Jump to content

Yenda kalam lo yendina panta nu parisilinchina lafangi


psycopk

Recommended Posts

3 hours ago, psycopk said:

Just diverting people from his daughter case…

Tihar lo suite room icharanta

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

Kcr monna vachadu 200 mandi chacharu annadu… revant simple ga oke aa 200 list ivu annadu .. anta silent… 🤣🤣🤣

4 hours lo list ichindru thatha niku kandlu kanpistaleva oo ippudu pacha Kamerla season nadustundi kada 

  • Haha 1
Link to comment
Share on other sites

 

KCR: నేను పదేళ్లు సీఎంగా ఉన్నా... ఫోన్ ట్యాపింగ్‌పై కచ్చితంగా క్లారిటీ ఇస్తా: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు 

05-04-2024 Fri 20:21 | Telangana
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజానిజాలు బయటకు తీసుకువస్తానన్న కేసీఆర్
  • ఫోన్ ట్యాపింగ్‌పై రెండుమూడు రోజుల్లో స్పందిస్తానన్న బీఆర్ఎస్ అధినేత
  • చవటలు, దద్దమ్మలు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆగ్రహం
 
KCR hot comments on Phone tapping issue

'నేను పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాను... ఫోన్ ట్యాపింగ్‌పై కచ్చితంగా క్లారిటీ ఇస్తాను... అందులోని నిజానిజాలు బయటకు తీసుకువస్తాన'ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించారు. కేసీఆర్ మాట్లాడుతూ... ఈ విషయంపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తానన్నారు. 

విద్యుత్ కొరతపై అధికార కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవర్ షార్టేజ్ ఎందుకు అవుతోంది? అంటే మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, చేతగాని చవటలు అని మండిపడ్డారు. అంతకుముందు ఇదే పరిస్థితి ఉంటే ఏడాదిలో తాము అంతా  క్లియర్ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ వలే పీఆర్ స్టంట్లు చేయలేదన్నారు. అలాంటప్పుడు మేం అసమర్థులం... ప్రభుత్వం నడపడం చేతకాదని అంగీకరించాలన్నారు.  

 

Link to comment
Share on other sites

Telangana: తెలంగాణలో మండుతున్న ఎండలు... బయటకు రావొద్దని హెచ్చరిక 

05-04-2024 Fri 22:28 | Telangana
  • పలుచోట్ల 43 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు
  • పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలు
  • రేపు, ఎల్లుండి వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక
 

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం నాడు నల్గొండ జల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5, కనగల్‌లో 43.4, మాడుగుపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో రేపు, ఎల్లుండి వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలు కూడా రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలో ఎక్కువగా 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయని... ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని, అత్యవసర పరిస్థితుల్లో  బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశముందని తెలిపింది.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. 

ఆదివారం నాడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. 

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...