psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 😂 kanesam body ni gandhi bhavan lo petataniki kuda opukoledu… Priyanka Gandhi: పీవీ నరసింహారావు అంటే సోనియా గాంధీకి ఎంతో గౌరవం: హుస్నాబాద్ సభలో ప్రియాంకగాంధీ 24-11-2023 Fri 17:05 | Telangana రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు తమ కుటుంబానికి అండగా నిలిచారన్న ప్రియాంక కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూరులో అభివృద్ధి జరిగిందా? అని నిలదీత బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఒక్కటేనని విమర్శ రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు పీవీ నరసింహారావు తమ కుటుంబానికి అండగా నిలిచారని, అలాంటి వ్యక్తి అంటే సోనియా గాంధీకి ఎంతో గౌరవమని ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ గడ్డ నుంచి వచ్చిన పీవీ అంటే తమకు గౌరవమని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరన్నారు. హుస్నాబాద్ నియోకవర్గంలోని ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేశారా? ప్రాజెక్టు భూనిర్వాసితులకు పరిహారం వచ్చిందా? కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూరులో అభివృద్ధి జరిగిందా? అని నిలదీశారు. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పగలరా? ఇలాంటి ప్రభుత్వం మీకు మరో అయిదేళ్లు కావాలా అని ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అయ్యాడని, తన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చాడని విమర్శించారు. కానీ ప్రజలు మాత్రం తమ పిల్లల్ని కష్టపడి చదివించుకున్నా పేపర్ లీకేజీల కారణంగా ఆ చదువులు వృథా అవుతాన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి కుటుంబం కోసమే పని చేస్తోందని ధ్వజమెత్తారు. దళితులు, గిరిజనుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయలేదన్నారు. పెద్ద ప్రాజెక్టులలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారన్నారు. రైతు రుణమాఫీని ఈ ప్రభుత్వాలు మరుగున పడేశాయన్నారు. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిత్యం రాహుల్ గాంధీని విమర్శిస్తుంటారని, కానీ ప్రధాని మోదీ గురించి ఒక్క మాట మాట్లాడరని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఒకటేనన్నారు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకదానికొకటి అండగా ఉంటాయన్నారు. ఇతర రాష్ట్రాలలో పదుల సంఖ్యలో పోటీ చేసే మజ్లిస్ పార్టీ తెలంగాణలో మాత్రం పది స్థానాల్లో కూడా పోటీ చేయడం లేదని విమర్శించారు. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. మోదీ పాలనలో ధనికులు తప్ప పేదలకు మేలు జరగడం లేదన్నారు. 1 Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం కోసం కోమటిరెడ్డి మంత్రి పదవి వదులుకున్నారు: రేవంత్ రెడ్డి 24-11-2023 Fri 17:31 | Telangana తెలంగాణ ఉద్యమం సమయంలో కోమటిరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను మళ్లీ అసెంబ్లీ గేటు తాకనీయవద్దని విజ్ఞప్తి కేసీఆర్ ఎలక్షన్లు.. కలెక్షన్ల కోసమే ఉద్యమం సమయంలో రాజీనామా చేశారని ఆరోపణ తెలంగాణ రాష్ట్రం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి వదులుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నకిరేకల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను మళ్లీ అసెంబ్లీ గేటు తాకనీయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ నల్గొండ... రజాకార్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది నల్గొండ వీరులే అన్నారు. సమైక్య రాష్ట్రంలో నాటి తెలంగాణ ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పదవిని పూచికపుల్లలా విసిరేసినా అని కేసీఆర్ పదేపదే చెబుతారని, కానీ ఆ సన్నాసులు రాజీనామా పేరుతో ఎలక్షన్లు, కలెక్షన్ల పేరుతో ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మంత్రి పదవిని వదులుకొని... తెలంగాణ వచ్చే వరకు దానిని తీసుకోనని చెప్పారన్నారు. కార్యకర్తలు జెండా మోసి, కోమటిరెడ్డి సోదరులు కష్టపడి నకిరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్యను రెండుసార్లు గెలిపిస్తే నమ్ముకున్న వారిని నట్టేట ముంచి పార్టీ ఫిరాయించారన్నారు. దొరగారి గేటు వద్ద కాపలా కుక్కలా మారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని ఆరోపించారు. