psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 Sarpanch Navya: కొల్లాపూర్‌లో బర్రెలక్క తరఫున జానకీపురం సర్పంచ్ నవ్య ప్రచారం 23-11-2023 Thu 21:13 | Telangana కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క తరఫున ప్రచారం కోసం బయలుదేరిన సర్పంచ్ నవ్య నిరుద్యోగుల తరఫున పోరాడేందుకు ముందుకు వచ్చిన శిరీషకు అందరూ మద్దతు తెలపాలని విజ్ఞప్తి శిరీషను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిద్దామని పిలుపు కొల్లాపూర్ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఆమెకు యువత, నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కర్నె శిరీషకు యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ఆర్థిక సాయం అందించిన సంగతి విదితమే. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన జానకీపురం సర్పంచ్ నవ్య నుంచి కూడా శిరీషకు మద్దతు లభించింది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య వేధింపుల ఆరోపణల నేపథ్యంలో నవ్య వెలుగులోకి వచ్చారు. స్టేషన్ ఘనపూర్ నుంచి ఏదో ఒక పార్టీ నుంచి టిక్కెట్ ఆశించిన నవ్యకు నిరాశ ఎదురైంది. దీంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం ఆమెకు వజ్రం గుర్తును కేటాయించింది. ఆమె జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో బిజీగా ఉన్న నవ్య కొల్లాపూర్‌లో శిరీషకు మద్దతివ్వడమే కాకుండా ప్రచారం చేస్తానని ప్రకటించి, ఆమె కొల్లాపూర్ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నిరుద్యోగుల తరఫున పోరాడేందుకు ముందుకు వచ్చిన శిరీషకు మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే ఆమె తరఫున ప్రచారం చేసేందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. శిరీషకు కేవలం నిరుద్యోగులు, యువత మాత్రమే కాదని, ఉద్యోగులు, మేధావులు, అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. శిరీషను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిద్దామని పిలుపునిచ్చారు. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 Mayawati: బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాయావతి తీవ్ర విమర్శలు 23-11-2023 Thu 19:15 | Telangana బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి సిర్పూర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి బీఎస్పీ అధికారంలోకి వస్తే భూపంపిణీ చేస్తామని హామీ బీఆర్ఎస్‌పై బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. ఆమె గురువారం పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమే అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధికారంలో ఉన్నపుడు భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేశామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూపంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో బీఎస్పీ గుర్తు ఏనుగుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 Harish Rao: జగ్గారెడ్డి గెలవడు కానీ... ముఖ్యమంత్రి అవుతాడట: హరీశ్ రావు సెటైర్లు 23-11-2023 Thu 17:38 | Telangana జానారెడ్డి పోటీ కూడా చేయడం లేదు... సీఎం అవుతానని చెబుతున్నాడన్న హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీలో పదిమంది ముఖ్యమంత్రులు ఉన్నారని ఎద్దేవా బీఆర్ఎస్ హయాంలో కర్ఫ్యూలేని తెలంగాణను చూస్తున్నామన్న మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకుంటున్నారని, కానీ ఆయన సంగారెడ్డి నుంచి గెలిచే పరిస్థితి లేదని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. మరో కాంగ్రెస్ సీనియర్ జనారెడ్డి పోటీ కూడా చేయడం లేదు కానీ సీఎం అవుతానని చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదిమంది ముఖ్యమంత్రులు ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సంగారెడ్డిలో ముస్లిం మైనార్టీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో కర్ఫ్యూ లేని తెలంగాణను చూస్తున్నామన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. షాదీ ముబారక్ వంటి పథకం అండగా నిలుస్తోందని చెప్పారు. సదాశివపేటలో కబరిస్తాన్ కోసం ఐదు ఎకరాలు ఇచ్చామని, మైనార్టీ విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో పదిహేడువేల మంది ఇమామ్‌లకు నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉన్నారని తెలిపారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చిందని, నర్సింగ్ కాలేజీ వచ్చిందని తెలిపారు. మళ్లీ గెలిచిన తర్వాత రూ.2 కోట్లతో సంగారెడ్డి, సదాశివపేటలలో మైనార్టీలకు షాదీఖానా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 KTR: కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చాక రియాల్టీ రంగం 28 శాతం పడిపోయింది.. తెలంగాణలో గెలిస్తే ఢమాల్: కేటీఆర్ 23-11-2023 Thu 17:27 | Telangana టీవీ9 నిర్వహించిన మెగా కాన్‌క్లేవ్‌లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో రియాల్టీ రంగం పడిపోతుందని వ్యాఖ్య తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అని తేల్చి చెప్పిన కేటీఆర్ బీఆర్ఎస్‌కు 70 నుంచి 82 సీట్లు వస్తాయని జోస్యం పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీవీ9 నిర్వహించిన మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే తమ ప్రధాన ప్రత్యర్థి అన్నారు. అయితే, చివరకు గెలిచేది మాత్రం బీఆర్‌ఎస్సేనని ధీమా వ్యక్తం చేశారు. తమకు 70 నుంచి 82 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తెలంగాణ సమాజం బీఆర్‌ఎస్‌ను కోరుకుంటోందని.