psycopk Posted November 23, 2023 Report Posted November 23, 2023 CM Jagan: సీఎం జగన్ కు నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు 23-11-2023 Thu 14:09 | Andhra ప్రభుత్వ పథకాల మాటున అవినీతి జరుగుతోందంటూ రఘురామ కృష్ణరాజు పిటిషన్ పిటిషన్ విచారణార్హం కాదన్న అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ప్రభుత్వం కొన్ని రికార్డులు ధ్వంసం చేసిందన్న రఘురామ న్యాయవాది సీఎం జగన్ సహా 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు ఏపీలో ప్రభుత్వ పథకాల మాటున భారీ అవినీతి చోటుచేసుకుంటోందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే, ఈ పిల్ లో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని, వ్యక్తిగత కారణాలతోనే ఈ పిటిషన్ వేశారంటూ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇది విచారణకు అర్హత ఉన్న పిటిషన్ కాదని కోర్టుకు విన్నవించారు. రఘురామ తరఫు న్యాయవాది స్పందిస్తూ, తమ క్లయింటు పిటిషన్ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని న్యాయస్థానానికి వివరించారు. వాదనలు విన్న పిమ్మట హైకోర్టు ధర్మాసనం సీఎం జగన్ సహా 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదుల జాబితాలో సీఎంతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా ఉన్నారు. తదుపరి విచారణను డిసెంబరు 14కి వాయిదా వేసింది. Quote
jaathiratnalu2 Posted November 23, 2023 Report Posted November 23, 2023 Anna Public Holidays lo kuda duty ekkava …. Quote
pizzaaddict Posted November 23, 2023 Report Posted November 23, 2023 Jagga ki istey correct ga Pani chestunattu , visionary ki isteytime waste antav Quote
ShruteSastry Posted November 23, 2023 Report Posted November 23, 2023 That's good job, At least this way all the GreeYellow guys will know the actual truths. Thanks RRR. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.