psycopk Posted November 25, 2023 Author Report Posted November 25, 2023 Same people same leaders same words.. just year change ante https://www.instagram.com/reel/Cz83R37pB2w/?igshid=MzRlODBiNWFlZA== Quote
psycopk Posted November 25, 2023 Author Report Posted November 25, 2023 https://www.instagram.com/reel/C0BapX5J-JG/?igshid=MzRlODBiNWFlZA== Quote
pizzaaddict Posted November 25, 2023 Report Posted November 25, 2023 @psycopk Andhra lo Ami news ledhu Ani TG news following aa Ani @Android_Halwa saying Quote
psycopk Posted November 25, 2023 Author Report Posted November 25, 2023 9 minutes ago, pizzaaddict said: @psycopk Andhra lo Ami news ledhu Ani TG news following aa Ani @Android_Halwa saying Nice questioning… proud of u Quote
TuesdayStories Posted November 25, 2023 Report Posted November 25, 2023 https://www.instagram.com/reel/Cz_ihDhJn26/?igshid=NTYzOWQzNmJjMA== @csrcsr @Sucker Quote
psycopk Posted November 25, 2023 Author Report Posted November 25, 2023 Narendra Modi: నేడు, రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. 25-11-2023 Sat 08:39 | Telangana శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు బేగంపేట్ - రాజ్‌భవన్ మధ్య ఆయా సమయాల్లో ఆంక్షలు ఉంటాయని ప్రకటన శని, ఆది, సోమ వారాల్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగింపునకు ఇంకా 4 రోజుల సమయం మాత్రమే మిగిలివుండడంతో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో మరింత జోరు పెంచాయి. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు బీఆర్ఎస్ ప్రచారాన్ని ముందుకు నడిపిస్తుండగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నాయకులను రంగంలోకి దించుతున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. శనివారం (నేడు) సాయంత్రం ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. నగరంలో ఆయన ప్రయాణించే ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా శని, ఆదివారాల్లో (నవంబర్ 25, 26) హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని మోదీ శనివారం సాయత్రం 5:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వై జంక్షన్, పీఎన్‌టీ ఫ్లైఓవర్, బేగంపేట ఫ్లైఓవర్ మీదుగా ప్రధాని రాజ్‌భవన్ చేరుకోనున్నారు. దీంతో ఆ సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇక 26న ఆదివారం ఉదయం 10:35 - 11:05 మధ్య ప్రధాని రాజ్‌భవన్ నుంచి ఎంఎంటీఎస్, యశోద ఆసుపత్రి, బేగంపేట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ సమయాల్లో కూడా ఆంక్షలు అమల్లో ఉంటాయి. ట్రాఫిక్ దారి మళ్లింపులు, నిలిపివేత ఉంటాయని హైదరాబాద్ పోలీసులు సూచించారు. ప్రధాని షెడ్యూల్‌కు అనుగుణంగా శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జీ.సుధీర్ బాబు వెల్లడించారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మోదీ షెడ్యూల్ ఇలా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు దుండిగల్ ఏయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.15 గంటలకు జరిగే కామారెడ్డిలో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు తుక్కుగుడ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతారు. రాత్రి రాజ్‌భవన్‌లో బస చేసి ఆదివారం దుబ్బాక, నిర్మల్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. షెడ్యూల్ ప్రకారం 27న మహబూబాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఇక సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్‌షోతో ప్రధాని పర్యటన ముగియనుంది. Quote