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 YS Sharmila: అలాంటి ప్రజెంటేషన్లు ఇచ్చుకోవడానికి సిగ్గుండాలి: కేటీఆర్‌పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు 24-11-2023 Fri 17:52 | Telangana ఒక్కో నెత్తిమీద లక్షల అప్పులు పెట్టి ఆదాయం పెరిగిందని చెప్పడం సిగ్గుచేటు అన్న షర్మిల పదేళ్లుగా అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన సాగిందని విమర్శ ఆఫ్ఘనిస్తాన్‌ను తలపించిన తాలిబన్ల పాలన అని ఆగ్రహం నిరుద్యోగులను ఉద్దరించినట్లు సవాళ్లు విసురుతుంటే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదని ఎద్దేవా తెలంగాణలో పదేళ్లుగా అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన సాగిందని... అంతేకానీ కేటీఆర్ చెప్పినట్లు సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి కాదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె ట్విట్టర్ వేదికగా శుక్రవారం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆఫ్ఘనిస్తాన్‌ను తలపించిన తాలిబన్ల పాలన ఇది అని దుయ్యబట్టారు. ఈ పదేళ్ల కాలంలో ఐదు లక్షల కోట్లు అప్పులు చేసి, ఒక్కో నెత్తిమీద రెండు లక్షల రూపాయల అప్పు మోపి తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని ప్రజెంటేషన్లు ఇచ్చుకోవడానికి సిగ్గు ఉండాలని తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంటే.. నిరుద్యోగులు 50 లక్షల మంది ఎందుకు ఉన్నారు? ఉద్యోగాలిస్తే వందలాది మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? పదేళ్లలో పట్టుమని 65 వేల ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని మీరు.. ఇంటికో ఉద్యోగం ఇచ్చినట్లు, నిరుద్యోగుల్ని ఉద్ధరించినట్లు బహిరంగ చర్చకు సవాళ్లు విసురుతుంటే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. మీ దరిద్రపు పాలనలో టీఎస్పీఎస్సీ లీకుల బాగోతం దేశమంతా తెలిసిందే అన్నారు. ఇంకా నిరుద్యోగులు మిమ్మల్ని నమ్ముతారని కల్లబొల్లి కబుర్లు చెప్పడం మీ అవివేకానికి నిదర్శనం అన్నారు. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 KTR: రాయదుర్గం నుంచి బేగంపేట వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్... ఇదిగో వీడియో 24-11-2023 Fri 18:08 | Telangana ఇరవై నిమిషాల పాటు ప్రయాణికులతో ముచ్చటించిన కేటీఆర్ కేటీఆర్‌తో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు వందలాదిమంది ఉత్సాహం ఈ నెల 30న ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలను సూచన తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మెట్రోలో ప్రయాణించారు. ఈ 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాయకులు ప్రచారం కోసం అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎల్బీ నగర్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ కూడా మెట్రోలో ప్రయాణికులను కలిసి మాట్లాడారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ కూడా మెట్రోలో ప్రయాణించారు. హెచ్ఐసీసీలో రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సమావేశంలో హైదరాబాద్ భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరించిన అనంతరం రాయదుర్గం నుంచి బేగంపేట్ వరకు ప్రయాణించారు. దాదాపు ఇరవై నిమిషాలు ప్రయాణికులతో ముచ్చటించారు. కేటీఆర్‌తో మాట్లాడేందుకు వందలాదిమంది ప్రయాణికులు ఉత్సాహం చూపించారు. కేటీఆర్ తన 20 నిమిషాల ప్రయాణంలో పలువురితో ముచ్చటించారు. ఇంటర్మీడియట్ చదువుతూ వైద్య విద్య కోసం శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినితోపాటు, ఇప్పటికే ఎంబిబిఎస్ కోర్స్ చదువుతున్న మరో విద్యార్థి మంత్రి కేటీఆర్ దగ్గరికి వచ్చి మాట్లాడారు. జర్మనీలో బయోటెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న మరో ప్రయాణికుడు కేటీఆర్ వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద మెట్రోలో ఎక్కిన పలువురు విద్యార్థినిలు మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థినుల బృందం హైదరాబాద్ నగరంలో మెడికల్ కోడింగ్ శిక్షణను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. పలువురు మహిళలు, వృద్ధులతో ముచ్చటించారు. ఈ నెల 30వ తేదీన ఎన్నికలు ఉన్న విషయం మీకు తెలుసా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మీలాంటి చదువుకున్న యువకులు ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లు కచ్చితంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని, ఒక గంట సమయాన్ని ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు కేటాయిస్తే మరో ఐదు సంవత్సరాలపాటు మంచి నాయకులను ఎన్నుకోవచ్చని సూచించారు. 30వ తేదీన కచ్చితంగా ఓటు ప్రక్రియలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి బేగంపేట్‌లో దిగే వరకు వందలాదిమంది ఆయనను ఆప్యాయంగా పలకరించారు... సెల్ఫీలు తీసుకున్నారు. