southyx Posted January 7 Report Share Posted January 7 యూట్యూబ్‌తో 400 కోట్లు సంపాదించాడు! చేతినిండా డబ్బు ఉన్నవారే జీవితంలో విజయం సాధించగలరని ఎవరైనా అంటే.. అది తప్పే. మెదడులో ఒక ఆలోచన, గుండెల నిండా ధైర్యం, లక్ష్యంపై గురి ఉన్న వారు నిరుపేదలైనప్పటికీ ఎప్పుడో ఒకసారి గెలుపు జెండా ఎగరేస్తారు. మనదేశంలో టాప్ టెక్ గురుగా పేరు సంపాదించిన గౌరవ్ జీవితమే దీనికి ఉదాహరణ. వంద కోట్ల విలువైన ఇల్లు.. గడప దాటి ఆవరణలోకి వస్తే బెంజ్, రోల్స్‌రాయిస్, రేంజ్‌రోవర్, పోర్షే.. వంటి అతిఖరీదైన కార్లు ఇరవై దాకా కనిపిస్తాయి. ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గరా బంగారు ఐఫోన్... చెబుతుంటేనే ఎంతటి విలాసవంతమైన జీవితాలో వారివి అనిపిస్తుంది కదా. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ అవన్నీ సంపాదించుకున్న గౌరవ్ చౌధురిది ఒకప్పుడు పేద కుటుంబం. రెండున్నర కోట్లమందికి నెట్లో టెక్ విశేషాలు బోధిస్తూ దాదాపు నాలుగొందల కోట్ల రూపాయలు ఆర్జించిన గౌరవ్ గెలుపు పాఠమిది! చేతినిండా డబ్బు ఉన్నవారే జీవితంలో విజయం సాధించగలరని ఎవరైనా అంటే.. అది తప్పే. మెదడులో ఒక ఆలోచన, గుండెల నిండా ధైర్యం, లక్ష్యంపై గురి ఉన్న వారు నిరుపేదలైనప్పటికీ ఎప్పుడో ఒకసారి గెలుపు జెండా ఎగరేస్తారు. మనదేశంలో టాప్ టెక్ గురుగా పేరు సంపాదించిన గౌరవ్ జీవితమే దీనికి ఉదాహరణ. రాజస్థాన్‌లోని ఆజ్మేర్లో ఓ చిన్న రేకుల ఇంట్లో ఉంటూ వీధి చివరన కిరాణా షాపు నడిపేవాడు గౌరవ్ తండ్రి. వాళ్ల బంధువులేమో ఖరీదైన బట్టలు వేసుకుని కార్లలో తిరిగేవారు. వాళ్లలా మనకెందుకు లేవని తల్లిని అడిగేవాడు గౌరవ్. తమకీ, బంధువులకీ మధ్య అంతరానికి కారణం డబ్బే అన్న సంగతి అతనికి అర్థమైంది. రెండు చేతులా సంపాదించి ఆ అడ్డుగోడను బద్దలుకొట్టాలని తెలిసీ తెలియని వయసులోనే నిర్ణయించుకున్నాడు. కిరాణాషాపు మీద వచ్చేది సరిపోక గౌరవ్ తండ్రి సంపాదన కోసం దుబాయ్ వెళ్లాడు. తల్లితో కలిసి ఆ దుకాణం నడుపుతూనే స్కూలుకెళ్లిన గౌరవ్‌కి ఇంటర్ కొచ్చేసరికి స్నేహితుల వల్ల టెక్నాలజీ మీద ఆసక్తి కలిగింది. క్లాస్‌లు మానేసి మరీ తెలిసిన వాళ్ల దగ్గర కోడింగ్ నేర్చుకునేవాడు. ‘కాలేజీ ఎగ్గొట్టి ఏదేదో నేర్చుకుంటున్నా’వంటూ అతని తల్లిదండ్రులు కోప్పడేవారు. ఆ సమయంలో కోడింగ్ గురించి అమ్మానాన్నలకు చెప్పినా అర్థమయ్యేది కాదు. సామాన్యులకూ అర్థమయ్యేలా.. గౌరవ్ ఆసక్తిని లెక్చరర్లు గుర్తించి ఎలక్ట్రానిక్స్ చదువుకోమని ప్రోత్సహించారు. అతని తండ్రి మాత్రం ఇంటర్ అయ్యాక ఏదో ఒక ఉద్యోగంలో పెట్టొచ్చని కొడుకును దుబాయ్ తీసుకెళ్లాడు. అక్కడ పని చేయడానికి ఇష్టపడని గౌరవ్ చదువు మీద దృష్టి పెట్టి బిట్స్ పిలానీలో మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో సీటు సంపాదించి దుబాయ్ క్యాంపస్‌లో చేరాడు. ఆ సమయంలో గౌరవ్‌కి లెక్చరర్లూ, స్నేహితులూ ఆర్థికంగా సాయపడ్డారు. దానికి తోడు పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి అతను ఫీజులు కట్టుకునేవాడు. 