Jump to content

Gulakaraayi


ntr2ntr

Recommended Posts

1 minute ago, psycopk said:

inko pillodi future nasanam.... 

Meanwhile paytms oka bakara dorikadu ee elections ki ani 

Link to comment
Share on other sites

Just now, ntr2ntr said:

Meanwhile paytms oka bakara dorikadu ee elections ki ani 

paytms ki tdp ki link unte haiga edavochu... ipudu evadi meda padi edavali?? they are unsatisfied like pk 4th wife

Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

paytms ki tdp ki link unte haiga edavochu... ipudu evadi meda padi edavali?? they are unsatisfied like pk 4th wife

Emundi ithanike TDP ki link vundani oka story allithe pola. Etu paytm gorrelu ready ga vuntaaru ga nammadaaniki @3$%

Link to comment
Share on other sites

గులకరాయి కేసులో హైడ్రామా!

Publish Date - Apr 17 , 2024 | 03:10 AM

 

గులకరాయి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుల ఆచూకీ, ఘటనకు సంబంధించిన వీడియోలు అందజేసిన వారికి రూ.2 లక్షల నజరానాను ప్రకటించిన మర్నాడే కేసుతో సంబంధం ఉందంటూ బెజవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లోని వడ్డెర కాలనీకి చెందిన ఐదుగురిని పోలీసులు 

గులకరాయి కేసులో హైడ్రామా!
 

 

 

పోలీసుల అదుపులో ఐదుగురు మైనర్లు

ఒకరు దాడిచేశారు.. మిగతా నలుగురు పక్కన ఉన్నారు.. పోలీసుల లీకులు

అధికారికంగా సమాచారమివ్వని వైనం.. రోడ్డెక్కి తల్లిదండ్రుల నిరసనలు

మా బిడ్డలకు ఏ పాపమూ తెలియదు.. జెండాలు పట్టుకుంటే 200 ఇస్తామన్నారు

నేతల మాటలు విని పిల్లలనూ తీసుకెళ్లాం.. మైనర్ల తల్లిదండ్రుల వెల్లడి

కేసులు పెడతామని పోలీసుల బెదిరింపులు.. దీంతో ఆందోళన విరమణ

మరో ‘కోడి కత్తి’ కేసుగా మారుస్తారేమోనని అనుమానం

 

విజయవాడ, ఏప్రిల్‌ 16 గులకరాయి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుల ఆచూకీ, ఘటనకు సంబంధించిన వీడియోలు అందజేసిన వారికి రూ.2 లక్షల నజరానాను ప్రకటించిన మర్నాడే కేసుతో సంబంధం ఉందంటూ బెజవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లోని వడ్డెర కాలనీకి చెందిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మైనర్లే. వయసు 15-17 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరిలో ఒక బాలుడు సీఎంపై దాడిచేశాడని, మిగతా నలుగురూ అతడి పక్కనే ఉన్నారని పోలీసులు లీకులిస్తున్నారు. అధికారికంగా మాత్రం పెదవివిప్పడం లేదు. ఆ మైనర్ల తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డలకు ఏమీ తెలియదని, పోలీసులు అన్యాయంగా ఇరికిస్తున్నారని వాపోతున్నారు. ఇది మరో కోడికత్తి కేసు అవుతుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

బలిపశువును చేస్తున్నారా?