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 Ipudu power lo lera ra pushpams Raj Nath Singh: బీజేపీ అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తాం: రాజ్‌నాథ్ సింగ్ 24-11-2023 Fri 18:33 | Telangana మేడ్చల్ నియోజకవర్గం కీసరలో రాజ్ నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న కేంద్రమంత్రి కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపణ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని, తాము అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని విచారించి జైలుకు పంపిస్తామని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం ఆయన మేడ్చల్ నియోజకవర్గం కీసరలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధికారంలోకి రాకముందు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పటికీ గుజరాత్ దేశానికి మోడల్‌గా నిలిచిందని, కానీ కోటి ఆశలతో తెచ్చుకున్న తెలంగాణను అప్పులపాలు చేశారని మండిపడ్డారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ఇక్కడ ఎందుకు అభివృద్ధి చేయలేదు? అని ప్రశ్నించారు. వాజ్‌పేయి నుంచి నరేంద్రమోదీ వరకు బీజేపీ నాయకులపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవన్నారు. కానీ కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమన్నారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ముఖ్యమంత్రి పదవి హామీని పక్కన పెట్టారని, దళితబంధు హామీని కూడా నెరవేర్చలేదన్నారు. 1 Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 Etela Rajender: భైంసాలో కాషాయ జెండా ఎగరడం ఖాయం: ఈటల రాజేందర్ 24-11-2023 Fri 19:08 | Telangana రాష్ట్రంలో కేసీఆర్ పాలన.. ముథోల్ లో విఠల్ రెడ్డి పాలన నిజాం సర్కార్‌ను తలపిస్తోందని విమర్శ ప్రతి వంది మందికి ఒక బెల్ట్ షాపును ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని ఎద్దేవా నమ్మకం అంటే మోదీ... అబద్దాలకు కేరాఫ్ కేసీఆర్ అని చురకలు భైంసాలో ఈసారి కాషాయజెండా ఎగరడం ఖాయమని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ముథోల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో కేసీఆర్ పాలన, ముథోల్‌లో విఠల్ రెడ్డి పాలన.. నిజాం సర్కార్ పాలనను తలపిస్తోందన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయని విమర్శించారు. కేసీఆర్ ప్రతి గ్రామంలో బెల్టు షాపులు పెంచి... ఇందులో మాత్రం నెంబర్ వన్ స్థానంలో నిలిపారని ఎద్దేవా చేశారు. ప్రతి వందమందికి ఒక బెల్ట్ షాప్ ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రిదే అని మండిపడ్డారు. మనందరికీ మద్య అలవాటు చేసి.. ఓ వైపు సంక్షేమానికి రూ.25వేల కోట్లు ఖర్చు చేస్తూ... మరోవైపు మద్యం ద్వారా రూ.45వేల కోట్లు లాక్కుంటున్నారని ఆరోపించారు. నమ్మకం అంటే మోదీ... అబద్దాలకు కేరాఫ్ కేసీఆర్ అని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే వరి మద్దతు ధర రూ.3100కు పెంచుతామన్నారు. ఒక ఇంట్లో ఇద్దరు అర్హులు ఉంటే పెన్షన్ వారిద్దరికీ అందిస్తామన్నారు. వ్యవసాయ పని ముట్లపై సబ్సిడీలు అందిస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు పటేల్‌కు ఓటు వేసి గెలిపిస్తే తనకు ఓటు వేసినట్లే అన్నారు. రామారావు పటేల్ ప్రకటించిన మేనిఫెస్టోను దగ్గర ఉండి అమలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ధర్మపురి పర్యటన రద్దు 24-11-2023 Fri 19:32 | Telangana ఉదయం వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ప్రయాణం రద్దు రోడ్డు మార్గంలో పాలకుర్తికి వెళ్లిన ప్రియాంక గాంధీ ఆలస్యం కావడంతో ధర్మపురి సభకు హాజరు కాలేకపోయిన కాంగ్రెస్ నాయకురాలు ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ధర్మపురి పర్యటన రద్దయింది. వర్షం కారణంగా హెలికాప్టర్ ప్రయాణం రద్దయి... రోడ్డు మార్గాన ప్రయాణిస్తూ సభలలో పాల్గొన్నారు. దీంతో ధర్మపురి సభకు హాజరు కాలేకపోయారు. ఆమె ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్ నుంచి పాలకుర్తికి హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో పాలకుర్తి చేరుకున్నారు. కొత్తగూడెం, హుస్నాబాద్ సభలలో కూడా పాల్గొన్నారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె హుస్నాబాద్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. Quote
lokesh_rjy Posted November 24, 2023 Report Posted November 24, 2023 Dec 9th ratentha Reddy ekkada pramana swekaram chestadu ? Twitter X? Facebook ? Or youtube ? Quote