psycopk Posted November 25, 2023 Author Report Posted November 25, 2023 Magalavaram stories from yerri pushpams… trs ki badulu vellu etukunara… Dharmapuri Arvind: కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. తెలంగాణను టీడీపీ చేతిలో పెట్టినట్టే: ధర్మపురి అర్వింద్ 25-11-2023 Sat 15:56 | Telangana చంద్రబాబు వర్గ నేతలంతా కాంగ్రెస్ లో ఉన్నారన్న అర్వింద్ చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ చేస్తున్నారని వ్యాఖ్య రేవంత్ కన్నా కేసీఆర్ బెటర్ అన్న బీజేపీ ఎంపీ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణను టీడీపీ చేతిలో పెట్టినట్టేనని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు వర్గ నాయకులంతా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నారని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ బెటర్ అని చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ పదేళ్ల పాటు పోరాడారని... ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారని అన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు చెప్పినట్టే రేవంత్ చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ ను తానే కట్టానని 2018 ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణను రేవంత్ రెడ్డి హోల్ సేల్ గా అమ్మేస్తారని అన్నారు. Quote
psycopk Posted November 25, 2023 Author Report Posted November 25, 2023 Chekka gadu special status.. ap capital.. division promises el chesav ra mundaa Narendra Modi: మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీకే గ్యారెంటీ: బీసీ సీఎం... ఎస్సీ వర్గీకరణపై కామారెడ్డి సభలో మోదీ 25-11-2023 Sat 15:21 | Telangana బీజేపీ హామీ ఇచ్చిందంటే నిలబెట్టుకుంటుందన్న మోదీ బీజేపీ అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని పునరుద్ఘాటన మాదిగ సామాజిక వర్గానికి తప్పనిసరిగా న్యాయం చేస్తామని మోదీ హామీ బీఆర్ఎస్‌కు డబ్బులు అవసరమైతే కొత్త పథకాలను ప్రారంభించి అవినీతికి పాల్పడుతారని ఆరోపణ కామారెడ్డి నుంచి కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించాలని పిలుపునిచ్చిన మోదీ మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీకే గ్యారెంటీ అని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తామని మాట ఇచ్చామని దానిని నిలబెట్టుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పలుమార్లు నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ... కేంద్రంలో తనలాంటి ఓ బీసీని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీదే అన్నారు. బీజేపీ మాట ఇచ్చిందంటే నెరవేరుస్తుందన్నారు. కేంద్ర కేబినెట్లో అత్యధికమంది బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. కానీ దళితుడిని సీఎంగా చేస్తానని చెప్పిన కేసీఆర్... ఆ హామీని నెరవేర్చలేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. తెలంగాణ వచ్చినప్పుడల్లా ఇక్కడి ప్రజల్లో ఆశలు కనిపిస్తున్నాయని, ఇది మార్పుకు నిదర్శనమన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని తెలిపారు. బీజేపీ చెప్పింది చేసి తీరుతుందన్నారు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, రైతులకు గిట్టుబాటు ధర, సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్, రామమందిర నిర్మాణం... ఇలా ప్రతి హామీని నిలబెట్టుకున్నామన్నారు. తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజనులకు యూనివర్సిటీ వంటి తదితర హామీని కూడా నిలబెట్టుకున్నామన్నారు. తెలంగాణను బీఆర్ఎస్ నుంచి విముక్తి కలిగించాలని పిలుపునిచ్చారు. ఎవరికైనా డబ్బులు అవసరమైతే ఏటీఎం వద్దకు వెళ్తారని, కానీ బీఆర్ఎస్ మాత్రం కొత్త నీటి పారుదల ప్రాజెక్టులు చేపడుతుందని విమర్శించారు. బీఆర్ఎస్‌కు డబ్బులు అవసరమైతే కొత్త పథకాలు వస్తాయని ఎద్దేవా చేశారు. అవినీతి డబ్బు బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తోందన్నారు. బీసీలకు, దళితులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై యువత చాలా కోపంతో ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ తీరుతో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు బీసీలకు, దళితులకు ఏమీ చేయలేవన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చుకున్నంత మాత్రాన వారు చేసిన అవినీతి రూపుమాసిపోదన్నారు. అలాగే యూపీఏ నుంచి 'ఇండియా' అని మార్చుకున్నంత మాత్రాన వారి తీరు మారదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న కామన్ పాయింట్ అవినీతి అని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతుల నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తామని చెప్పారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారని, వీరిద్దరూ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ప్రజలు వారికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. రెండుచోట్ల పోటీ చేస్తున్నారంటే వారిలోని నిరాశ మనకు అర్థమవుతోందన్నారు. పేదల కోసం పని చేసే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. దేశంలో ఓ సమయంలో ఇద్దరు ఎంపీలు ఉన్నారని, ఆ సమయంలో తమను విపక్షాలు ఎగతాళి చేశాయన్నారు. ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు అందులో తెలుగు ప్రజలు ఇచ్చిన సీటు ఒకటి అని గుర్తు చేశారు. ఇప్పుడు మీ దయవల్ల 300కు పైగా ఎంపీ స్థానాలు సాధించామన్నారు. మాదిగ సామాజిక వర్గానికి మరోసారి హామీ ఈ తెలంగాణ అభివృద్ధి యాత్రలో మాదిగ సమాజవర్గానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. వారికి న్యాయం చేసే బాధ్యతను బీజేపీ తీసుకుందని చెప్పారు. మాదిగల సాధికారతకు కోసం మేం కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నామని హామీ ఇచ్చారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉందని, అక్కడ మీకు న్యాయం జరిగేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి నిన్న తాను అధికారులతో మాట్లాడానన్నారు. ఇప్పటికే కమిటీ ప్రకటించామని, వారికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. Quote
psycopk Posted November 25, 2023 Author Report Posted November 25, 2023 Ponguleti Srinivas Reddy: నన్ను ఓడించేందుకు రూ. 300 కోట్లు పంపించారు: పొంగులేటి 25-11-2023 Sat 15:31 | Telangana తనను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర పన్నారన్న పొంగులేటి బీఆర్ఎస్ పాలనను అంతమొందించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ పాలేరులో తనను ఎలాగైనా ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నారని కాంగెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణను దొరల, దోపిడీ పాలన నుంచి కాపాడుకోవాలని చెప్పారు. సుస్థిర పాలనను అందించే కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సి ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం రాష్ట్రంలోని ప్రతి గుండె తపిస్తోందని అన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజల బతుకులు విచ్ఛిన్నమయ్యాయని చెప్పారు. పదేళ్ల కాలంలో దోచుకున్న లక్షల కోట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యేకు రూ. 300 కోట్లు పంపించారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. కేసీఆర్ పంచే డబ్బు మనదేనని... ఆ డబ్బు తీసుకుని కాంగ్రెస్ కే ఓటు వేయాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. Quote
psycopk Posted November 25, 2023 Author Report Posted November 25, 2023 Rahul Gandhi: సోనియాగాంధీ దయవల్లే ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలన చేస్తున్నారు: రాహుల్ గాంధీ 25-11-2023 Sat 14:37 | Telangana సోనియా వల్ల, రాజ్యాంగం, పార్లమెంటరీ సిస్టం వల్ల తెలంగాణ వచ్చిందన్న రాహుల్ గాంధీ అక్రమ సంపాదన అంతా కేసీఆర్ ఇంటికి చేరుకుంటోందని ఆరోపణ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను పరిపాలిస్తున్నారంటే అందుకు కారణం సోనియాగాంధీయేనని, ఆమె దయవల్ల, రాజ్యాంగం దయవల్ల, పార్లమెంటరీ సిస్టం వల్ల రాష్ట్రం వచ్చిందని గుర్తుంచుకోవాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఈ రోజు అక్రమాలు చేసి సంపాదిస్తున్న డబ్బు అంతా కేసీఆర్ ఇంటికి చేరుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతల వద్ద కూడా ఈ అక్రమార్జన ఉందన్నారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. ఇక్కడి యువత కలలను, ఆశయాలను బీఆర్ఎస్ నాశనం చేసిందన్నారు. కుటుంబ పాలన, అవినీతి పాలన వల్ల తెలంగాణ ఎంతో నష్టపోయిందన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కనిపించడంలేదని ఆరోపించారు. తెలంగాణలో ల్యాండ్, శాండ్, వైన్స్ మాఫియా పెరిగిందని, ఆ డబ్బంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికే చేరిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా దోచుకున్నారని ఆరోపించారు. దొరల పాలనను అంతం చేసి ప్రజాపాలనను తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,200కు పెరిగిందని మండిపడ్డారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఆ వర్గానికి