Jump to content

Hyderabad Loo 90% Buildings Illegal Antaaaaaaa


solman

Recommended Posts

అనుమతి లేని నిర్మాణాలు.. అనుమతి తీసుకున్నా ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలు.. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూముల్లో చేపట్టిన నిర్మాణాలు.. ఇలా నిబంధనలను అతిక్రమించి కట్టిన నిర్మాణాలు అన్నీ ఇన్నీ కావు. మొత్తంమీద, టౌన్‌ ప్లానింగ్‌ నిబంధనల ప్రకారం కట్టిన నిర్మాణాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో పది శాతానికి మించి లేవన్న నిర్థారణకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో కూల్చివేతలను కొనసాగిస్తే నగరంలోని మెజారిటీ భవనాలను నేలమట్టం చేయక తప్పదన్న అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే, గల్లీ గల్లీలో నెలకొన్న అనుమతులు లేని నిర్మాణాలను అక్రమ నిర్మాణాల పేరిట కూల్చి వేస్తే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని అధికార వర్గాలు ప్రభుత్వానికి ఓ నివేదిక పంపించాయి. స్థానికులు.. పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులు కూల్చివేతలను అడుగడుగునా అడ్డుకుంటున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. కూల్చివేతలను నిలిపి వేయాలంటూ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ కూడా తీర్మానించిందని వివరించాయి. ఈ నేపథ్యంలోనే, నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగించడమా? లేక వాటిని క్రమబద్ధీకరించడమా అనే సందిగ్ధ స్థితిలో ప్రభుత్వం పడిందని ఆ వర్గాలు వివరించాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులూ దీనిని వ్యతిరేకిస్తున్నారు.

Link to comment
Share on other sites

నిధుల సమీకరణ కోసం సర్కారు కసరత్తు
క్రమబద్ధీకరణతో వెయ్యి కోట్ల రాబడి
కూల్చివేతల్లో అసలు మతలబు ఇదే
అయితే హైకోర్టు రూపంలో అడ్డంకి
బీపీఎస్‌కు అవకాశం ఇవ్వం
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించం
హైకోర్టుకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హామీ
ఆక్రమణలపై కమిటీ!... టీ సర్కారు యోచన
కూల్చివేతలే పరిష్కారం కాదని భావన

(హైదరాబాద్‌ సిటీ - ఆంధ్రజ్యోతి) హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తారా!? ప్రజా వ్యతిరేకత, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిలిపి వేస్తారా!? లేక, ఎప్పట్లాగే, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్‌)కు శ్రీకారం చుడతారా!? తెలంగాణ ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి!? ఈ ప్రశ్నలకు ‘క్రమబద్ధీకరణే ప్రభుత్వ లక్ష్యం’ అని అధికార వర్గాలు చెబుతున్నా.. అది సాధ్యమయ్యే పనేనా అన్న సందేహాలనూ వ్యక్తం చేస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను సహించేది లేదని ప్రజలకు బలమైన సందేశాన్ని పంపించడం.. క్రమబద్ధీకరణ పేరిట భారీ ఎత్తున ఫీజులు వసూలు చేయడం ద్వారా నిధులు సమీకించుకోవడం కూల్చివేతల వెనకున్న వ్యూహమని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. అయితే, అందుకు పరిమితులు కూడా ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం తెలంగాణ ప్రభుత్వానికి పులి స్వారీలా మారిందని కూడా వ్యాఖ్యానిస్తున్నాయి! అక్రమ నిర్మాణాలు అనగానే పరిమిత సంఖ్యలోనే ఉంటాయని ఎవరైనా  భావిస్తారు. కానీ, అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రారంభించిన తర్వాత చేపట్టిన ప్రాథమిక సర్వేలోనే మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)కు కళ్లు బైర్లు కమ్మే నిజాలు తెలుస్తున్నాయి.

అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనుమతి లేని నిర్మాణాలు.. అనుమతి తీసుకున్నా ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలు.. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూముల్లో చేపట్టిన నిర్మాణాలు.. ఇలా నిబంధనలను అతిక్రమించి కట్టిన నిర్మాణాలు అన్నీ ఇన్నీ కావు. మొత్తంమీద, టౌన్‌ ప్లానింగ్‌ నిబంధనల ప్రకారం కట్టిన నిర్మాణాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో పది శాతానికి మించి లేవన్న నిర్థారణకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో కూల్చివేతలను కొనసాగిస్తే నగరంలోని మెజారిటీ భవనాలను నేలమట్టం చేయక తప్పదన్న అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే, గల్లీ గల్లీలో నెలకొన్న అనుమతులు లేని నిర్మాణాలను అక్రమ నిర్మాణాల పేరిట కూల్చి వేస్తే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని అధికార వర్గాలు ప్రభుత్వానికి ఓ నివేదిక పంపించాయి. స్థానికులు.. పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులు కూల్చివేతలను అడుగడుగునా అడ్డుకుంటున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. కూల్చివేతలను నిలిపి వేయాలంటూ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ కూడా తీర్మానించిందని వివరించాయి. ఈ నేపథ్యంలోనే, నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగించడమా? లేక వాటిని క్రమబద్ధీకరించడమా అనే సందిగ్ధ స్థితిలో ప్రభుత్వం పడిందని ఆ వర్గాలు వివరించాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులూ దీనిని వ్యతిరేకిస్తున్నారు.

దీనికితోడు, ఈ ఏడాది చివర్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కూల్చివేతలను మరింత కాలం కొనసాగించలేని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడిందని అధికార వర్గాలు వివరించాయి. అదే సమయంలో, మరోసారి క్రమబద్ధీకరణకు అవకాశం ఇద్దామని భావిస్తే అందుకు చట్టపరంగా ఇబ్బందులు ఉన్నాయని వివరించాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించడాని (బీపీఎస్‌)కి సంబంధించి 2008లో అప్పటి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని పౌర సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి. దీంతో, ఈ వ్యవహారంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. దీంతో, అప్పటి ప్రభుత్వం హైకోర్టుకు ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. బీపీఎస్‌కు అవకాశం ఇవ్వడం ఇదే చివరి సారని, అక్రమ నిర్మాణాలను ఇకపై ప్రోత్సహించేది లేదని అందులో స్పష్టం చేసింది. దానికి సంతృప్తి చెందిన తర్వాతే కోర్టు బీపీఎస్‌ పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దాంతో, క్రమబద్ధీకరణకు అప్పట్లో 2,03,895 దరఖాస్తులు రాగా.. వాటిలో 1,45,895 దరఖాస్తులను క్రమబద్ధీకరించారు. దాని ద్వారా జీహెచ్‌ఎంసీ ఖజానాకు రూ.650 కోట్లు సమకూరాయి.   అప్పటి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి బీపీఎస్‌ లేదా సంబంధిత ఉత్తర్వులను ఎలా జారీ చేయగలుగుతుందని అధికార వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.

సాధ్యం కాకపోతే గందరగోళమే!
జీహెచ్‌ఎంసీ పరిధిలో గత బీపీఎస్‌లో మిగిలిన దరఖాస్తులు, కొత్తగా నిర్మించిన నిర్మాణాలను పరిగణనలోకి తీసుకుంటే అక్రమ నిర్మాణాల సంఖ్య రెండు లక్షల వరకు ఉంటుందని ఒక అంచనా. వీటిని  క్రమబద్ధీకరించడం ద్వారా ఎంత లేదన్నా రూ.1000 కోట్లు సమకూరతాయని భావిస్తున్నారు.   నిధుల సమీకరణకు వివిధ మార్గాలను అన్వేషించినప్పుడు అక్రమ నిర్మాణాల అంశం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు చెబుతున్నారు. అయితే, క్రమబద్ధీకరణకు సంబంధించి హైకోర్టుతోపాటు పౌర సంఘాల నుంచి కూడా ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వాస్తవానికి, 2008లో వైఎస్‌ ప్రభుత్వం బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోలను తీసుకుని వచ్చినప్పుడు పౌర సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బీపీఎస్‌ వద్దని హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఆ పథకాన్ని మళ్లీ తీసుకొస్తే పౌర సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. తాజా పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించలేకపోతే కూల్చివేతలను కొనసాగించాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ విషయం రాద్ధాంతమై అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా కొందరు.. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా మరికొందరు న్యాయ వ్యవస్థను ఆశ్రయించారు.

