కాంగా మార్చేసి చంద్ర‌బాబు గారి 45 ఏళ్ల క్లీన్ పొలిటిక‌ల్ ఇమేజ్ డ్యామేజ్ చేయ‌డానికి జ‌గ‌న్ అండ్ కో ప‌న్నాగ‌మ‌ని దేశ‌మంత‌టికీ తెలిసింది. హైకోర్టు వ్యాఖ్య‌ల‌తో క‌డిగిన ముత్యంలా మా బాబు గారు ఈ కుట్ర‌కేసుల‌న్నింటినీ జ‌యిస్తారు" అంటూ లోకేశ్ పేర్కొన్నారు.
20231120fr655b44a393897.jpg20231120fr655b44ad57c09.jpg20231120fr655b44be0e748.jpg20231120fr655b44cc4daf0.jpg20231120fr655b44d9d3172.jpg20231120fr655b44e63dcae.jpg20231120fr655b44f1df8df.jpg20231120fr655b44fe6e790.jpg20231120fr655b450ae80ac.jpg20231120fr655b4518750dd.jpg20231120fr655b4527b3e59.jpg

  • Thanks 1
  • Haha 1
Posted

Payyavula Keshav: నరకాసుర వధ ప్రారంభమైంది... అందుకే ఈ సంబరాలు: సజ్జల వ్యాఖ్యలకు పయ్యావుల కౌంటర్ 

20-11-2023 Mon 19:11 | Andhra
  • చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్
  • మీడియా సమావేశంలో విమర్శలు చేసిన సజ్జల
  • సజ్జల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్న పయ్యావుల
  • ఆధారాలు చూపించలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా
 
Payyavula counters Sajjala remarks on Chandrababu bail

చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ నేడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సీఐడీకి, వైసీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు తప్పుచేశాడని పదే పదే మీడియా ముందు చౌకబారు ఆరోపణలు చేసేవారికి చెంపపెట్టు అంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు బెయిల్ లభించిన అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. పయ్యావుల తన నివాసం నుంచి జూమ్ ద్వారా మాట్లాడారు.

చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికే సజ్జల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జల చెప్పినట్టు మేం దీపావళి సంబరాలు చేసుకోవడం లేదు... నరకాసుర వధ ప్రారంభం కాబోతుందని సంబరాలు చేసుకోబోతున్నాం అని స్పష్టం చేశారు. 

"ఆధారాలు మా వద్ద ఉన్నాయి... అవి కోర్టు ముందు పెట్టడం మరిచిపోయామని సజ్జల చెబుతాడా? సునీత రాసిన నోట్... దానికి సంబంధించిన ఫైల్ దొరకలేదని సజ్జల చెప్పడం పచ్చి అబద్ధం. ఫైల్ ప్రభుత్వం వద్దే ఉంది. కేవలం చేసిన తప్పుని కప్పిపుచ్చుకో వడానికే ఇప్పటికీ ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతమంది సాక్షుల్ని విచారించినా, ఇన్నివేల డాక్యుమెంట్స్ మీరు సేకరించినా, ప్రాథమికంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు నష్టం జరిగిందని చెప్పే ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు... నిర్ధారించలేకపోయారు అని కోర్టు చాలా స్పష్టంగా తీర్పులో అభిప్రాయపడింది” అని పయ్యావుల పేర్కొన్నారు.

 
సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం అవమానంతో తలదించుకోవాలి!
 
చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలపై ఏమాత్రం సిగ్గున్నా సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం అవమానంతో తలదించుకోవాలి. కళ్లకు ఏది కనిపిస్తే అది... ఊహకు ఏమి తోస్తే దాన్ని కేసులో పేర్కొంటారా? ఈ ప్రభుత్వం, సీఐడీ విభాగం స్కిల్ కేసులో తొలినుంచీ చెబుతున్న అన్ని అంశాలను న్యాయస్థానం ఆధారాలు లేనివిగా కొట్టిపారేసింది. 
 
ఇన్ కైండ్ గ్రాంట్ ప్రస్తావనే లేదు!
 
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ ఎవరో ఒకవ్యక్తికి ఇచ్చాము... దానిలో ఏవో తప్పులు కనిపించాయని జగన్ రెడ్డి సర్కార్ , సీఐడీ ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చాయి. దానిపైనా న్యాయస్థానం స్పందించింది. ‘Is Not Agreed Upon’, ‘Cannot be Relied Upon’ అనే భావం వచ్చేలా న్యాయస్థానం స్పష్టంగా అభిప్రాయపడింది. అలానే ఈ కేసులో ఎక్కడా డబ్బు ఇచ్చినట్టు, మనీ ట్రయల్ జరిగినట్టు కూడా ఆధారాలు లేవని చెప్పింది. తప్పు అని ఈ ప్రభుత్వం  చెప్పిన ‘ఇన్ కైండ్ గ్రాంట్’ ప్రస్తావన కూడా ఎక్కడా న్యాయస్థానం చేయలేదు. 
 