జగన్‌పై ఈ నెల 13న గులకరాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వడ్డెర కాలనీ నుంచి సోమవారం అర్ధరాత్రి కొంతమందిని, మంగళవారం తెల్లవారుజామున ఇంకొందరిని.. మొత్తం 11 మందిని బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. విచారణ అనంతరం వారిలో ఆరుగురిని ఇళ్లకు పంపేశారు. మిగిలిన ఐదుగురూ వారి అదుపులోనే ఉన్నారు. పోలీసులు ఏదో ఒక రకంగా కేసును చేధించామని చెప్పుకొనేందుకే తమ బిడ్డలపై నెపం మోపుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలన్నీ చూస్తుంటే ఆ ఐదుగురు మైనర్లలో ఒకరిని బలిపశువును చేయబోతున్నారా అన్న సందేహం కలుగుతోంది. వారి తండ్రులు కూలీ పనులకు వెళ్తుంటారు. తల్లులు విజయవాడ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తుంటారు. పిల్లలు కూడా రోజూ ఏదో ఒక పనికి వెళ్తుంటారు. పనుల నుంచి వచ్చిన తర్వాత ఇంటి నుంచి కదలరని.. అలాంటి వారిపై దాడి అభియోగం మోపుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. సోమవారం రాత్రి పిల్లలను తీసుకెళ్లిన పోలీసులు.. మరుసటి రోజు ఉదయం వచ్చి ఐదుగురి కుటుంబాల నుంచి ఒక్కో జత బట్టలు తీసుకెళ్లారు. అదుపులో ఉన్నవారిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఉన్నారు. బాలుర తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. జగన్‌ బస్సుయాత్రతో వచ్చినప్పుడు.. రోడ్డుకు రెండు వైపులా నిలబడి జెండాలు ఊపితే ఒక్కొక్కరికీ రూ.200 చొప్పున ఇస్తామని స్థానిక వైసీపీ నేతలు వడ్డెర కాలనీ వాసులతో బేరం మాట్లాడుకున్నారు. మహిళలకు రూ.200.. పురుషులకు, యువకులకు రూ.200తోపాటు క్వార్టర్‌ మందు బాటిల్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. డాబా కొట్లు సెంటర్‌ నుంచి వడ్డెర కాలనీ ఆర్చ్‌ ప్రాంతం వరకు వారిని నిలబడమన్నారు. ‘పురుషులకు, యువకులకు క్వార్టర్‌ బాటిల్‌ ఇచ్చారు. డబ్బులు మాత్రం ఇవ్వలేదు. డబ్బులొస్తాయన్న ఉద్దేశంతో మాతోపాటు మా పిల్లలనూ తీసుకెళ్లాం. కానీ మేం గానీ, మా పిల్లలు గానీ కాలనీ వద్ద ఉన్న ఆర్చ్‌ దాటి ముందుకు వెళ్లలేదు’ అని బాలుర తల్లులు స్పష్టం చేస్తున్నారు. వివేకానంద స్కూల్‌ వరకు జగన్‌ వెళ్లినప్పుడు ఎంతోమంది జనం ఉన్నారని, అంతమందిలో తమ పిల్లలే దాడి చేశారని ఎలా గుర్తించారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. ‘కేసును బ్రేక్‌ చేశాం’ అని మాత్రమే ముక్తసరిగా జవాబిస్తున్నారు. ఐదుగురిలో ఒక అబ్బాయి దాడి చేయగా, మిగిలినవారు పక్కన ఉన్నారని వారు చెప్పారంటూ మైనర్ల తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. జెండాలు పట్టుకుంటే డబ్బులు ఇస్తామని చెప్పిన వైసీపీ నేతలు.. తమ పిల్లలను పోలీసులు తీసుకెళ్తే ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు. తమ పిల్లలను విడుదల చేయాలని మధ్యాహ్నం నుంచి కాలనీవాసులు రోడ్డెక్కారు. డాబాకొట్లు సెంటర్‌ నుంచి మాకినేని బసవపున్నయ్య స్టేడియంకు వెళ్లే రహదారిపై సుమారు 20 నిమిషాలపాటు నిరసన తెలిపారు. రోడ్డుకు అడ్డంగా కర్రీ పాయింట్‌ కేబిన్‌లను పెట్టి ధర్నా చేశారు. పోలీసులు వచ్చి ఎన్నికల కోడ్‌ ఉందని, కేసులు పెడతామని బెదిరించడంతో ఆందోళన విరమించారు.

 

సొల్యూషన్‌ తాగుతున్నారని చెప్పారు

పోలీసులు సోమవారం రాత్రి మా ఇంటికొచ్చారు. మా అబ్బాయిని తీసుకెళ్తామని చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే.. మత్తు కలిగించే సొల్యూషన్‌ తాగుతున్నారని, విచారణ చేసి పంపేస్తామన్నారు. మీ పిల్లాడికి ఏమీకాదని చెప్పారు. రెండుసార్లు వెళ్లినా, స్టేషన్‌లో మా అబ్బాయి లేడు. మీ అబ్బాయి జగన్‌పై రాయితో దాడి చేశారని చెబుతున్నారు. మరో కోడికత్తి కేసుగా మార్చేస్తారని భయంగా ఉంది. 

 

- వేముల వెంకటరమణ, 

దాడి చేశాడని చెబుతున్న బాలుడి తల్లి 

మేమే తీసుకొచ్చి వదిలేస్తామన్నారు

మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఇంటికొచ్చారు. మీ పిల్లలు సొల్యూషన్స్‌ తీసుకుంటున్నారని.. రోజుకు ఇద్దరిని తీసుకెళ్తున్నామని చెప్పారు. విచారణ చేసి గంటలో పంపించేస్తామన్నారు. ఇప్పుడు జగన్‌పై ఒక అబ్బాయి రాయి విసిరితే, అతడి పక్కన మిగిలినవాళ్లు ఉన్నారని అంటున్నారు. జగన్‌ సింగ్‌నగర్‌ వచ్చినప్పుడు మా అబ్బాయి నా దగ్గరే ఉన్నాడు. మా పిల్లలు కాలనీ ఆర్చ్‌ దగ్గరే ఆగిపోయారు. జగన్‌పై దాడి జరిగిన ప్రదేశానికి వెళ్లలేదు. 

- వేముల భవాని (మరో బాలుడి తల్లి

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...