psycopk Posted November 23, 2023 Report Posted November 23, 2023 Yuvagalam: 27 నుంచి ‘యువగళం’ పున:ప్రారంభం 23-11-2023 Thu 07:18 | Andhra రాజోలు నియోజకవర్గంలో నిలిచిపోయిన చోట నుంచి తిరిగి కొనసాగింపు డిసెంబర్ చివరిలో విశాఖపట్నంలో ముగియనున్న పాదయాత్ర ఎన్నికలు సమీపిస్తుండడంతో కుదించుకున్న టీడీపీ యువనేత స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో పాదయాత్రను తిరిగి కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా సెప్టెంబరు 9న పాదయాత్రకు బ్రేక్ ప్రకటించిన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అయితే ముందుగా నిర్దేశించుకున్నట్టుగా యువగళం యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగదు. డిసెంబర్ చివరిలో విశాఖపట్నంలోనే ముగియనుంది. దాదాపు రెండున్నర నెలలపాటు విరామం రావడం, మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ముగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. 27న పున:ప్రారంభమై రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకున్నాక అక్కడ పాదయాత్రను ముగించనున్నారు. ఇందుకు తగ్గట్టు రూట్ మ్యాప్‌ను పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేశ్ భావించారు. జనవరి 27న కుప్పంలో మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు అరెస్ట్ పర్యవసనాల నేపథ్యంలో దాదాపు రెండున్నర నెలలపాటు అంతరాయం ఏర్పడింది. తాత్కాలిక విరామం ప్రకటించే సమయానికి 208 రోజుల్లో 2,852.4 కిలోటర్లు పూర్తయ్యింది. 84 నియోజకవర్గాల గుండా ఈ యాత్ర కొనసాగింది. పెద్ద సంఖ్యలో బహిరంగ సభలతోపాటు యువత, మహిళలు, రైతులు, ముస్లింలు, వివిధ వర్గాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ లోకేశ్ యాత్రను కొనసాగించారు. ఇదిలావుండగా గతంలో చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర కూడా విశాఖపట్నంలోనే ముగిసిందని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర కూడా అక్కడే ముగియనుందని, ఈ మేరకు రూట్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు. Quote
psycopk Posted November 26, 2023 Author Report Posted November 26, 2023 Nara Lokesh: నారా లోకేశ్ మళ్లీ వస్తున్నాడు... రేపే యువగళం పునఃప్రారంభం 26-11-2023 Sun 14:48 | Andhra స్కిల్ కేసులో చంద్రబాబు విడుదల టీడీపీ కార్యకలాపాల్లో జోరు ఈ నెల 27న రాజోలు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభానికి సర్వం సిద్ధం అధినేత చంద్రబాబునాయుడు జైలు నుంచి విడుదల కావడంతో టీడీపీ తన కార్యకలాపాలు ముమ్మరం చేయాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రను మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టయిన తర్వాత యువగళం నిలిచిపోయింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో యువగళం పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రేపు (నవంబరు 27) కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర చేపట్టనున్నారు. తద్వారా మళ్లీ ప్రజల్లోకి రానున్నారు. యువగళం పాదయాత్ర మళ్లీ మొదలవుతోందన్న వార్తతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్ర జనవరి 27న కుప్పంలో ప్రారంభమైంది. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేశ్ సంకల్పించారు. ఇప్పటివరకు లోకేశ్ 209 రోజుల పాటు పాదయాత్ర చేశారు. 2852.4 కి.మీ. దూరం నడిచారు. 210వ రోజు (27-11-2023) యువగళం వివరాలు రాజోలు/పి.గన్నవరం/అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా) ఉదయం 10.19 – రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం. 11.20 – తాటిపాక సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం. మధ్యాహ్నం 12.35 – పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం, నగరంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో ముఖాముఖి. 2.00 – మామిడికుదురులో స్థానికులతో సమావేశం. 2.45 – పాశర్లపూడిలో భోజన విరామం. సాయంత్రం 4.00 – పాశర్లపూడి నుంచి పాదయాత్ర కొనసాగింపు. 4.30 – అప్పనపల్లి సెంటర్ లో స్థానికులతో సమావేశం. 5.30 – అమలాపురం నియోజకవర్గంలో ప్రవేశం, స్థానికులతో మాటామంతీ. 6.30 – బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి. 7.30 – పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటీ. 7.45 – పేరూరు శివారు విడిది కేంద్రంలో బస. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.