గుర్తించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టకుండా మిన్నకుంటే ప్రజలు ఇదే పంథాను మరింత ఎక్కువగా అనుసరించే ప్రమాదం ఉందని అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ‘‘చర్యలు చేపట్టకుండా మిన్నకుండడం అంటే వీటిని ఓ విధంగా ప్రోత్సహించినట్లే లెక్క’’ అని సామాజిక శాస్త్రవేత్త సి.రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, అక్రమ నిర్మాణాలు అన్నిటినీ నేలమట్టం చేయడానికి సర్కారు పూనుకుంటే రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురు దెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎలా చూసినా.. అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లడం ద్వారా ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుందని, దీనిపై స్పష్టత వచ్చే వరకూ నగరంలో గందరగోళం నెలకొంటుందని అభిప్రాయపడుతున్నారు.

అధికారులపై చర్యలేవి..?
అక్రమ నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది, అధికారులు ప్రోత్సహించారనే విమర్శలు సర్వత్రా ఉన్నాయి.    అక్రమ నిర్మాణాలు వెలిసిన సమయాన్ని బట్టి ఆయా సర్కిళ్లలో అప్పట్లో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఇప్పుడు పెరుగుతున్నాయి.

కూలిస్తే ఊరుకోం: కార్పొరేటర్లు
అనుమతులు లేని నిర్మాణాలను అక్రమ నిర్మాణాలని పేర్కొంటూ కూల్చివేయడాన్ని జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు పార్టీలకతీతంగా వ్యతిరేకిస్తున్నారు. కూల్చివేతలను నిలిపివేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోకపోవడాన్ని వీరు జీర్ణియించుకోలేకపోతున్నారు. అవసరమైతే అనుమతులు లేని నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే అంశంపై టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. సింగిరెడ్డి అభిప్రాయంతోనే కాంగ్రెస్‌, బీజేపీ, మజ్లిస్‌ కార్పొరేటర్లు ఉండటం గమనార్హం.

గురుకుల్‌ భూముల్లో కొత్త కోణం!
జీహెచ్‌ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు, గురుకుల్‌ భూములకు మధ్య వ్యత్యాసం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తమ సొంత భూముల్లో అనుమతులు లేకుండా నిర్మించిన వారు నగరవాసులైతే.. భూమిపై సాంకేతికంగా హక్కులు లేకుండా (కోర్టులో వివాదం పరిష్కారం కాకుండానే)నే గురుకుల్‌ భూముల్లో నిర్మాణాలు చేపట్టారు. అవన్నీ దేవాదాయ భూములు. గతంలో ఓసారి ఆ శాఖ హైకోర్టుకు ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది. భూమికి తమకు విలువ కట్టి ఇస్తే కొనుగోలుదారులకు రిజిస్ర్టేషన్‌ చేయడానికి లేదా హక్కులు దఖలు చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అందులో పేర్కొంది. దీన్ని ఇప్పుడు ప్రముఖంగా గురుకుల్‌ బాధితులు తెరపైకి తెస్తున్నారు. దేవాదాయ శాఖతో వివాదం ఉందని, దాన్ని కోర్టు ద్వారా పరిష్కరించుకుంటామని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Link to comment
Share on other sites

green card malli dobbindi...inka illegal iyyi D ta...brahmi%20laugh.gif

undhi ga september march paina...annatlu malli veyyi man...poyedhemundhi oka mnth salary thappa...brahmi%20laugh.gif

Link to comment
Share on other sites

undhi ga september march paina...annatlu malli veyyi man...poyedhemundhi oka mnth salary thappa...brahmi%20laugh.gif

inka naa valna kadu inka illegaleee brahmi%20laugh.gif

Link to comment
Share on other sites

×
×
  • Create New...