Jump to content

అధికారంలోకి వస్తే తొలిరోజే మెగా డీఎస్సీపై సంతకం చేస్తాం: చంద్రబాబు


psycopk

Recommended Posts

Chandrababu: చేయడానికి పని లేనప్పుడే యువత వ్యసనాలకు బానిసలవుతారు: చంద్రబాబు 

26-03-2024 Tue 15:51 | Andhra
  • కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన
  • యువత భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం
  • తాను ఐటీ ఉద్యోగాలు ఇచ్చానని చంద్రబాబు వెల్లడి
  • ఈ ప్రభుత్వం మటన్ కొట్లలో ఉద్యోగాలు ఇస్తోందని విమర్శలు
 
Chandrababu speech in Kuppam

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నేడు రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కుప్పంలో యువత కోసం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని మండిపడ్డారు. యువతకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. 

తాను యువతకు ఐటీ ఉద్యోగాలు, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు కల్పిస్తే... ఈ ప్రభుత్వం మటన్ కొట్లు, ఫిష్ మార్ట్ ల్లో ఉద్యోగాలు అంటోందని చంద్రబాబు విమర్శించారు. యువతకు చేయడానికి చేతినిండా పనిలేనప్పుడే వారు వ్యసనాల బాట పడతారని, చేయడానికి పనేమీ లేకపోతే ఓ క్వార్టర్ వేసుకుందామని అనుకుంటున్నారని వివరించారు. 

"ప్రపంచం అమితవేగంతో మారిపోతోంది. ఒకప్పుడు కరెంట్ అంటే ఏంటో తెలియదు... ఇప్పుడు ఇంట్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వచ్చింది. మారుతున్న సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలి. తెలుగు యువత బంగారుబాటలో నడవాలి. నేటి యువత వివేకానందుడ్ని ఆదర్శంగా తీసుకోవాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

"రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, పరిశ్రమలు రావడంలేదు. యువతకు ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలేదు, ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. చివరికి ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది... అందుకు గ్రూప్-1 నియామకాల వ్యవహారమే నిదర్శనం. అది ఉద్యోగాలు అమ్ముకోవడం కాదు... యువత భవిష్యత్తునే అమ్మేస్తున్నారు. కష్టపడి చదివే యువత జీవితాలతో వీళ్లు చెలగాటమాడుతున్నారు. జగన్ ను, అప్పటి సర్వీస్ కమిషన్ చైర్మన్ ను ఖబడ్దార్ జాగ్రత్త అని ఇప్పటికే హెచ్చరించాను. కానీ వీళ్లు ఇలాంటి హెచ్చరికలకు భయపడరు. అందుకే, యువత తమ సత్తా ఏంటో ఎన్నికల్లో చూపించాలి" అని పిలుపునిచ్చారు.

  • Haha 2
Link to comment
Share on other sites

Chandrababu Naidu: కుప్పంలో చంద్ర‌బాబు ఇంటింటి ప్ర‌చారం.. అర్చ‌కుడిపై దాడి ఘ‌ట‌న‌ను ఖండించిన టీడీపీ అధినేత‌ 

26-03-2024 Tue 15:17 | Andhra
  • కుప్పంలో ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్న చంద్ర‌బాబు
  • ఈసారి కుప్పంలో చంద్ర‌బాబును ల‌క్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామన్న స్థానికులు
  • అర్చ‌కుల‌పై దాడి చేయ‌డం అనేది హేయ‌మైన చ‌ర్య‌గా పేర్కొన్న చంద్ర‌బాబు
 
TDP Chief Chandrababu Naidu door to door Campaign in Kuppam

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో ప‌ర్య‌టిస్తున్నారు. రెండో రోజు కుప్పం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో క‌లిసి చంద్ర‌బాబు ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకోవ‌డం జ‌రిగింది. త‌మ స‌మ‌స్య‌ల‌ను పేర్కొంటూ వారు ఇచ్చిన విన‌తుల‌ను స్వీక‌రించారు. 

చంద్ర‌బాబుకు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికిన స్థానికులు, ఈసారి కుప్పంలో ల‌క్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. రెండు నెల‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని, ఆ త‌ర్వాత చేప‌ట్ట‌బోయే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చంద్ర‌బాబు స్థానికుల‌కు వివ‌రించ‌డం జ‌రిగింది. 