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి దక్షిణాదిన తొలి హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగంపై మాట్లాడారు. పొరపాటున తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రియాల్టీ రంగం ఢమాల్ అవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ వాళ్లు ప్రతి ఆరునెలలకో ముఖ్యమంత్రిని మారుస్తుంటారని, అలాంటి పరిస్థితుల్లో స్థిరమైన పాలన ఎలా ఇవ్వగలరు? అందుకే రియల్ ఎస్టేట్ పడిపోతుందన్నారు. అదే సమయంలో పాలనాపరమైన నిర్ణయాలను కూడా త్వరితగతిన తీసుకోలేరని చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బెంగళూరులో రియాల్టీ రంగం 28 శాతం మేర పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లో శరవేగంగా పెరుగుతోందన్నారు. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 Prakash Goud: చెప్పుతో కొడతాం... వెళ్లిపోండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం 23-11-2023 Thu 16:56 | Telangana రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై మహిళల ఆగ్రహం తమ కాలనీలో సమస్యలు తీర్చకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని నిలదీత మహిళల నిరసనతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్‌కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాజేంద్రనగర్‌కు వెళ్లిన ఆయనను కొంతమంది మహిళలు అడ్డుకున్నారు. తమ కాలనీలోని సమస్యలు తీర్చలేదని, అలాంటప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని నిలదీశారు. సమస్యలు తీర్చకుండా ఇక్కడకు వచ్చి ప్రచారం చేస్తే చెప్పుతో కొడతాం.... వెళ్లిపోండి అని మండిపడ్డారు. మహిళల నిరసనతో షాకైన ప్రకాశ్ గౌడ్ ప్రచారం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 JP Nadda: తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారు: బీజేపీ అధినేత జేపీ నడ్డా 23-11-2023 Thu 15:46 | Telangana కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని విమర్శలు ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందని మండిపాటు దళితబంధులో ప్రజాప్రతినిధులు 30 శాతం కమీషన్ తీసుకున్నారన్న నడ్డా తెలంగాణ ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్‌లో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపించారు. ఈ పదేళ్లలో ఆయన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని విమర్శించారు. దళితబంధులో ప్రజాప్రతినిధులు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి ఎగబాకిందన్నారు. గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 80 కోట్లమందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామన్నారు. కుటుంబ పాలన నుంచి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించామన్నారు. అదే మాదిరి ఇక్కడ కూడా కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 Vijayashanti: ఆ రెండు పార్టీలు తోడు దొంగలు: బీఆర్ఎస్, బీజేపీలపై విజయశాంతి విమర్శలు 23-11-2023 Thu 15:34 | Telangana అందరికీ చుక్కలు చూపించే వరంగల్ వాసులను కేసీఆర్ మోసం చేశారని ధ్వజం ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడ్డారని విమర్శలు కేసీఆర్‌కు రాజకీయ పాఠాలు నేర్పించాల్సిన అవసరం ఉందన్న విజయశాంతి మద్యం కేసులో వేరేవారిని అరెస్ట్ చేశారు కానీ... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయలేదని.. కేసీఆర్ కుటుంబం బరితెగించిందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. గురువారం వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ నియోజకవర్గం అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి తరఫున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అందరికీ చుక్కలు చూపించే వరంగల్ వాసులను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. వరంగల్‌వాసులు కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను గద్దె దించాల్సిందే అన్నారు. ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి వచ్చిందని, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు... కేసీఆర్‌కు డబ్బే ముఖ్యమని మండిపడ్డారు. భూ, మైనింగ్ మాఫియాను కేసీఆర్ ప్రోత్సహించారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో అవినీతి చేశారన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌లో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు రాజకీయ పాఠాలు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టుల పేరిట, పేపర్ లీకేజీల పేరిట వేలాది కోట్లు తిన్నారని ఆరోపించారు. బీజేపీ కూడా కేసీఆర్‌ను గెలిపించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ పోరాటాల గడ్డ అని, ఇక్కడి నుంచి మార్పు చూడాలన్నారు. కేసీఆర్ దోపిడీ, అరాచకాలను మార్చే శక్తి ప్రజల వద్ద ఉందన్నారు. సంక్షేమం అంటేనే కాంగ్రెస్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ వాళ్లు సామ దాన భేద, దండోపాయాలను ఉపయోగించి బీఆర్ఎస్‌ను అధికారంలోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అవినీతి కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా బీజేపీ కాపాడుతోందన్నారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగలు అని మండిపడ్డారు. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 KCR: తెలంగాణ సంపదను మేం పెంచితే, కాంగ్రెస్ దానిని తుంచే ప్రయత్నం చేస్తోంది: మహేశ్వరం సభలో కేసీఆర్ 23-11-2023 Thu 14:24 | Telangana మీరు వంట చేసి పెట్టండి.. మేం వడ్డిస్తామన్న చందంగా కాంగ్రెస్ తీరు ఉందన్న కేసీఆర్ మీ ఓటు అయిదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని వ్యాఖ్య ఫాక్స్ కాన్ పరిశ్రమతో లక్షమందికి ఉద్యోగాలు వస్తాయన్న కేసీఆర్ తెలంగాణ సంపదను మేం పెంచితే కాంగ్రెస్ తుంచే ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తీరు ఎలా ఉందంటే... మీరు వంట చేసి పెట్టండి... మేం వడ్డిస్తామన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించి రాష్ట్రంలో సంపద పెరిగేలా చూశామని, కానీ దానిని కాంగ్రెస్ తుంచే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. మేం మూడోసారి అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచుతామన్నారు. ఓటు అనే అస్త్రాన్ని జాగ్రత్తగా ఆలోచించి వేయాలని కోరారు. మీ ఓటు అయిదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. కందుకూరులో మెడికల్ కాలేజీ రావడానికి, నాలాల అభివృద్ధి జరగడానికి సబితా ఇంద్రారెడ్డి కృషే కారణమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ త్వరలో పైప్ లైన్ రానుందని, అది అందుబాటులోకి వస్తే మహేశ్వరం ప్రజలకు తాగునీటి సమస్య ఉండదని చెప్పారు. ఫాక్స్ కాన్ పరిశ్రమతో లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. రైతుబంధు పథకాన్ని పుట్టించిదే కేసీఆర్ అని, కానీ ఈ పథకాన్ని కాంగ్రెస్ నేతలు మాత్రం దుబారా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిని తీసేసి కాంగ్రెస్ పార్టీ భూమాత తీసుకువస్తే అది భూమేత అవుతుందని ఎద్దేవా చేశారు. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 Barrelakka: తగ్గేదే లే.. బర్రెలక్క మ్యానిఫెస్టో చూశారా? 23-11-2023 Thu 12:02 | Telangana తెలంగాణ ఎన్నికల్లో సంచలనంగా మారిన బర్రెలక్క నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రశ్నిస్తానని హామీ ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదలయ్యేలా చూస్తానన్న శిరీష నిరుద్యోగ భృతి కోసం పోరాడతానని ప్రతిన తెలంగాణ ఎన్నికల్లో ఏదైనా సెన్షేషన్ ఉందంటే అది బర్రెలక్క పోటీ మాత్రమే. చదువుకున్నప్పటికీ ఉద్యోగం రాక, బర్రెలు కాసుకుని తన అనుభవాలను రీల్స్ రూపంలో షేర్ చేస్తూ ఫేమస్ అయిన శిరీష అలియాస్ బర్రెలక్క కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో ఆమె పేరు మరోమారు తెలంగాణలో మార్మోగిపోయింది. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆమె నిర్ణయాన్ని కొనియాడిన ఎంతోమంది ఆమెకు మద్దతుగా తరలివస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. సొంత ఖర్చులతో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతూ జనాల్లోకి తీసుకెళ్తున్నారు. కొల్లాపూర్‌లో ఇప్పుడామె పేరు మార్మోగిపోతోంది. బర్రెలక్క తాజాగా తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని, ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తానని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అలాగే, పేదల ఇళ్ల నిర్మాణానికి కృషి చేయడంతోపాటు నిరుద్యోగులందరికీ భృతి ఇప్పిస్తానని, ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు, ఉచిత శిక్షణ, ఉన్నత చదువుల కోసం కోచింగ్ ఉచితంగా ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని శిరీష తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 Abraham: బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అబ్రహం 24-11-2023 Fri 13:33 | Telangana అబ్రహంను పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి అబ్రహం బదులు విజేయుడికి బీఫామ్ ఇచ్చిన కేసీఆర్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అబ్రహం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్ పార్టీని వీడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అబ్రహంను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను తొలుత ఈసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆయనను మార్చి ఆ స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఇచ్చారు. దీంతో, తీవ్ర అసంతృప్తికి గురైన అబ్రహం పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు. 