Jump to content

వైసీపీ పునాదులు వివేకా, కోడికత్తి రక్తంతో నిండి ఉన్నాయి.. వైఎస్ భారతికి ఓ విన్నపం: సునీత


psycopk

Recommended Posts

YS Sunitha Reddy: వైసీపీ పునాదులు వివేకా, కోడికత్తి రక్తంతో నిండి ఉన్నాయి.. వైఎస్ భారతికి ఓ విన్నపం: సునీత 

15-03-2024 Fri 14:51 | Andhra
  • సాక్షి పత్రికలో తమపై నిందలు వేస్తున్నారని సునీత మండిపాటు
  • మీరు ప్రభుత్వంలో ఉండి మాపై ఆరోపణలు చేయడం ఏమిటని మండిపాటు
  • వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు బయటకు రావాలని సూచన
 
The foundation of YSRCP filled with Viveka and kodi kathi blood says YS Sunitha

తన తండ్రి వైఎస్ వివేకా జీవితాంతం వైఎస్సార్ కోసమే పని చేశారని వివేకా కూతురు సునీత చెప్పారు. ఉమ్మడి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారని తెలిపారు. ఫ్యాక్షన్, హింసను తగ్గించాలని ఆలోచించేవారని... అలాంటి వ్యక్తిని దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా మనకు దూరమై ఐదేళ్లు గడిచిపోయిందని... హంతకులకు ఇంత వరకు శిక్ష పడలేదని అన్నారు. కడపలో జరిగిన వివేకా సంస్మరణ సభలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్ సీఎం అయిన తర్వాత కూడా హంతకులకు శిక్ష పడలేదని సునీత అన్నారు. వివేకాను చంపిన వారికి, చంపించిన వారికి శిక్ష పడేలా చేసే బాధ్యత జగన్ పై ఉందని చెప్పారు. అంతఃకరణశుద్ధి అంటే ఏమిటో మీకు తెలుసా? అని జగన్ ను ప్రశ్నించారు. ఈ నేరాన్ని మేము చేశామని చెప్పడం మీకు ఎబ్బెట్టుగా లేదా? అని అడిగారు. మీరు ప్రభుత్వంలో ఉండి మాపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వివేకా హంతకులను పట్టిస్తే రూ. 5 లక్షలు ఇస్తామని సీబీఐ ప్రకటించిందని.. మమ్మల్ని పట్టించి ఆ బహుమతిని అందుకోండని అన్నారు. 

సాక్షి పత్రికలో తమపై నిందలు వేస్తూ తప్పుడు కథనాలు రాస్తున్నారని... పదేపదే తమపై ఆరోపణలు చేయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అని సునీత ప్రశ్నించారు. సాక్షి ఛైర్ పర్సన్ భారతికి ఓ విన్నపం చేస్తున్నానని... తమకు సంబంధించి మీ వద్ద ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండి, ఆధారాలు ఉండి పోలీసులకు ఇవ్వకపోవడం నేరమని చెప్పారు. వ్యక్తిత్వం మీద బురద చల్లడం దారుణమని అన్నారు. 

వైసీపీ పునాదులు రక్తంతో నిండి ఉన్నాయని సునీత అన్నారు. వివేకా రక్తం, కోడికత్తి రక్తం వైసీపీ పునాదుల్లో ఉన్నాయని చెప్పారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బయటకు రావాలని కోరారు. వైసీపీ నుంచి బయటకు రాకపోతే ఆ పాపం మిమ్మల్ని చుట్టుకుంటుందని చెప్పారు

  • Upvote 1
Link to comment
Share on other sites

YS Sharmila: బంధువులే హత్య చేశారు.. జగన్ అన్న ఇంతగా దిగజారుతాడని అనుకోలేదు: వివేకా స్మారక సభలో షర్మిల తీవ్ర వ్యాఖ్యలు 

15-03-2024 Fri 13:35 | Andhra
  • వివేకా వర్ధంతి సందర్భంగా కడపలో సంస్మరణ సభ
  • బాబాయ్ ను చంపిన వారికి ఇంత వరకు శిక్ష పడలేదని ఆవేదన
  • తోబుట్టువుల కోసం జగన్ ఏం చేశారని ప్రశ్న
 
Relatives killed YS Vivekananda Reddy says Sharmila

చిన్నాన్న వైఎస్ వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఐదేళ్లు గడుస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. బాబాయ్ శరీరంపై ఎన్నో గొడ్డలి పోట్లు ఉన్నాయని, దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగి ఐదేళ్లు పూర్తవుతున్నా ఇంత వరకు హంతకులకు శిక్ష పడలేదని అన్నారు. చిన్నాన్న మరణంతో చిన్నమ్మ, సునీత అందరి కంటే ఎక్కువ నష్టపోయారని చెప్పారు. వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ జరుగుతోంది. ఈ సభకు ఏపీసీసీ చీఫ్ షర్మిల, వివేకా కూతురు సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో పాటు పలువురు నేతలు, ఆత్మీయులు హాజరయ్యారు.