అర్చ‌కుడిపై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్ర‌బాబు
కాకినాడ‌లోని శివాల‌యంలో అర్చ‌కుడిపై వైసీపీ నేత దాడి ఘ‌ట‌న‌ను చంద్ర‌బాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘ‌ట‌న‌పై ఎక్స్ వేదిక‌గా చంద్ర‌బాబు స్పందించారు. "అర్చ‌కుడు అంటే దేవుడికీ, భ‌క్తుడికీ మ‌ధ్య అనుసంధాన క‌ర్త‌గా భావించి కాళ్ల‌కు మొక్కే సంప్ర‌దాయం మ‌న‌ది. అటువంటి అర్చ‌కుల‌ను భ‌క్తుల ముందు కాలితో త‌న్న‌డం, దాడి చేయ‌డం అనేది హేయ‌మైన చ‌ర్య‌. వైసీపీ నేత‌ల అధికార మ‌దానికి, మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల ప‌ట్ల ప్ర‌భుత్వానికి ఉన్న చిన్న‌చూపున‌కు ఇది నిద‌ర్శ‌నం. ఈ ప్ర‌భుత్వం వ‌చ్చాక కొన్నాళ్లు వ‌రుస‌గా ఆల‌యాల్లోని విగ్రహాల‌పై దాడులు జ‌రిగాయి. ఇప్పుడు ఏకంగా ఆల‌యంలో పూజారుల‌పైనే దాడి చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ చ‌ర్య‌కు పాల్ప‌డిన నిందితుడిపై ప్ర‌భుత్వం వెంట‌నే త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి" అని చంద్ర‌బాబు అన్నారు.

Link to comment
Share on other sites

Chandrababu: వాలంటీర్లలో ఇంజనీరింగ్ చదివినవాళ్లు కూడా ఉన్నారు... వాళ్లకు ఒకటే చెబుతున్నా: చంద్రబాబు

26-03-2024 Tue 17:52 | Andhra
  • కుప్పంలో యువతతో చంద్రబాబు సమావేశం
  • వాలంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చిన టీడీపీ అధినేత
  • వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టీకరణ 
Chandrababu appeals for volunteers

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కుప్పంలో యువతతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయో వారికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వాలంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చారు. వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 

"ఇంజనీరింగ్ చదివిన వాళ్లు కూడా వాలంటీర్లుగా ఉన్నారు. వాళ్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా... మీరు బయటికి రండి. ఇవాళ ఐదు వేలు జీతం తీసుకుంటున్నారు. మీరు ఇంట్లోనే కూర్చుని రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదించే విధానానికి శ్రీకారం చుడతాం" అని చంద్రబాబు వివరించారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా యువత జీవితాలు మెరుగుపరిచే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Chandrababu: ఏ హీరో కూడా ఇంత యాక్టింగ్ చేసి ఉండడు: చంద్రబాబు

26-03-2024 Tue 21:06 | Andhra
  • కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు
  • రాజుపేట వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించిన చంద్రబాబు
  • ఏ డైరెక్టర్ కూడా ఇలాంటి సెట్టింగ్ వేయించి ఉండడని ఎద్దేవా
Chandrababu satires on CM Jagan over Handri Neeva water release fiasco

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రాజుపేట వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించి ఆశ్చర్యపోయారు. గత నెలలో సీఎం జగన్ హంద్రీనీవా నీళ్లు విడుదల చేసిన ఘట్టం ఓ సినిమా చిత్రీకరణను మించిపోయిందని అన్నారు. 

"ఏ డైరెక్టర్ కూడా ఇలాంటి సెట్టింగ్ వేయించి ఉండడు. ఏ హీరో కూడా ఇంత యాక్టింగ్ చేసి ఉండడు. ఒక గేటు, దాని పక్కన ఒక బటన్, గేటు వెనకాల ట్యాంకర్లతో తెచ్చి పోసిన నీళ్లు! జగన్ మోహన్ రెడ్డి వచ్చాడు, హంద్రీనీవా నీళ్లు అన్నాడు, పెద్ద ప్రాజెక్ట్ అన్నాడు. బటన్ నొక్కి, ఫొటోలు దిగి వెళ్లిపోయాడు. కట్ చేస్తే... కాలువలో నీళ్లు ఇంకిపోయాయి. సాయంత్రమే అధికారులు వచ్చి గేట్లు తీసుకుపోయారు... ఇదీ కథ" అంటూ చంద్రబాబు వివరించారు.

Link to comment
Share on other sites

2 minutes ago, vaakel_saab said:

vinevadu VP ayithe emanna chepthadu.. 

jagan chepinavi vini vini ee stage ki vachava samara

Link to comment
Share on other sites

2 hours ago, Android_Halwa said:

Toli roju ae santhakam….

lol…enni pettaledu isonti samthakalu, inagurations…

capacity unna leader... tablet eskoni tadepalli lo tongune yedava anukunava

  • Haha 2
Link to comment
Share on other sites

10 minutes ago, psycopk said:

capacity unna leader... tablet eskoni tadepalli lo tongune yedava anukunava

You mean CBN is capability leni leader ? anuke kada pothu pothu ani egiregiri padutunadu...

capacity endo chusinam...2019 result. Avutalodi balam mida geliche party oka party ae na...

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...