Jump to content

Elections time ki employees anta ata adukunthnaru jaggadini


psycopk

Recommended Posts

AP JAC: రేపు చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం 

11-02-2024 Sun 18:53 | Andhra
  • ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు
  • అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
  • రేపు మధ్యాహ్నం సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు
 
AP Govt invites Employees associations leaders for talks

లక్షలాది మంది నిత్యం ap7am.com ను సందర్శిస్తారు. మరి మీరు? 👍

ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయానికి రావాలని పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో, ఉద్యోగుల పెండింగ్  సమస్యలపై చర్చించాలని మంత్రుల బృందం నిర్ణయించింది. 

ప్రభుత్వం తమకు రూ.6,700 కోట్లు బకాయిలు పడిందని, గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నాలుగు డీఏలు, సరెండర్ లీవులు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Link to comment
Share on other sites

AP JAC: సమ్మెకు సై... ఏపీ జేఏసీ అధ్యక్షతన 104 ఉద్యోగ సంఘాల కీలక సమావేశం 

11-02-2024 Sun 18:08 | Andhra
  • ఉద్యమ శంఖారావం పోస్టర్ విడుదల చేసిన జేఏసీ నేతలు
  • ఉద్యమ కార్యాచరణ వెల్లడించిన బండి శ్రీనివాసరావు
  • ఈ నెల 14 నుంచి ఉద్యమం
  • ఈ నెల 27న ఛలో విజయవాడ
  • ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె
 
AP JAC announces action plan

లక్షలాది మంది నిత్యం ap7am.com ను సందర్శిస్తారు. మరి మీరు? 👍

ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్రంలోని 104 ఉద్యోగ సంఘాల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ నేతలు  ఉద్యమ శంఖారావం పోస్టర్ ను ఆవిష్కరించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు ఉద్యమ  కార్యాచరణ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానంపై ఉద్యమ కార్యాచరణకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 

"ఈ నెల 14న నల్ల బ్యాడ్జీలు ధరించి వినతి పత్రాలు అందిస్తాం. ఈ నెల 15, 16న భోజన విరామంలో పాఠశాలల్లో నిరసన తెలుపుతాం. ఈ నెల 17న మండల కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడతాం. ఈ నెల 20న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తాం. ఈ నెల 21 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో పర్యటిస్తాం. ఈ నెల 27న ఛలో విజయవాడ చేపడతాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఏ క్షణమైనా సమ్మెకు దిగుతాం" అని బండి శ్రీనివాసరావు వివరించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...