 ఈ సందర్భంగా షర్మిల భావోద్వేగంతో మాట్లాడారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతను టార్గెట్ చేసి ఎంతో వేధించారని షర్మిల మండిపడ్డారు. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా వారిపైనే ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులను రక్షిస్తున్నారని విమర్శించారు. బంధువులే హత్య చేశారని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని తెలిపారు. హత్య చేసిన వారికి, చేయించిన వారికి ఇంత వరకు శిక్షపడలేదని చెప్పారు. హత్యకు గురైన చివరి క్షణం వరకు బాబాయ్ వైసీపీ కోసమే పని చేశారని అన్నారు. జగనన్న ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని చెప్పారు. సాక్షిలో పైన వైఎస్ ఫొటో ఉంటుందని... కింద వైఎస్ తమ్ముడి వ్యక్తిత్వ హననం ఉంటుందని మండిపడ్డారు. 

అద్దం ముందు నిలబడి మీ మనస్సాక్షి ఏం చెపుతోందో వినాలని షర్మిల అన్నారు. తన తోబుట్టువుల కోసం వైఎస్ ఏం చేశాడో మీకు తెలియదా? అని ప్రశ్నించారు. వైఎస్ వారసుడిగా తోబుట్టువుల కోసం మీరు ఏం చేశారని జగన్ ను నిలదీశారు. ఐదేళ్లయినా చిన్నాన్న ఆత్మకు శాంతి కలగలేదని చెప్పారు. 

సునీత, తాను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని, కలిసి చదువుకున్నామని షర్మిల తెలిపారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు తాను అండగా ఉంటానని చెప్పారు. రాజకీయాల కోసమో, అధికారం కోసమో తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని... వివేకా హంతకులకు శిక్ష పడాలని అన్నారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

 

Devineni Uma: నాకు ప్రజాతీర్పు కావాలి అంటున్న నీ చెల్లికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా జగన్?: దేవినేని ఉమ 

15-03-2024 Fri 12:30 | Andhra
  • హూ కిల్డ్ బాబాయ్ అంటే ఐదేళ్లుగా సమాధానం లేదన్న దేవినేని ఉమ
  • వివేకా హత్య గురించి జగన్ కు ముందే తెలుసని వ్యాఖ్య
  • న్యాయం అడిగితే నేరం మోపాలనుకున్నారని విమర్శ
 
Jagan do you have dare to answer your sister asks Devineni Uma

హూ కిల్డ్ బాబాయ్ అంటే ఐదేళ్లుగా సమాధానం లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. బాబాయిని చంపి తప్పుడు ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందారని సీఎం జగన్ పై మండిపడ్డారు. అధికార దుర్వినియోగంతో కేసు నీరు కార్చాలని చూశారని అన్నారు. హత్య గురించి జగన్ రెడ్డికి ముందే తెలుసని.. హంతకులు మన మధ్య ఉన్నా గుర్తించలేకపోయామని.. న్యాయం అడిగితే నేరం మోపాలనుకున్నారని దుయ్యబట్టారు. జగనన్న పాలనలో న్యాయం జరగదని అన్నారు. నాకు ప్రజాతీర్పు కావాలి అంటున్న నీ చెల్లెలు సునీతకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? అని జగన్ ను ప్రశ్నించారు. మరోవైపు వివేకా ఐదో వర్ధంతిని కుటుంబ సభ్యులు జరుపుకున్నారు. పులివెందులలో వివేకా సమాధి వద్ద ఆయనకు వైఎస్ సునీత నివాళి అర్పించారు. 

 

Link to comment
Share on other sites

 

YS Vivekananda Reddy: వైఎస్ వివేకా సమాధి వద్ద సునీత నివాళి.. వర్ధంతి సభలో ప్రసంగించనున్న షర్మిల 

15-03-2024 Fri 12:07 | Andhra
  • పులివెందులలోని ఘాట్ వద్ద సునీత, కుటుంబ సభ్యుల నివాళి
  • కడపలోని జయరాజ్ గార్డెన్ లో వివేకా వర్ధంతి సభ
  • సునీత, షర్మిల కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం
 
YS Sunitha pays tributes to YS Vivekananda Reddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పులివెందులలోని వివేకా ఘాట్ వద్ద ఆయన కుమార్తె సునీత నివాళి అర్పించారు. తన భర్త రాజశేఖరరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్ కు ఆమె వెళ్లారు. సమాధిపై పూలమాల ఉంచి అంజలి ఘటించారు. క్రైస్తవ మతాచారాల ప్రకారం ప్రేయర్ చేశారు. 

మరోవైపు, కడపలోని జయరాజ్ గార్డెన్ లో ఈరోజు వివేకా వర్ధంతి సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా భార్య సౌభాగ్యమ్మ, సునీతతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, వివేకా ఆత్మీయులు హాజరు కానున్నారు. ఈ సభలో షర్మిల, సునీత కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. సునీత రాజకీయ భవితవ్యంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
20240315fr65f3ec8fdb659.jpg

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...