ఖర్చు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. పేదల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. యాభై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయలేదని కేసీఆర్ చెబుతున్నారని, కానీ ఆయన చదువుకున్న స్కూల్, కాలేజీ అదే పార్టీ కట్టిందని గుర్తుంచుకోవాలన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఐటీ నగరంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ అన్నారు. దళితబంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ.3 లక్షల కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. పేదల భూములు లాక్కోవడానికే కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకు వచ్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను హామీలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ మళ్లీ గెలిచాక 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. Quote
psycopk Posted November 25, 2023 Author Report Posted November 25, 2023 Revanth Reddy: రైతుబంధు పంపిణీకి అనుమతి... బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఈసీ తీరు ఉంది: రేవంత్ రెడ్డి ఆగ్రహం 25-11-2023 Sat 14:12 | Telangana బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అనుబంధం మరోసారి తేటతెల్లమైందన్న రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రైతుబంధు పంపిణీ వల్ల రైతులకు రూ.5వేల కోట్ల నష్టమన్న టీపీసీసీ చీఫ్ ఎన్నికల అధికారి.. కాంగ్రెస్ నేతల ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని ఆరోపణ కేంద్ర ఎన్నికల సంఘం తీరు అధికార పార్టీకి ప్రయోజనం కలిగించేలా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో పోలింగ్‌కు మూడు రోజుల ముందు రైతుబంధు సాయం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని, దీంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య అనుబంధం మరోసారి తేటతెల్లమైందన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు. నవంబర్ 15వ తేదీ లోపు రైతుబంధు సాయం పంపిణి జరిగేలా తాము గతంలోనే ఈసీని కోరామని, కానీ దానిని పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్‌కు ప్రయోజనం చేకూర్చేలా నిన్న.. రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రైతుబంధు వల్ల రైతులకు రూ.5వేల కోట్ల నష్టం జరుగుతోందన్నారు. డిసెంబర్‌లో అయితే 15వేల రైతు భరోసా వచ్చేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ నాయకుల ఇళ్లు, కార్యాయాలలోనే తనిఖీలు జరుగుతున్నాయని మండిపడ్డారు. Quote
psycopk Posted November 25, 2023 Author Report Posted November 25, 2023 KTR: పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ చేసిన అన్యాయం ప్రియాంకగాంధీకి తెలియకపోవడం దురదృష్టకరం: కేటీఆర్ 25-11-2023 Sat 13:45 | Telangana పీవీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందన్న కేటీఆర్ జీవితమంతా కాంగ్రెస్ కోసం సేవ చేసిన వ్యక్తిని కాంగ్రెస్ దారుణంగా అవమానించిందని విమర్శ ప్రియాంక, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ దివంగత పీవీ నరసింహారావు అంటే సోనియాగాంధీకి అభిమానమని వ్యాఖ్యానించిన ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీకి మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ... పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం గురించి ఆమెకు తెలియకపోవడం నిజంగా దురదృష్టకరమన్నారు. పీవీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని, అవమానించిందని మండిపడ్డారు. మనమంతా అభిమానించే వ్యక్తి పీవీ... భూమి పుత్రుడు... తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన అలాంటి మానవతామూర్తి, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించిందన్నారు. 1996లో సిట్టింగ్ ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావుకు ఎంపీ టికెట్ నిరాకరించి... కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ మరణించినప్పుడు కనీసం 24 అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి ఆయన భౌతికకాయాన్ని అనుమతించకుండా అవమానించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ చరిత్ర గురించి ప్రియాంకాగాంధీకి అవగాహన లేకపోవడం దారుణమన్నారు. పీవీ కుటుంబానికి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. Quote
