psycopk Posted November 28, 2023 Author Report Posted November 28, 2023 K Kavitha: బాండ్ పేపర్లతో కాంగ్రెస్ సీనియర్ నేతల కొత్త డ్రామా: ఎమ్మెల్సీ కవిత 28-11-2023 Tue 13:45 | Telangana 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలన్న కవిత ఉద్యోగాల విషయంలో నేను చెప్పింది తప్పయితే ఒక్క ఓటు కూడా అడగమని సవాల్ కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శలు బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరలేపారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీటిని ప్రజలు కనుక నమ్మితే కన్నీళ్లే మిగులుతాయని హెచ్చరించారు. మల్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటి నేతలు బాండ్ పేపర్ రాసివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలన్నారు. ఆ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, అందుకే బాండ్ పేపర్ రాసిచ్చే పరిస్థితికి వచ్చారన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇదేవిధంగా డ్రామాలు ఆడిందని ధ్వజమెత్తారు. 223 సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులు హామీలను అమలు చేస్తామంటూ బాండ్ పేపర్లు రాశారని, కానీ వాటిలో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ వచ్చాక రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయని, వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని, 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని, ఉద్యోగాలు పెరిగాయన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఎంతో అభివృద్ధి చేసిందని, మూడోసారి గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు కొత్త పాలసీని ప్రకటిస్తామన్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసి గత అయిదేళ్లలో 21 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాయని, కానీ తెలంగాణలో గత పదేళ్ల కాలంలో 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే ఒక్క ఓటు కూడా అడగమని సవాల్ చేశారు. తాను చెప్పిన దాంట్లో తప్పుంటే ప్రశ్నించవచ్చు అన్నారు. రేషన్ కార్డు సమస్యలు పరిష్కరించి అందరికీ రూ.5 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో మహిళలకు రూ.2 వేల పెన్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటూ ఇచ్చిన హామీల అమలు ఇంకా ప్రారంభించలేదన్నారు. యువనిధి కింద ఇస్తామన్న మొత్తాన్ని కూడా పంపిణీ చేయడం లేదని, బియ్యం పథకానికి తూట్లు పొడిచిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి బస్సుల సంఖ్యను భారీగా తగ్గించారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల నిరుద్యోగ సమావేశాలు ఆ పార్టీ రాజకీయ నిరుద్యోగతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. Quote
psycopk Posted November 28, 2023 Author Report Posted November 28, 2023 Priyanka Gandhi: కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా?: ప్రియాంకాగాంధీ 28-11-2023 Tue 13:11 | Telangana కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తున్నారన్న ప్రియాంక రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని వ్యాఖ్య బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు సహకరించుకుంటున్నాయని విమర్శ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తున్నారని... ఇలాంటి సీఎం మనకు అవరసమా? అని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ అన్నారు. బీఆర్ఎస్ వంటి అవినీతి ప్రభుత్వం మనకు అవసరమా? అని అడిగారు. ప్రాజెక్టుల నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యువతకు ఉద్యోగాలు రాలేదని... కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. ధరణి పోర్టల్ తో భూములను లాగేసుకున్నారని ఆరోపించారు. జహీరాబాద్ లో ప్రియాంక రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని ప్రియాంక అన్నారు. కేసీఆర్ కు బైబై చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని... తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని అన్నారు. బీఆర్ఎస్ అత్యంత ధనిక పార్టీ అని... అంత డబ్బు ఆ పార్టీకి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడి సంపాదించుకున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. అదానీ, అంబానీలకు బీజేపీ కొమ్ముకాస్తోందని విమర్శించారు. తెలంగాణలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయానని ప్రియాంక అన్నారు. ఉద్యోగ పరీక్షల పేపర్లను కూడా లీక్ చేసి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు ఎంతో బాధలో ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు పరస్పరం సహకరించుకుంటున్నాయని దుయ్యబట్టారు. Quote
psycopk Posted November 28, 2023 Author Report Posted November 28, 2023 Rahul Gandhi: హైదరాబాద్ లో డెలివరీ బాయ్స్, జీహెచ్ఎంసీ కార్మికుల కష్టాలు విన్న రాహుల్‌గాంధీ.. ఊడ్చిఊడ్చి చాతీలో నొప్పి వస్తోందన్న కార్మికులు 28-11-2023 Tue 13:10 | Telangana తెలంగాణ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్న రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లో పలు ప్రజాసంఘాలతో సమావేశాలు తమ సమస్యలు చెప్పుకుని బాధపడిన డెలివరీ బాయ్స్, జీహెచ్ఎంసీ కార్మికులు వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించిన కాంగ్రెస్ అగ్రనేత అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. హైదరాబాద్‌లో పలు ప్రజాసంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ కార్మికులు, ఆటోడ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి దినచర్య, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పింది శ్రద్ధగా విన్నారు. డెలివరీ బాయ్స్ మాట్లాడుతూ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ప్రమాదాలు జరిగినా, సరుకులు పోయినా డెలివరీ ఏజెన్సీలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాలు ఎదురైనప్పటికీ కుటుంబ పోషణ కోసం పని వదులుకోలేకపోతున్నామని చెప్పారు. ఏజెన్సీలు తమకు పెట్రోలు ధర కూడా చెల్లించడం లేదని, చివరి నిమిషంలో ఆర్డర్‌ను కస్టమర్ రద్దు చేసుకుంటే ఆ భారాన్ని కూడా తామే భరించాల్సి వస్తుందన్నారు. తమకు ఈఎస్ఐ, పీఎఫ్‌లాంటివి లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. తమకు ఆ రెండూ అందించాలని కోరారు. జీహెచ్ఎంసీ కార్మికులు మాట్లాడుతూ.. తమకు పింఛన్ లేదని, ఐదు గంటల్లోగా థంబ్స్ అప్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. నిరంతరాయంగా స్వీపింగ్ చేయడం వల్ల చాతీలో నొప్పి వస్తోందని చెప్పారు. వారి ఇబ్బందులను శ్రద్ధగా విన్న రాహుల్‌గాంధీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాజస్థాన్లో చేసినట్టుగానే సంక్షేమ చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. Quote
psycopk Posted November 28, 2023 Author Report Posted November 28, 2023 Time for harish to tweet.. 🤣 State Election Commission: ప్రచారం ముగిసింది... సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయవద్దు: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి 28-11-2023 Tue 19:19 | Telangana అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింటి మీడియాలో అవకాశం టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్ వర్క్‌లలో ప్రచారం చేయవద్దన్న ఈసీ ఓటరు స్లిప్పులపై పార్టీ గుర్తులు ఉండవద్దన్న వికాస్ రాజ్ ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో సోషల్ మీడియాలో కూడా ఎన్నికల ప్రచారం చేయవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశముందన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వాటిని ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్ వర్క్‌లలో ఎన్నికల ప్రచారం చేయవద్దన్నారు. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండవద్దని స్పష్టం చేశారు. ఇక పోలింగ్ ముగిసిన అర్ధగంట వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించవద్దని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న దాదాపు లక్షన్నర మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు వెల్లడించారు. 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో 7,571 ప్రాంతాల్లో బయట కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రంలోకి గుర్తింపు కార్డు తప్ప... సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకు వెళ్లరాదన్నారు. తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.737 కోట్ల విలువైన నగదు, బంగారం వంటివి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. Quote
psycopk Posted November 28, 2023 Author Report Posted November 28, 2023 KTR: రెండు నెలల్లో 30 బహిరంగ సభలు... 30 ప్రత్యేక ఇంటర్వ్యూల్లో పాల్గొన్న కేటీఆర్ 28-11-2023 Tue 20:36 | Telangana రోజుకు 15 నుంచి 18 గంటలు పార్టీ కోసం పని చేసిన మంత్రి కేటీఆర్ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ప్రతిరోజు వేలాదిమందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహణ బీఆర్ఎస్ గెలుపు కోసం మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోరుగా ప్రచారం నిర్వహించారు. రెండు నెలల్లో ముప్పై బహిరంగ సభలు, డెబ్బై రోడ్డు షోలలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్‌ను మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చి కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేద్దామని తన ప్రచారంలో పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పాల్గొన్నారు. ఆయన రోజుకు దాదాపు 15 గంటల నుంచి 18 గంటలు పార్టీ గెలుపు కోసం పని చేశారు. రెండు నెలల్లో 30 బహిరంగ సభలు, 70 రోడ్డు షోలతో పాటు 30కి పైగా ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. 150కి పైగా టెలికాన్ఫరెన్సులు నిర్వహించారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జేపీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, గోరెటి వెంకన్నలతో ప్రత్యేక ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ప్రతిరోజు వేలాదిమందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒకవైపు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నియమించిన ఇంఛార్జిలు, నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. Quote
psycopk Posted November 28, 2023 Author Report Posted November 28, 2023 State Election Commission: ఆన్‌లైన్‌లో ఓటర్ స్లిప్‌ను ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు..! 28-11-2023 Tue 22:29 | Telangana 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేసిన ఈసీ ఇంకా కొందరికి అందని స్లిప్పులు ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేసింది. ఈ నెల 25వ తేదీతో ఈ ప్రక్రియ ముగిసింది. అయితే వివిధ కారణాల వల్ల ఇంకా కొందరికి స్లిప్పులు అందలేదు. అలాంటి ఓటర్లు నేరుగా స్లిప్పులు పొందేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి ఓటరు వివరాలు నమోదు చేసి ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా? తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఓటర్ స్లిప్పును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ స్లిప్పులో పోలింగ్ బూత్ వివరాలు, పోలింగ్ తేదీ, ఓటర్ సీరియల్ నెంబర్ వంటివి ఉంటాయి. - మొదట నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. https://voters.eci.gov.in/ - సైట్ ఓపెన్ అయిన తర్వాత ఎలక్టోరల్ రోల్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. - అక్కడ క్లిక్ చేయగానే కొత్త వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. - ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా? లేదా? అని రెండు మార్గాల్లో చెక్ చేసుకోవచ్చు. - మొదటి మార్గంలో మీ పేరు, మీ తండ్రి లేదా భర్త పేరు, వయస్సు, పుట్టిన తేదీ, లింగం, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం ఎంటర్ చేయాలి. - రెండో మార్గంలో ముందుగా మీ ఓటర్ ఐడీ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయాలి. - మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా వెబ్ సైట్ మీకు మీ ఓటరు సమాచారాన్ని అందిస్తుంది. - ఓటర్ లిస్టులో కనుక పేరు లేకుంటే మీకు నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది. ఎస్సెమ్మెస్‌తో ఓటర్ లిస్టు చెక్ చేసుకోండిలా.... - ముందుగా మీ మొబైల్ మెస్సేజ్ సెక్షన్‌లో EPIC అని టైప్ చేయాలి. - స్పేస్ ఇచ్చి ఓటర్ ఐడీ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయాలి. - ఈ ఎస్సెమ్మెస్‌ను 9211728082 కు లేదంటే 1950 నెంబర్‌కు పంపించాలి. - ఆ తర్వాత మీ మొబైల్ స్క్రీన్‌పై మీ పోలింగ్ స్టేషన్ నెంబర్, మీ పేరు డిస్‌ప్లే అవుతాయి. - ఓటర్ లిస్టులో మీ పేరు లేకపోతే నో రికార్డ్ ఫౌండ్ అని సమాధానం వస్తుంది. Quote
psycopk Posted November 28, 2023 Author Report Posted November 28, 2023 DK Shivakumar: తెలంగాణలో కోడ్ ఉల్లంఘించామా... ఎక్కడ?: ఈసీ నోటీసులపై డీకే శివకుమార్ స్పందన 28-11-2023 Tue 20:03 | National తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక ప్రభుత్వ యాడ్ లు నోటీసులు జారీ చేసిన ఈసీ తమ ప్రకటనల్లో ఎక్కడా ఓట్లు అడగలేదన్న శివకుమార్ నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టీకరణ తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక సర్కారు ఇస్తున్న ప్రకటనలపై ఈసీ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. తాము ఎక్కడా కోడ్ ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. తమ ప్రకటనల్లో ఎక్కడా ఓట్లు అడగలేదని వివరించారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలనే ఆ ప్రకటనల్లో పేర్కొన్నామని వెల్లడించారు. తాము గెలిచాక హామీలు అమలు చేయడంలేదంటున్న విపక్షాలకు ఆ వాణిజ్య ప్రకటనల ద్వారా బదులిచ్చాం... ఇక మేం నిబంధనలు ఉల్లంఘించింది ఎక్కడ? అని డీకే శివకుమార్ ప్రశ్నించారు. Quote
psycopk Posted November 28, 2023 Author Report Posted November 28, 2023 State Election Commission: 3౦న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విశేషాలు...! 28-11-2023 Tue 22:14 | Telangana రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,799 119 నియోజకవర్గాల్లో బరిలో 2,290 మంది పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 30వ తేదీన జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రచారం ముగియడంతో ఎన్నికల సంఘం పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఖర్చు రూ.150 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి కొన్ని వివరాలు.... - రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,799. ఇందులో పురుష ఓటర్లు 1,62,98,418. మహిళా ఓటర్లు 1,63,01,705 మంది. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,676. సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. 18 - 19 ఏళ్ల వయస్సు కలిగిన ఓటర్లు దాదాపు పది లక్షల మంది ఉన్నారు. - 119 నియోజకవర్గాల్లో 2,290 మంది బరిలో ఉన్నారు. పురుషులు 2,068 కాగా మహిళలు 221 మంది. ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు. - పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 21,686 వీల్ చైర్లు సిద్ధం చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. బ్రెయిలీ లిపిలోను ఓటరు స్లిప్పులు.. నమూనా బ్యాలెట్లు ఉన్నాయి. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. - 120 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు, 597 పోలింగ్ కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. - పోలింగ్ కోసం 1,85,000 సిబ్బంది, 22వేల మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొంటున్నారు. - ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలను, రాష్ట్ర ప్రభుత్వం 50వేల మంది పోలీసులను కేటాయించింది. - తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 13 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. Quote
psycopk Posted November 28, 2023 Author Report Posted November 28, 2023 election commission: తెలంగాణలో ముగిసిన ప్రచారం... 144వ సెక్షన్ అమల్లోకి వచ్చిందన్న సీపీ సందీప్ శాండిల్య 28-11-2023 Tue 20:10 | Telangana 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అమలులో ఉంటుందని వెల్లడి కల్లు, మద్యం దుకాణాలు మూసివేయాలన్న సందీప్ శాండిల్య ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడదని స్పష్టీకరణ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో 144వ సెక్షన్ అమలులోకి వచ్చినట్లు సీపీ సందీప్ శాండిల్య చెప్పారు. నేటి సాయంత్రం నుంచి పోలింగ్ జరిగే 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని వెల్లడించారు. కల్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని తెలిపారు. ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడవద్దన్నారు. పోలింగ్ ముగిసేవరకు 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు మూడు కమిషనరేట్ల కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.