Jump to content

వెయ్యి కంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకోనివ్వొద్దు!


TampaChinnodu

Recommended Posts

వెయ్యి కంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకోనివ్వొద్దు!

ముంబయి కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు ఆర్‌బీఐ ఆదేశాలు

03142119BRK101-BANK.JPG

ముంబయి: ముంబయికి చెందిన సిటీ కో-ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ కార్యకలాపాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) కొన్ని ఆంక్షలు విధించింది. అంతేగాక కో-ఆపరేటివ్‌ బ్యాంకు ఖాతాదారులు రూ.1000 కంటే ఎక్కువ విత్‌ డ్రా చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘ముంబయికి చెందిన సిటీ కో-ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ ఖాతాదారులు తమ పొదుపు ఖాతా, డిపాజిట్‌ ఖాతా లేదా కరెంట్‌ ఖాతాల నుంచి రూ.1000 మాత్రమే విత్‌ డ్రా చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ మొత్తంలో విత్‌డ్రాలను బ్యాంకు అనుమతించకూడదు’ అని ఆర్‌బీఐ పేర్కొంది. అంతేగాక.. కొత్త డిపాజిట్లు అంగీకరించాలన్నా, రుణాలు ఇవ్వాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, అప్పులు తీసుకోవాలన్నా సదరు సిటీ కో-ఆపరేటివ్‌ బ్యాంకు ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే బ్యాంకు లైసెన్సును రద్దు చేయాల్సి వస్తుందని ఆర్‌బీఐ హెచ్చరించింది. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితి మెరుగుపడేవరకూ కో-ఆపరేటివ్‌ బ్యాంకు ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. పరిస్థితులను బట్టి నిబంధనలను మారుస్తామని స్పష్టం చేసింది.

Link to comment
Share on other sites

_%~

swiss bank money motham return thepinchi mari indian public ki panchutha annadu modi. last ki valla own accounts lo money ni kooda theesukonivvatle @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...