Jump to content

Babu aa Majaka naa.....


ringaringa

Recommended Posts

 
Ippudu cheppadi raa abayyilu....BJ, TRS, PK, Jagan......
 
తెలంగాణలో కూటమిదే విజయం! 
కాంగ్రెస్‌-తెదేపాలకు 64, తెరాసకు 42 సీట్లు 
కాంగ్రెస్‌ ఖాతాలోకే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ 
ఛత్తీస్‌గఢ్‌లో భాజపాకు స్వల్ప మొగ్గు 
సి-ఓటర్‌ సర్వేలో వెల్లడి

దిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్‌- తెదేపా కూటమి  విజయం సాధిస్తుందని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. ఈ కూటమికి 64 సీట్లతో స్పష్టమైన మెజారిటీ వస్తుందని  సి-ఓటర్‌ సర్వే అంచనా వేసింది. రాజస్థాన్‌ను కాంగ్రెస్‌ పార్టీ 145 సీట్ల భారీ ఆధిక్యంతో సొంతం చేసుకుంటుందనీ, మధ్యప్రదేశ్‌ను సైతం సాధారణ ఆధిక్యంతో తన ఖాతాలో వేసుకుంటుందని సర్వేలో తేలింది. హోరాహోరీ పోరు సాగుతున్న ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం భాజపాకు స్వల్ప మొగ్గున్నట్లు ఈ సర్వే గుర్తించింది.

తెలంగాణలో కూటమికి 33.9 శాతం ఓట్లు 
తెలంగాణలో కాంగ్రెస్‌- తెదేపా కూటమికి 33.9 ఓట్ల శాతంతో 64 సీట్లు, తెరాసకు 29.4 శాతం ఓట్లతో 42 సీట్లు వస్తాయని అంచనా. భాజపాకు 4, ఇతరులకు 9 సీట్లు దక్కనున్నట్లు సర్వే తెలిపింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉండాలనుకున్న వారు 42.90 శాతం మంది కాగా జానారెడ్డికి 22.60 శాతం మంది మొగ్గు చూపారు. రేవంత్‌రెడ్డికి 7.20 శాతం మంది మద్దతు పలికారు. ఇతరుల వైపు మొగ్గుచూపిన వారు, తేల్చుకోలేనివారు కలిపి 27.30 శాతంగా ఉన్నారు. 
* రాజస్థాన్‌: భాజపా 39.7 శాతం ఓట్లశాతంతో 45 సీట్లు మాత్రమే దక్కించుకోనుంది. కాంగ్రెస్‌ 47.9 ఓట్ల శాతంతో 145 సీట్లు హస్తగతం చేసుకోనుంది. 
* మధ్యప్రదేశ్‌: ఇక్కడ అధికార భాజపా 41.5 శాతం ఓట్లతో 107 సీట్లు గెలవనుండగా, కాంగ్రెస్‌ 42.3 శాతం ఓట్లతో 116 సీట్లు పొందనుంది. 
* మిజోరం: ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని తేలింది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ 17 సీట్లతో ముందంజలో ఉండగా, కాంగ్రెస్‌కు 12, జోరం పీపుల్స్‌ మూమెంట్‌కు 9 సీట్లు దక్కనున్నాయి. 
* ఛత్తీస్‌గఢ్‌: ఇక్కడ కాంగ్రెస్‌కు 42.2 శాతం ఓట్లతో 41 సీట్లు, ఇతరులకు 16.2 శాతం ఓట్లతో 6 సీట్లు దక్కనున్నాయి. అధికార భాజపా 41.6 శాతం ఓట్లతో 43 సీట్లు సొంతం చేసుకోనుంది. 
* ఈ సర్వేను ఏబీపీ న్యూస్‌, రిపబ్లిక్‌ టీవీ కోసం నవంబర్‌ రెండో వారంలో చేపట్టారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 67,848 మంది అభిప్రాయాలు సేకరించారు. తెలంగాణలో 13,624 మంది, రాజస్థాన్‌లో 13,377 మంది, మధ్యప్రదేశ్‌లో 25,745 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 13,911 మంది, మిజోరంలో 1191 మంది అభిప్రాయాలు తీసుకున్నారు.

నాలుగు రాష్ట్రాల్లో మాదే విజయం 
‘‘సి-ఓటర్‌ సర్వే ఉత్సాహపరిచేలా ఉంది.  ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణల్లో కాంగ్రెస్‌ బ్రహ్మాండమైన గెలుపు సాధించబోతోంది.  తెలంగాణలో భాజపా తాబేదారు తెరాసను మట్టికరిపిస్తాం. మిజోరంను తిరిగి కైవసం చేసుకుంటాం’’ అని కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా చెప్పారు.

మూడు చోట్లా మళ్లీ గెలుస్తాం 
‘‘మేం అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో తిరిగి గెలవడమే కాకుండా, తెలంగాణ, మిజోరం ప్రభుత్వాల్లో భాగస్వాములం అవుతాం. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో భాజపా భారీ విజయం సాధిస్తుంది’’ అని భాజపా అధికార ప్రతినిధి బిజయ్‌ సోన్‌కర్‌ శాస్త్రి చెప్పారు.

9hyd-pol1a.jpg
Link to comment
Share on other sites

Dora all the way to be CM, 3rd ront petti PM kuda avuthadu 
ala avvapaothe, ee DB lo vunna musugu Pink Pnathers ki nidaralu pattavu
Inka AP lo porapatuna nakka gadu gelisthe sachipotharemo 
 like Jagan anna gelisthe naaku nidra pattanattu 
JAI DORA 
JAI JAGAN 
JAI NAKKA 
 

Link to comment
Share on other sites

sariga chadavandi pulkas. People still think KCR is the best option for CM, more than 42% undi akkada. 

 

However, present caretaker Chief Minister K Chandrasekhar Rao continues to be the top contender for his post. While 42.9 percent of those polled said that KCR was their preferred CM candidate, Congress leader K Jana Reddy got 22.6% of the votes. Revanth Reddy, a firebrand leader who defected from the TDP to the Congress earlier this year, also received 7.20 percent of the votes, while 27.30 percent were undecided.

 

https://www.thenewsminute.com/article/win-mahakutami-telangana-cvoter-poll-predicts-64-seats-alliance-42-trs-91302

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...