Jump to content

వ్యభిచారంలో దొరికిన 16 ఏళ్ళ అమ్మాయి చెప్పిన మాటలకు షాక్ అయ్యాను


kiladi bullodu

Recommended Posts

daily min okka crime  cover sesthadu RK

 

http://www.andhrajyothy.com/artical?SID=652959

భర్త వివాహేతర సంబంధం.. భార్య కూడా పక్కింటి వ్యక్తితో.. చివరికి..
23-10-2018 09:30:38

 

 

  • ఆర్టీసీ డ్రైవర్‌ హత్య కేసులో నిందితుల అరెస్టు
  • వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే దారుణం
పొన్నూరు(గుంటూరు జిల్లా): పొన్నూరులో సంచలనం సృష్టించిన ఆర్టీసీ డ్రైవర్‌ సత్యంశెట్టి శ్రీనివాసరావు హత్య కేసులో ముగ్గురు నిందితులను అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను బాపట్ల డీఎస్పీ డి.గంగాధరం పొన్నూరు అర్బన్‌ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
 
 
పొన్నూరు 18వ వార్డు వీవర్సు కాలనీకి చెందిన సత్యంశెట్టి శ్రీనివాసరావు ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నెలలో కొన్ని రోజులు నైట్‌ డ్యూటీకి వెళుతుంటాడు. అతడు కొంతకాలం కిందట వట్టిచెరుకూరులో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ విషయంపై శ్రీనివాసరావుకు, అతడి భార్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వీరి మధ్య సఖ్యత లేదని గమనించిన వారి ఇంటి పక్కనే ఉండే కారు డ్రైవర్‌ ఆకుల నరేశ్‌... శ్రీనివాసరావు భార్య పార్వతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు తన స్నేహితులతో వచ్చి నరేశ్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు.
 
దీంతో అవమానం చెందిన నరేశ్‌... శ్రీనివాసరావును అంతం చేయాలనుకున్నాడు. తన స్నేహితులైన కారు డ్రైవర్లు బత్తుల సుబ్రహ్మణ్యం, వలిశెట్టి గోపిలతో మాట్లాడాడు. దసరా పండుగ రోజు ముందు రాత్రి (బుధవారం) వారందరూ నరేశ్‌ ఇంటిలో నిద్రించారు. విజయదశమి (గురువారం) తెల్లవారు జామున నాలుగు గంటలకు శ్రీనివాసరావు డ్యూటీకి వెళుతున్నాడు. ఇదే అదనుగా భావించిన నరేశ్‌, సుబ్రహ్మణ్యం, గోపి కలసి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద వీధిలైట్లు ఆర్పివేసి ఇనుపరాడ్డు, మారణాయుధాలతో శ్రీనివాసరావు నుదురు, తలపై బలంగా కొట్టారు. దీంతో శ్రీనివాసరావు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య జరిగిన రోజు ఆకుల నరేశ్‌ ఇంట్లో లేక పోవటంతో అనుమానం కలిగింది. హత్యకు కారణం అతడేనని భావించారు. శ్రీనివాసరావును తానే హత్య చేసినట్లు స్థానిక వీఆర్వో వద్ద నరేశ్‌ అంగీకరించాడు.
 
అర్బన్‌ స్టేషన్‌ సీఐ ఎం నాగేశ్వరావు, ఎస్సై డి.కిషోర్‌బాబు ఏఎస్‌ఐ ఆంజనేయులు, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి నిందితులు నరేశ్‌, సుబ్రహ్మణ్యం, గోపిలను అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు కానిస్టేబుళ్లకు రివార్డులు అందించారు. అర్బన్‌ సీఐ నాగేశ్వరావును రూరల్‌ ఎస్పీ అప్పలనాయుడు, డీఎస్పీ గంగాధరం అభినందించారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...