jaathiratnalu2 Posted November 24, 2023 Report Posted November 24, 2023 3 hours ago, psycopk said: Oh nenu vesina posts lo anta matter unda… paytms bagane hurt aaiyaru ga aaite Bro FYI l’m not Paytm guys. But I can feel one thing atleast they are getting money . But they are not slaves or locking to anyone. like …. Quote
JaiBalayyaaa Posted November 24, 2023 Report Posted November 24, 2023 4 hours ago, psycopk said: Smriti Irani: కేసీఆర్ దగ్గర కారు మాత్రమే ఉంది.. స్టీరింగ్ వేరేవాళ్ల వద్ద ఉంది: స్మృతి ఇరానీ 23-11-2023 Thu 19:31 | Telangana రెండున్నరేళ్ల పాటు అర్హులైన పేదలకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నామన్న స్మృతి ఇరానీ కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఉంటే ఇలాంటివి ఇచ్చి ఉండేవి కావని వ్యాఖ్య బీజేపీ గెలిస్తే శుద్ధమైన మంచి నీరు, ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తామన్న స్మృతి ఇరానీ కరోనా నేపథ్యంలో మరో రెండున్నరేళ్ల పాటు అర్హులైన పేదలకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నామని, కానీ కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఉంటే ఇలాంటివి ఇచ్చి ఉండేవి కావని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఆమె గురువారం ఖైరతాబాద్‌లోని ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్ దగ్గర కేవలం కారు మాత్రమే ఉందని, స్టీరింగ్ మాత్రం వేరేవాళ్ల చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. దళితబంధులో అసలైన లబ్ధిదారుల కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే లబ్ధి పొందారని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో మంచి నీటి సమస్య ఉందని, బీజేపీ అధికారంలోకి వస్తే శుద్ధమైన నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారందరికీ ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు వేయించారని గుర్తు చేశారు. ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. Amit Shah daggare ga Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 babumohan: బీఆర్ఎస్ తండ్రీకొడుకుల్ని విడదీసింది... నా కొడుక్కి బీఆర్ఎస్ కండువా కప్పారు: బాబుమోహన్ కంటతడి 24-11-2023 Fri 20:50 | Telangana ఆందోల్ నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా భావోద్వేగానికి గురైన బాబుమోహన్ తమ కుటుంబాన్ని విడదీసి హరీశ్ రావు తన కొడుకుని పార్టీలో చేర్చుకున్నారని ఆవేదన ఐదు రోజుల క్రితం బీఆర్ఎస్‌లో చేరిన ఉదయ్ బాబుమోహన్ ఆందోల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న బాబుమోహన్ శుక్రవారం కంటతడి పెట్టారు. ఈ నెల 30న పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా ప్రచారం నిర్వహిస్తోన్న క్రమంలో ఒక్కసారిగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికలకు కొన్నిరోజుల ముందు తన కొడుకును అధికార బీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకోవడంతో ఆయన కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ తండ్రీకొడుకులను విడదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్ రావు తన కుటుంబాన్ని విడదీసి... తన కొడుకు మెడలో బీఆర్ఎస్ కండువా కప్పి ఆనందిస్తున్నారని విమర్శించారు. కాగా బాబుమోహన్ తనయుడు ఉదయ్ బాబుమోహన్ ఐదు రోజుల క్రితం హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 1 Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 State Election Commission: రైతుబంధు సాయం పంపిణీకి అనుమతించిన ఎన్నికల సంఘం 24-11-2023 Fri 22:06 | Telangana అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ రైతుబంధు సాయానికి అనుమతివ్వాలని ఈసీని కోరిన ప్రభుత్వం పథకం పాతది కావడంతో పంపిణీకీ అనుమతించిన ఎన్నికల సంఘం తెలంగాణ రైతులకు శుభవార్త... రైతుబంధు సాయం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుబంధు సాయానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఈసీకి విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇది పాత పథకం కావడంతో రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇచ్చారు. దీంతో త్వరలో రైతుల ఖాతాల్లో రైతుబంధు మొత్తం జమ కానుంది. ఈ నెల 28వ తేదీ లోపు మాత్రమే రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 CPI Narayana: కూతురు కవిత అరెస్ట్ కాకుండా కేసీఆర్... అమిత్ షా కాళ్లు పట్టుకున్నాడు: సీపీఐ నారాయణ 24-11-2023 Fri 20:04 | Telangana కేసీఆర్, కేటీఆర్‌లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆగ్రహం వనమా వెంకటేశ్వరరావు డైపర్ లేనిదే బయటకు రాడని ఎద్దేవా జలగం వెంకటరావు డబ్బులు పెట్టి బీ ఫామ్, ఎన్నికల గుర్తు