Jump to content

ee lekkana mee kalvakuntla family ni kalavalao thokali... antuna halwa


psycopk

Recommended Posts

Revanth Reddy: నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: కల్వకుంట్ల కవిత

08-03-2024 Fri 20:42 | Telangana
  • రేవంత్ రెడ్డి రేసు గుర్రమేమీ కాదని... గుడ్డి గుర్రమేనని వ్యాఖ్య  
  • రేవంత్ రెడ్డి మూణ్ణెళ్ల ముఖ్యమంత్రి అని ఎద్దేవా
  • రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారని విమర్శ
Kavitha fires at cm revanth reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేసు గుర్రమేమీ కాదని... గుడ్డి గుర్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి మూణ్ణెళ్ల ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళకు రావాలని... గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారన్నారు.

ఓ అమ్మాయి చనిపోతే రాజకీయానికి వాడుకున్నారని... కోర్టు తీర్పు పేరు చెప్పి రేవంత్ తప్పించుకున్నారన్నారు. జీవో 3 నిజమైతే 30వేల ఉద్యోగాల్లో ఎంత రిజర్వేషన్లు అమలు చేశారో చెప్పాలన్నారు. నిరుద్యోగులు డైలమాలో ఉన్నారన్నారు. నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో మహిళలతో పెట్టుకున్న వారెవరూ బాగుపడ్డ దాఖలాలు లేవన్నారు. తమ పోరాటం మహిళల కోసమే కానీ పురుషులకు అన్యాయం చేయాలని కాదని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

KTR: ఆకాశంలో సగం కాదు.. 'ఆమే' ఆకాశం: కేటీఆర్

08-03-2024 Fri 17:07 | Telangana
  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేటీఆర్ శుభాకాంక్షలు
  • మహిళా సంక్షేమంలో యావత్ దేశానికే బీఆర్ఎస్ పాలన ఆదర్శమని వ్యాఖ్య
  • మహిళలకు కేసీఆర్ కొండంత అండగా నిలిచారన్న కేటీఆర్
Woman is half in sky says KTR

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఏమేం చేసిందో వివరించారు.

మహిళా సంక్షేమంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన యావత్ భారత దేశానికే ఆదర్శమని కేటీఆర్ అన్నారు. అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వ వరకు అందరినీ బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడిందని చెప్పారు. గర్భిణీలకిచ్చిన న్యూట్రిషన్ కిట్లు ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి మెట్లు అని అన్నారు. ఆడబిడ్డ పుట్టిందంటే.. ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టేనని చెప్పారు. కేసీఆర్ కిట్ లో పాటు అందిన 13 వేలు.. ప్రతి పుట్టిల్లు ఎప్పటికీ మరువలేని మేలు అని అన్నారు. 

లక్ష్మీ కటాక్షమే కాదు... తెలంగాణ ఆడబిడ్డలకు సరస్వతి కటాక్షం అందించిన ఘనత మనకే సొంతమని కేటీఆర్ చెప్పారు. కార్పొరేట్ కు దీటైన గురుకులాలతో పేద మధ్య తరగతి తల్లిదండ్రుల కలలు సాకారమయ్యాయని తెలిపారు. ఆడబిడ్డలకు రక్షణ కవచంగా నిలిచిన “షీటీమ్స్” ఒక సంచలనమని చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు నవ శకం అని అన్నారు. కల్యాణలక్ష్మి కేవలం పథకమే కాదని, ఒక గొప్ప సంప్రదాయమని చెప్పారు.  

"గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్ల దూరం నడిచిన మహిళల కష్టాలను భగీరథతో శాశ్వతంగా తీర్చాం. అమ్మఒడి వాహనాలపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. మహిళా సంక్షేమంలో నాటి పాలనకు ఎదురు లేదని చెప్పారు. భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా.. ఒంటరి మహిళలకు తండ్రిలా... ఆడబిడ్డలకు మేనమామలా.. అవ్వలకు పెద్దకొడుకులా... కొండంత అండగా నిలిచిన ఏకైక పాలకుడు.. మన కేసీఅర్ గారు" అని అన్నారు.  

పదేళ్ల పాలనలో సముద్రమంత సంక్షేమాన్ని అందించి, ఆడబిడ్డల సమగ్ర అభివృద్ధికి బంగారు బాటలు వేసిన బీఆర్ఎస్ తరపున యావత్ నారీ శక్తికి హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

 

mee ayyya cabinet lo enta mandi ladies unnaru ra ... ee yedava muchatlau ani cheptav

Link to comment
Share on other sites

K Kavitha: సోనియా, ప్రియాంక గాంధీలు పార్లమెంట్‌కు వెళితే... తెలంగాణ బిడ్డలు వంటింట్లో కూర్చోవాలా?: కవిత ఆగ్రహం

08-03-2024 Fri 16:28 | Telangana
  • ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తోన్న జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్
  • ఆడబిడ్డల ఉద్యోగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదని విమర్శ
  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆందోళన చేసే పరిస్థితికి తీసుకు వచ్చారని ఆగ్రహం
BRS MLA Kavitha demand for cancellation of go number 3

ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ఆమె కూతురు ప్రియాంకగాంధీలు ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్‌కు వెళితే తెలంగాణ ఆడబిడ్డలు మాత్రం వంటింట్లో కూర్చోవాలా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తోన్న జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో ఆమె ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగారు.

సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఆడబిడ్డల ఉద్యోగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదని విమర్శించారు. ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తోన్న ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆందోళన చేసే పరిస్థితికి తీసుకు వచ్చారని మండిపడ్డారు. మహిళలకు న్యాయం జరిగే జీవో నెంబర్ 41ను వెంటనే అమలు చేయాలన్నారు.

 

mee ayyaya eni seats istunado kuda chepu.. yedava sodi enduku

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...