2009లో కాంగ్రెస్ తరఫున ఆలంపూర్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి ప్రసన్న కుమార్ పై అబ్రహం గెలిచారు. 2014లో టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 CPI Ramakrishna: చంద్రబాబు అక్రమ అరెస్ట్ మీద కేటీఆర్ వ్యాఖ్యలపై రామకృష్ణ స్పందన 24-11-2023 Fri 16:49 | Telangana చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని విమర్శలు కేసీఆర్ అతితెలివితో... మదంతో వ్వహరిస్తున్నారని ఆగ్రహం హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపు ముఖ్యమంత్రి కేసీఆర్ అతితెలివితో... మదంతో వ్యవహరిస్తున్నారని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ పోరాటాల గడ్డ అని, ప్రజలు కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌గా మారింది కానీ బుద్ది మాత్రం మారలేదన్నారు. నరేంద్రమోదీ, కేసీఆర్, జగన్ ముగ్గురూ ఒక్కటే అన్నారు. ఈ ముగ్గురూ అహంకారంతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో కళ్లు తెరుస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ కూడా పోటీ చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 CPI Narayana: కేసీఆర్ కు సవాల్ విసిరిన సీపీఐ నారాయణ.. జగన్ పై తీవ్ర విమర్శలు! 24-11-2023 Fri 11:09 | Both States లిక్కర్ స్కామ్ లో కవితను తప్పించేందుకు బీజేపీతో కేసీఆర్ చేతులు కలిపారన్న నారాయణ కేసీఆర్ కు దమ్ముంటే ఓయూలో ఓట్లు అడగాలని సవాల్ కేసుల కోసం మోదీ కాళ్ల ముందు జగన్ తలవంచారని విమర్శ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన కూతురు కవితను లిక్కర్ స్కామ్ నుంచి కాపాడుకోవడానికి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. స్కామ్ నుంచి కవితను తప్పించడానికి బీజేపీకి దాసోహమయ్యారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితను అరెస్ట్ చేయలేదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనని చెప్పారు. కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ అయిన ఉస్మానియా యూనివర్శిటీకి వచ్చి ప్రచారం చేయాలని, ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో ఒకే దెబ్బకు మూడు పిట్టలు పడిపోతాయని... బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఓడిపోవడం ఖాయమని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఖమ్మం సీపీఐ కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. తన కేసుల కోసం ప్రధాని మోదీ కాళ్ల ముందు ఆయన తల వంచారని అన్నారు. కేంద్రం కాళ్లపై పడటం వల్లే పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని చెప్పారు. మన దేశంలో ఇంతకాలం బెయిల్ పై ఉన్న ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనని అన్నారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. Quote
jaathiratnalu2 Posted November 24, 2023 Report Posted November 24, 2023 TDP established on basis on Atma Gouravam slogan against congress party Ippudu ila congress party to merge aye vallaki support chese articles vestunnaru .. asalu emaina Rosham,siggu vunda mokam mida..asalu ala ela support chestaru .. siggu , rosham , abhimanam emi vundada villlai @hyperbole Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 2 minutes ago, jaathiratnalu2 said: TDP established on basis on Atma Gouravam slogan against congress party Ippudu ila congress party to merge aye vallaki support chese articles vestunnaru .. asalu emaina Rosham,siggu vunda mokam mida..asalu ala ela support chestaru .. siggu , rosham , abhimanam emi vundada villlai @hyperbole Oh nenu vesina posts lo anta matter unda… paytms bagane hurt aaiyaru ga aaite Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 Pawan Kalyan: పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానం రద్దు 24-11-2023 Fri 16:56 | Andhra బేగంపేట విమానాశ్రయంలో ఆగిపోయిన విమానం విమానంలో సాంకేతిక లోపం ఉందని సీఐడీ అధికారి ఫోన్ చేశారంటూ జనసేన ఆగ్రహం ఎన్ని కుట్రలు చేసినా పవన్ విశాఖకు వస్తాడని వ్యాఖ్య జనేసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు వెళ్లాల్సిన ప్రత్యేక విమానం రద్దయింది. బేగంపేట విమానాశ్రయంలోనే విమానం ఆగిపోయింది. వైసీపీ ప్రభుత్వమే కుట్ర పూరితంగా పవన్ పర్యటనను అడ్డుకుందని జనసేన ఆరోపించింది. పవన్ రావాల్సిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం ఉందంటూ ఓ సీఐడీ అధికారి చెప్పడంతో ఎయిర్ పోర్టు అధికారులు విమానాన్ని ఆపేసినట్టు తమకు సమాచారం వచ్చిందని జనసేన నేత కేవీఎస్ఎస్ రాజు మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా పవన్ విశాఖకు రావడం ఖాయమని అన్నారు. ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద బాధితులకు పవన్ నష్టపరిహారం అందిస్తారని చెప్పారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.