కొన్నాడని విమర్శలు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కేసులో కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాకుండా ఉండేందుకు కేసీఆర్ కేంద్రమంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. శుక్రవారం కొత్తగూడెంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు డైపర్ లేనిదే బయటకు రాడని ఎద్దేవా చేశారు. ఇక స్వతంత్ర అభ్యర్థి జలగం వెంకటరావు డబ్బులు పెట్టి బీ ఫామ్ కొన్నారని ఆరోపించారు. ఎన్నికల గుర్తు సింహంను కూడా డబ్బులు పెట్టి కొన్నారన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్దతు ఇస్తోందని, ఇక్కడ కూనంనేని సాంబశివరావును గెలిపించాలని కోరారు. Quote
Vaaaampire Posted November 24, 2023 Report Posted November 24, 2023 6 hours ago, psycopk said: 😂 kanesam body ni gandhi bhavan lo petataniki kuda opukoledu… Priyanka Gandhi: పీవీ నరసింహారావు అంటే సోనియా గాంధీకి ఎంతో గౌరవం: హుస్నాబాద్ సభలో ప్రియాంకగాంధీ 24-11-2023 Fri 17:05 | Telangana రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు తమ కుటుంబానికి అండగా నిలిచారన్న ప్రియాంక కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూరులో అభివృద్ధి జరిగిందా? అని నిలదీత బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఒక్కటేనని విమర్శ రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు పీవీ నరసింహారావు తమ కుటుంబానికి అండగా నిలిచారని, అలాంటి వ్యక్తి అంటే సోనియా గాంధీకి ఎంతో గౌరవమని ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ గడ్డ నుంచి వచ్చిన పీవీ అంటే తమకు గౌరవమని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరన్నారు. హుస్నాబాద్ నియోకవర్గంలోని ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేశారా? ప్రాజెక్టు భూనిర్వాసితులకు పరిహారం వచ్చిందా? కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూరులో అభివృద్ధి జరిగిందా? అని నిలదీశారు. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పగలరా? ఇలాంటి ప్రభుత్వం మీకు మరో అయిదేళ్లు కావాలా అని ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అయ్యాడని, తన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చాడని విమర్శించారు. కానీ ప్రజలు మాత్రం తమ పిల్లల్ని కష్టపడి చదివించుకున్నా పేపర్ లీకేజీల కారణంగా ఆ చదువులు వృథా అవుతాన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి కుటుంబం కోసమే పని చేస్తోందని ధ్వజమెత్తారు. దళితులు, గిరిజనుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయలేదన్నారు. పెద్ద ప్రాజెక్టులలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారన్నారు. రైతు రుణమాఫీని ఈ ప్రభుత్వాలు మరుగున పడేశాయన్నారు. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిత్యం రాహుల్ గాంధీని విమర్శిస్తుంటారని, కానీ ప్రధాని మోదీ గురించి ఒక్క మాట మాట్లాడరని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఒకటేనన్నారు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకదానికొకటి అండగా ఉంటాయన్నారు. ఇతర రాష్ట్రాలలో పదుల సంఖ్యలో పోటీ చేసే మజ్లిస్ పార్టీ తెలంగాణలో మాత్రం పది స్థానాల్లో కూడా పోటీ చేయడం లేదని విమర్శించారు. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. మోదీ పాలనలో ధనికులు తప్ప పేదలకు మేలు జరగడం లేదన్నారు. The best pm india ever had was pv. Ayina usuru thagili untadhi ee gandhis ki Quote
Vaaaampire Posted November 24, 2023 Report Posted November 24, 2023 14 minutes ago, psycopk said: State Election Commission: రైతుబంధు సాయం పంపిణీకి అనుమతించిన ఎన్నికల సంఘం 24-11-2023 Fri 22:06 | Telangana అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ రైతుబంధు సాయానికి అనుమతివ్వాలని ఈసీని కోరిన ప్రభుత్వం పథకం పాతది కావడంతో పంపిణీకీ అనుమతించిన ఎన్నికల సంఘం తెలంగాణ రైతులకు శుభవార్త... రైతుబంధు సాయం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుబంధు సాయానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఈసీకి విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇది పాత పథకం కావడంతో రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇచ్చారు. దీంతో త్వరలో రైతుల ఖాతాల్లో రైతుబంధు మొత్తం జమ కానుంది. ఈ నెల 28వ తేదీ లోపు మాత్రమే రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. Official bribe for votes Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.