Jump to content

నవ్యనగరి... ఆకర్షణ సిరి...


TampaChinnodu

Recommended Posts

నవ్యనగరి... ఆకర్షణ సిరి... 
స్మార్ట్‌ సిటీ జాబితాలో అమరావతికి చోటు 
సర్వత్రా హర్షం 
ఈనాడు, అమరావతి 
amr-top1a.jpg

నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి అనూహ్యంగా ఆకర్షణీయ నగరంగా ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పలు నగరాలు పోటీపడినప్పటికీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కేంద్రంగా రూపుదిద్దుకోనున్న అమరావతిని ఆకర్షణీయ నగరంగా ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు నగరాలు ఎంపికకాగా.. అందులో అమరావతి ఒకటి కావడం విశేషం.

ఇప్పటికే నవ్యాంధ్రలో కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి ఆకర్షణీయ నగరాల జాబితాలో స్థానం సంపాదించాయి. తాజాగా అమరావతి నగరానికి అవకాశం దక్కింది. కేవలం గ్రామ పంచాయతీలతో కూడిన ప్రాంతం ఆకర్షణీయ నగరంగా ఎంపిక కావడం పలువురిని ఆశ్చర్యపరిచింది. అయితే భవిష్యత్తులో నవ్యాంధ్ర రాజధానిగా ప్రత్యేక గుర్తింపు పొందడం, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో రాజధాని నగరానికి ఈ అవకాశం దక్కినట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ రాజధాని పరిధి... 
గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో మొత్తం 29 గ్రామాలను రాజధాని కేంద్రంగా గుర్తించిన విషయం తెలిసిందే. దీనికి ఇప్పటికే 34వేల ఎకరాలను రైతుల నుంచి స్వచ్ఛందంగా భూసమీకరణ విధానంలో సేకరించారు. ప్రస్తుతం రాజధాని సీడ్‌ కాపిటల్‌ ప్రాంతంలో 24 గ్రామాల్లో జనాభా ఉంది. ఈ గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు మరో 9 నగరాలను నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. పరిపాలన నగరం, ఆర్థిక నగరం, వాణిజ్య నగరం, విద్యా నగరం, వైద్య నగరం, మీడియా నగరం, ఎలక్ట్రానిక్‌ నగరం, న్యాయ నగరం, క్రీడా నగరం నిర్మాణం చేయనున్నారు. ఇప్పటికే దీనికి బృహత్తర ప్రణాళిక రూపొందించారు. సీఆర్‌డీఏ, ఏడీసీ ఆధ్వర్యంలో మౌలిక వసతులు శరవేగంగా కల్పిస్తున్నారు. 2020 నాటికి నగర జనాభా కనీసం 15లక్షలకు చేరుకొనే అవకాశం ఉంది. 2050 నాటికి నగరంలో 50లక్షల జనాభా ఉంటుందని అంచనా వేశారు.

శరవేగంగా నిర్మాణాలు..!: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరంలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంతో పాటు, శాసనసభ, మండలి భవన నిర్మాణం చేసి పరిపాలన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక్కడే 900 ఎకరాల్లో పరిపాలన నగరానికి శ్రీకారం చుడుతున్నారు. దీనికి నార్మన్‌ఫోస్టర్‌ ఆకృతులను రూపొందించింది. దాదాపు ఖరారయ్యాయి. అమరావతి నగరంలో మౌలిక వసతులపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. నగరాన్ని అనుసంధానిస్తూ కృష్ణానదిపై రెండు ఐకానిక్‌ వంతెనల నిర్మాణం చేయనున్నారు. దీనికి పలు ఆకృతులు రూపొందించారు. ఖరారు కావాల్సి ఉంది. అమరావతి నగరం నీలి, హరిత (బ్లూ, గ్రీన్‌ సిటీ) నగరంగా నిర్మాణం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీనికి గాను 50 శాతం ఖాళీ ప్రదేశాల్లో వనాలు పెంచనున్నారు. రాజధాని ప్రణాళికలే ఆకర్షణీయ నగరాల పోటీలో నిలిపాయి. దీంతో అమరావతి నగరం ఆకర్షణీయ నగరంగా ఎంపికైంది.

నిధుల సౌలభ్యం..!: అమరావతి నగరం నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూర్చాల్సి ఉంది. ప్రస్తుతం అమరావతి నగరం ఆకర్షణీయ నగరంగా ఎంపిక కావడంతో అదనంగా నిధులు అందనున్నాయి. ముందుగా రానున్న రెండేళ్లలో రాజధాని పరిధిలోని గ్రామాలను కలిపి నగరపాలక సంస్థగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో నగరంగా గుర్తింపు పొందనుంది.