psycopk Posted November 25, 2023 Author Report Posted November 25, 2023 Meru country motham nakincharu kada ra pushpams Amit Shah: కేసీఆర్ పాలనలో తెలంగాణ దివాలా తీసింది: అమిత్ షా విమర్శలు 25-11-2023 Sat 12:06 | Telangana బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను నాశనం చేశారన్న అమిత్ షా అవినీతి తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడూ ఒకటేనని వ్యాఖ్య పదేళ్ల పాలనలో అవినీతి తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. 1,200 మంది బలిదానాలతో తెలంగాణ ఏర్పడితే... రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు. లక్ష రుణ మాఫీ చేయలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఉద్యోగాలను భర్తీ చేయలేదని విమర్శించారు. ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ ఆ హామీని నిలుపుకోలేదని అమిత్ షా విమర్శించారు. రాష్ట్రంలో వందల కోట్ల గ్రానైట్ కుంభకోణం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఎన్నికల ముందు వేర్వేరు కండువాలతో వస్తారని... ఎన్నికలయ్యాక కలిసిపోతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా బీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటు వేసినట్టేనని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి ఉండదని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తామని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ఎన్నికలు తెలంగాణకు అవసరమని చెప్పారు. తెలంగాణ ప్రజల ఓటు మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. Quote
psycopk Posted November 25, 2023 Author Report Posted November 25, 2023 KCR: సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు 25-11-2023 Sat 09:52 | Telangana అక్టోబర్ 30న ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఫిర్యాదు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో కేసీఆర్ రెచ్చగొట్టేలా ప్రసంగించారన్న కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ఫిర్యాదుపై స్థానిక రిటర్నింగ్ అధికారి విచారణ, ఈసీకి నివేదిక నివేదిక ఆధారంగా ఈసీ నోటీసులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సీఎంకు హెచ్చరిక ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది. అక్టోబర్ 30న బాన్సువాడలో జరిగిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రూల్స్‌కు విరుద్ధమని స్పష్టం చేసింది. స్టార్ కాంపెయినర్‌గా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇలాంటి ప్రసంగాలు చేసిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకు ఉందని గుర్తు చేసింది. ప్రస్తుత వ్యాఖ్యలను మాత్రం సీరియస్‌గా తీసుకోవట్లేదని పేర్కొంది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ ప్రజాశీర్వాద సభలో రెచ్చగొట్టేలా మాట్లాడారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ విచారణకు ఆదేశించగా స్థానిక రిటర్నింగ్ అధికారి ఈ నెల 14న ఈసీకి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఈసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. Quote
psycopk Posted November 25, 2023 Author Report Posted November 25, 2023 Malla Reddy: మంత్రి మల్లారెడ్డి అనుచరుడి ఇంట్లో సోదాలు 25-11-2023 Sat 10:03 | Telangana ఎన్నికల నేపథ్యంలో నేతలు, అనుచరుల ఇళ్లలో సోదాలు తాజాగా మల్లారెడ్డి అనుచరుడు సంజీవరెడ్డి ఇంట్లో తనిఖీలు సోదాలు నిర్వహించిన ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు, వారి అనుచరుల ఇళ్ళల్లో సోదాలు జరుగుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డి అనుచరుడు, బీఆర్ఎస్ బోడుప్పల్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంజీవరెడ్డి నివాసానికి మల్లారెడ్డికి చెందిన డబ్బు భారీ మొత్తంలో చేరిందన్న ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సోదాలు జరిగాయి. సంజీవరెడ్డిని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుని సోదాలు చేశారు. అయితే, సోదాల్లో ఎలాంటి డబ్బు దొరకకపోవడం గమనార్హం. సోదాల సందర్భంగా సంజీవరెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.