Jump to content

నాకు రాహుల్ ద్రావిడే ఇష్టం.. అంటున్న..


r2d2

Recommended Posts

thumb.jpg

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సక్సెస్లతో టాప్ హీరోయిన్ గా పూజా హెగ్డే టైమ్ నడుస్తుంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇక త్వరలోనే కోలీవుడ్ లో కూడా అరంగేట్రం చేయనుందని తెలుస్తుంది. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లకు బ్రేక్ పడటంతో.. స్వీయ నిర్బంధంలో ఉన్న పూజ ఇంట్లో సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తుందట. ఇక ఖాళీగా ఉండటం ఎందుకని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో కాసేపు ముచ్చటిస్తుంది. ఈ సందర్భంగా లైవ్ చాట్ లో అభిమానులతో మాట్లాడుతూ బుట్టబొమ్మ తన ఫేవరేట్ విషయాలను షేర్ చేసుకుంది. సినిమాలతో పాట సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది పూజ.
 
లైవ్ చాట్ లో ఓ అభిమాని.. మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? అని అడిగాడు. తనకు ఇష్టమైన క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అని పూజా తెలిపింది. ఈ తరంలో ఎంతమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా అతడికి సాటిరారని రాహుల్ ని గాల్లోకి లేపేస్తోంది అమ్మడు. ది వాల్ ఓ కూల్ అండ్ క్లాసిక్ ప్లేయర్ అని చెప్తుంది. ఇక ప్రస్తుత ఆటగాళ్లలో కెప్టెన్ కూల్ ధోని.. ఇంకా కేఎల్ రాహుల్ ఆటతీరు నచ్చుతుందని బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇక ఎంత బిజీగా ఉన్నా టీమిండియా మ్యాచ్ జరుగుతుంటే కనీసం స్కోర్ తెలుసుకోవడానికైనా ప్రయత్నిస్తానని క్రికెట్ పట్ల తనకున్న ఇష్టం గురించి తెలిపింది పూజా. ఇక మరో అభిమాని.. మీరు నటి అవ్వకపోయి ఉంటే ఏం చేసేవారని అడిగాడు. ఆ ప్రశ్నకు స్టైలిష్ ఫొటోగ్రాఫర్ అయ్యేదాన్ని అంటూ నవ్వుతూ బదులిచ్చింది సుందరి. పూజా ప్రస్తుతం తెలుగులో డార్లింగ్ ప్రభాస్ అఖిల్ సినిమాలలో నటిస్తుంది
Link to comment
Share on other sites

ollipoya batch ante baga istam ra kulfi gaa..neeku evaro baga venka nundi pettaru anukunta tega peel avutunnavu😀ninne ra labor jathi vedhava antundii...ONION batch

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...