విజయవాడ ఎప్పటికో..!: అమరావతి ఆకర్షణీయ నగరంగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తమవుతున్నా.. గత రెండేళ్లుగా పోటీలో ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలు మాత్రం ఎంపిక కాకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరో విడత ఎంపికకకు పోటీ పడాల్సి ఉంది. ఆకర్షణీయ నగరాల పోటీలో విజయావాడ ముందుంది. పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టి జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకుంది. అయిదు అంశాల్లో అవార్డులు దక్కించుకుంది. కానీ తాజాగా ఆకర్షణీయ నగరాల్లో వెనుకపడింది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విజయవాడ నగరపాలక సంస్థ ఆకర్షణీయ నగరంపై ఆశలు పెంచుకుంది. పారిశుద్ధ్యం, రక్షితనీరు, యూజీడీ, వీధి దీపాలు, ఇతర మౌలిక వసతులు అంశాల్లో నగరాలకు ర్యాంకింగ్స్‌ ఇచ్చారు. మొత్తం 500 నగరాల్లో ఒకసారి 18వ స్థానం, రెండోసారి 23 స్థానం దక్కింది. కానీ ఈ సారి ఎంపిక చేసిన 30 నగరాల్లో మాత్రం విజయవాడకు స్థానం లభించలేదు. ప్రస్తుతం విజయవాడలో ఆకర్షణీయ నగరంగా గుర్తింపు పొందేందుకు గోల్డెన్‌మైల్‌ ప్రాజెక్టు నడుస్తోంది. వీధి దీపాలు ఏర్పాటు చేశారు. డిజిటల్‌ డోర్‌ నెంబర్లు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం విషయంలో పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేకపోయింది. దీంతో రాజధాని కేంద్రంగా ఉన్న విజయవాడ నగరం ఎంపిక కాలేకపోయింది. ఇటీవల నగరపాలన కూడా అస్త్యవస్తంగా మారింది. ఇక గుంటూరు నగరం సైతం వెనుకబడింది. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన నిధులతో గుంటూరులో భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విజయవాడలో వర్షపు నీటి వ్యవస్థ నిర్మాణంలో ఉన్నాయి. అమృత్‌ పథకం అమలులో ఉంది. దీనికింద నిధులు అందుతున్నాయి. మరోసారి ఆకర్షణీయ నగరాల ఎంపికలో విజయవాడకు స్థానం లభిస్తుందని ఆశిస్తున్నారు.

హైదరాబాద్‌ను మరచిపోతాం 
ఆకర్షణీయ నగరాల సరసన అమరావతి చేరటం ప్రతి ఆంధ్రుడు ఆనందించదగ్గ విషయం. ప్రపంచంలో మేటి నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చొరవ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఆకర్షణీయ హోదా దక్కడం వల్ల అదనంగా నిధులు సమకూరుతాయి. ఐదేళ్లపాటు అందే ఈ నిధులతో ఆకర్షణీయ నగరంగా రూపొందుతుందనడంలో సందేహం లేదు. అధునాతన సౌకర్యాల కల్పన, యువతకు ఉద్యోగాలు దొరకడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నగరాన్ని చూసి హైదరాబాద్‌ను మర్చిపోతాం.

- డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి, 
కల్చరల్‌ సెంటర్‌ అమరావతి, విజయవాడ సీఈఓ

ఆకర్షణీయానికి తొలిమెట్టు 
అవనిగడ్డ, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని అమరావతిని కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయ నగరంగా ప్రకటించడం హర్షణీయం. ప్రపంచంలోనే అమరావతి ఒక గొప్ప ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి చెందడానికి ఇది తొలిమెట్టు. అమరావతి ఏర్పడిన కొద్ది కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయ నగరంగా ప్రకటించడంతో భవిష్యత్తులో ఒక సుందరనగరంగా అభివృద్ధి చెందనుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

- మండలి బుద్ధప్రసాద్‌, శాసనసభ ఉపసభాపతి

నగరం: అమరావతి 
విశేషం: నవ్యాంధ్ర రాజధాని 
విస్తీర్ణం: 217 చదరపు కిలోమీటర్లు 
జనాభా: లక్ష (2011 లెక్కల ప్రకారం) 
రెవెన్యూ గ్రామాలు: 24 
పంచాయతీలు: 25, మండలాలు: 3

Link to comment
Share on other sites

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    11

  • SANANTONIO

    5

  • Annayya_fan

    5

  • reality

    4

Top Posters In This Topic

assalu ee smart city concept endi.

few months back chadivina article lo center will give some amount of money ani vunde. aa amount of money tho okka road veyyataaniki kooda saripodu aa cities lo.

does anyone have any other details. no PPTs please. assalu entha money istharo , plan ento details flease

Link to comment
Share on other sites

Its good that they considered Amaravathi, based on how promising it WILL be...good for city's brand value..,

But, Dramoji gaadi butter pooyadam konchem athi ga untadhi..,

Link to comment
Share on other sites

18 minutes ago, TampaChinnodu said:

assalu ee smart city concept endi.

few months back chadivina article lo center will give some amount of money ani vunde. aa amount of money tho okka road veyyataaniki kooda saripodu aa cities lo.

does anyone have any other details. no PPTs please. assalu entha money istharo , plan ento details flease

Brand value....ganthe

Link to comment
Share on other sites

1 hour ago, Annayya_fan said:

Navya nagari ante hydervad gurinchi anukunna....last 3yrs lo emerge ina city hydervade ga %$#$%$#$

congrats man. AP lo bars increased anta kada. manchi development. daani meeda PPT edi.

Link to comment
Share on other sites

Endo anni cities ni smart cities ga declare chestunnaru , but not sure what is the tangible development or what kind of infrastructure will be developed because of that , anyone know? 

Link to comment
Share on other sites

Can someone enlighten me What all were the cities decalred smart over last 4-5 years and what's they achieved being SMART?#~`

We can check Amaravathi, Karimnagar next year 

Link to comment
Share on other sites

58 minutes ago, TampaChinnodu said:

congrats man. AP lo bars increased anta kada. manchi development. daani meeda PPT edi.

tumblr_mqb6wzSo791spvnemo1_250_01.gif?14

no PPTs on negatives, only on Fantasized things

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

congrats man. AP lo bars increased anta kada. manchi development. daani meeda PPT edi.

Brand value kosam Brandy shops increase chesara...#NSFK

Link to comment
Share on other sites

1 hour ago, Peddayana said:

Endo anni cities ni smart cities ga declare chestunnaru , but not sure what is the tangible development or what kind of infrastructure will be developed because of that , anyone know? 

okko city ki hardly 1000 crores giving. corruption ponu inka migilendi endi , thokkalo smart cities.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...