2012లో చదువు పూర్తి చేసిన తరవాత కొంత కాలం దుబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్స్ సర్వీస్ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో తనకొచ్చిన రకరకాల సందేహాలను తీర్చుకోవడానికి యూట్యూబ్‌లో వీడియోల మీద ఆధారపడేవాడు. ఆ క్రమంలోనే తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాలనుకున్నాడు. మూడేళ్లు పనిచేసి అప్పులన్నీ తీర్చాక 2015లో ఉద్యోగం మానేసి ‘టెక్నికల్ గురూజీ’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ని ప్రారంభించాడు. దాని ద్వారా మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఫోన్లూ, ల్యాప్‌టాప్‌లూ, కార్ల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అర్థం కాని సాంకేతిక విషయాలను సైతం సింపుల్ హిందీలో వివరించడం అతని ప్రత్యేకత. కొత్తగా వచ్చే ఫోన్లూ- వాటి ప్రత్యేకతలూ, బ్యాంకింగ్ మోసాలూ, డిజిటల్ స్కామ్‌లూ వంటి వాటి గురించి గౌరవ్ చెప్పే విషయాలన్నీ సామాన్యులకూ చక్కగా అర్థమవుతాయి. అందుకే గౌరవ్ ఛానల్ జనాల్లోకి త్వరగా వెళ్లింది. క్రమంగా యూట్యూబ్‌లో సబ్స్క్రైబర్లతోపాటు ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది. దేశంలోనే టాప్... ప్రస్తుతం రెండున్నర కోట్ల మంది సబ్స్క్రైబర్లతో దేశంలోనే అత్యధికమంది చందాదారులున్న టెక్ యూట్యూబర్‌గా గౌరవ్‌కి గుర్తింపు ఉంది. యూట్యూబ్‌లో రోజూ ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తుంటాడు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను ప్రతి ఆదివారం వివరిస్తుంటాడు. యూట్యూబ్ ద్వారా ఇప్పటికే దాదాపు రూ.400 కోట్లు సంపాదించిన గౌరవ్ ప్రతినెలా కోటిరూపాయల ఆదాయం కళ్లజూస్తున్నాడు. చిన్నతనంలో తమకు ఏమేమి లేవని ఫీలయ్యాడో అవన్నీ సమకూర్చుకున్నాడు. దిల్లీ, దుబాయ్‌ల్లో వందల కోట్ల విలువ చేసే ఇళ్లు కట్టుకున్నాడు. పోర్షే, రోల్స్‌రాయిస్, రేంజ్‌రోవర్, బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, థార్.. ఇలా దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఖరీదు చేసే సరికొత్త మోడల్ కార్లు కొనేశాడు. ఫోన్లు కూడా ప్రత్యేకంగా ఉండాలని రష్యాలో బంగారు ఐఫోన్లను కస్టమైజ్డ్గా తయారు చేయించుకున్నాడు. ప్రతి విషయంలోనూ ప్రత్యేకంగా ఆలోచించే గౌరవ్ ఆస్తులే కాదు, అతనికి వచ్చిన ఆదరణ కూడా గొప్పదే. వన్‌ప్లస్, శామ్సంగ్, గూగుల్ సంస్థలు సైతం గౌరవ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి తమ టెక్నాలజీ వివరాలను అతనితో పంచుకున్నాయి. తమ ఆఫీసుల్లో వీడియో చేసుకోవడానికి గౌరవ్‌కు అనుమతిచ్చాయి. ఆపిల్ సీఈఓ టిమ్‌కుక్‌ను కలవాలని కలగనేవారు ఎందరో ఉంటారు. గౌరవ్ వీడియోలను చూసిన టిమ్ కుక్ స్వయంగా గౌరవ్‌ను కలవాలనుకున్నాడు. ఈ ఏడాది మొదట్లో ముంబయిలో ప్రారంభమైన ఆపిల్ స్టోర్ ప్రారంభోత్సవానికి ఆయనే నేరుగా గౌరవ్‌ను ఆహ్వానించడం విశేషం. అలానే కొన్ని దినపత్రికలు గౌరవ్‌తో టెక్ కాలమ్లూ, టీవీ ఛానళ్లు షోలూ చేయిస్తున్నాయి. కొన్ని వెబ్సైట్లు అతని వీడియోలు కొని పోస్ట్ చేసుకుంటున్నాయి. ‘కలలు కనండి.. వాటిని నెరవేర్చుకోవడానికి కష్టపడండి’ అని కదా డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పింది. గౌరవ్ దాన్ని చేసి చూపించాడు. చిన్నతనంలో అమ్మ ఒడిలో పడుకుని కన్న కలలన్నింటినీ కృషితో నిజం చేసుకున్నాడు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.