Jump to content

ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు... షెడ్యూల్ ఖరారు


psycopk

Recommended Posts

Chandrababu: ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు... షెడ్యూల్ ఖరారు 

24-03-2024 Sun 15:05 | Andhra
  • ఏపీలో మే 13న ఎన్నికలు
  • ఒకే రోజున అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
  • ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు
  • తొలి విడతలో ఈ నెల 27 నుంచి 31 వరకు ప్రచారం
 
Chandrababu will start election campaign from Mar 27

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 27న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుండగా, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. 

చంద్రబాబు 'ప్రజాగళం' పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. 

తొలి విడతలో ఈ నెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 

ఈ నెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 

ఈ నెల 28న రాప్తాడు, కదిరి, శింగనమలలో ఎన్నికల ప్రచారం చేపడతారు. 

ఈ నెల 29న కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. 

ఈ నెల 30న ప్రొద్దుటూరు, మైదుకూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో... ఈ నెల 31న కావలి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 

ఇక, రేపు, ఎల్లుండి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు.

Link to comment
Share on other sites

 

Andhra Pradesh: ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఒకేసారి చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం 

25-03-2024 Mon 07:53 | Andhra
  • మార్చి 27న రాయలసీమలోని సొంత నియోజకవర్గాల నుంచి జగన్, చంద్రబాబు ప్రచారం ప్రారంభం
  • మేమంతా సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర వరకూ జగన్ బస్సు యాత్ర
  • నియోజకవర్గాల వారీగా చంద్రబాబు ప్రచారం
  • రోజుకు 3 నుంచి 4 స్థానాల్లో చంద్రబాబు సభలు, సమావేశాలు 
 
chandrababu Jagan to start election campaign from rayalaseema the same day

ఏపీలో పొలిటికల్ హీట్ రానురాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు నేతలూ రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. 

ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి. దీంతో, ప్రధాన పార్టీల  ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది. ఎల్లుండి నుంచి సీఎం జగన్, చంద్రబాబు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇద్దరు ప్రదాన నేతలు ఒకేసారి ప్రచారం మొదలుపెట్టనుండటం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేసింది. 

జగన్ షెడ్యూల్ ఇదీ..
ఇప్పటికే సిద్ధం యాత్ర పేరిట ప్రజల్లో ఉన్న సీఎం జగన్ ఎల్లుండి నుంచీ మేమంతా సిద్ధం పేరిట ప్రచారం నిర్వహిస్తారు. కడప జిల్లా ఇడుపుల పాయలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఉత్తరాంధ్ర వరకూ కొనసాగుతుంది. 27న ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులు అర్పించి ప్రచారం ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. 28వ తేదీన నంద్యాల లేద ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖీ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 29న యాత్ర కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. 

చంద్రబాబు ప్రచారం ఇలా.. 
మార్చి 27 నుంచి మార్చి 31 వరకూ చంద్రబాబు ప్రచారం కొనసాగనుంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించేలా ప్రచారం షెడ్యూల్‌ సిద్ధమైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూర్ రూరల్ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహిస్తారు. 29న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. 31వ తేదీన కావాలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు చంద్రబాబు పర్యటిస్తారు. నేడు రేపు మాత్రం సొంత నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు.  

 

Link to comment
Share on other sites

8 hours ago, TacoTuesday said:

Modi tho second meeting ekkkada..

vaadu ika ap ki raadu..time waste..25 mp seats already vaadu gelichinattey......

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...