మేం మొదట్నించి చెబుతున్నదే నిజమైంది
 
ఒక విధానాన్ని ఏ రకంగా తప్పుగా చూపి... అనేక తప్పులు చేసే ప్రయత్నం చేశారో, అవి ఏవీ కూడా న్యాయస్థానాన్ని నమ్మించలేకపోయాయి. మేం తొలినుంచీ... ఎక్కడా ఎలాంటి తప్పు జరగలేదు... రూపాయి పక్కకు పోలేదు... ఎలాంటి ఆధారాల్లేవు... అక్రమంగా తప్పుడు కేసు పెట్టారు... అని చెప్పామో, అవే వాదనల్ని కోర్టు దాదాపుగా అంగీకరించింది. ఇప్పుడు కేవలం బెయిల్ పిటిషన్ పై మాత్రమే హైకోర్టు తీర్పు ఇచ్చింది.. ఫైనల్ జడ్జిమెంట్ కాదు. కానీ ఇప్పటికే న్యాయస్థానం చేసిన కామెంట్స్ చూస్తే... ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంగా తేల్చింది" అని పయ్యావుల వివరించారు.  

 

 

Posted
1 minute ago, psycopk said:

Chandrababu: స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు 

20-11-2023 Mon 14:56 | Andhra
  • టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట
  • సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనలను కొట్టిపారేసిన హైకోర్టు
  • చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన జస్టిస్ టి.మల్లికార్జునరావు
  • చంద్రబాబు ఈ నెల 29 నుంచి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని వెల్లడి
  • ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లనక్కర్లేదని స్పష్టీకరణ
 
AP High Court granted bail to Chandrababu in skill case

 

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. వాదనలు విన్న పిమ్మట ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. 

ఇటీవల చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వగా, ఆ బెయిల్ గడువు నాలుగు వారాలుగా న్యాయస్థానం పేర్కొంది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లనక్కర్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని వివరించింది. 

చంద్రబాబు నవంబరు 29 నుంచి రాజకీయ సభలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ నెల 30న చంద్రబాబు విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తన చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. 

కాగా, ఇవాళ తీర్పు సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఆధారాల్లేవని హైకోర్టు అభిప్రాయపడింది. వాదనలను పరిశీలించిన అనంతరం జస్టిస్ టి.మల్లికార్జునరావు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించారు.

happiness-cm-ys-jagan-mohan-reddy-garu.g

Posted
14 minutes ago, Bendapudi_english said:

happiness-cm-ys-jagan-mohan-reddy-garu.g

Inka pisukkodame jalagan..bad time start inatle..

Posted
5 minutes ago, ticket said:

Inka pisukkodame jalagan..bad time start inatle..

Low lo una TDP cadre ni own hands tho lepadu bidda anna 

  • Upvote 1
Posted

Mana courts ni ela manage cheyocho..clear example ee case.. Without proofs Ala remand ivvatame blunder then after 75 days proofs levu so bail istunnam ante...😇🤣

  • Upvote 1
Posted

Hamayya..!! 
 

Inka medical certificates and letters mida depend avalsina avasaram ledu…

  • Haha 2
Posted
10 minutes ago, rushmore said:

Criminals ki bail vasthe kuda celebrate chesukuntunnara?!!!

Kompatheesi bidda anna jail nunchi bayataki vachinapudu apatlo racha chesina party members gurinchi antunara endhi ani bidda anna feeling inside 

happiness-cm-ys-jagan-mohan-reddy-garu.g

Posted

Strong evidence lekundane 52 days jail lo pedathara, 4 weeks health bail ke intha hadavidi cheyala ani pichi kukkalla morigina jaffa batch ippudu kanumarugu aipoyare

Posted

Irrespective of Jaffa or Pulka.. system is comedy.. okaremo as per proofs no bail and inkoremo proofs levu so bail.. whether bail or not.. some should accountable to these judgements.

  • Haha 1
Posted
1 minute ago, Apple_Banana said:

Irrespective of Jaffa or Pulka.. system is comedy.. okaremo as per proofs no bail and inkoremo proofs levu so bail.. whether bail or not.. some should accountable to these judgements.

ee db lo most of them does not even understand that system is comedy

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...