Popular Post psycontr Posted May 10 Popular Post Report Share Posted May 10 "ఇంకా పూర్తికాని అయోధ్యలో రాముల వారి గుడి పేరుతో దేశం మొత్తం హైప్ తెచ్చాం. ప్రతి ఇంటికీ అక్షతలు పంపాం. ప్రధానమంత్రిగారు స్వయంగా అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదొక పెద్ద విజయంగా దేశంలో ఉన్న ప్రతి ఛానల్ లో ఒక వారం పాటు ఊదర కొట్టాం. ఇంకేముంది, హిందువులు అంతా పొలెరైజ్ అయి మనకు ఓట్లు గుద్దేస్తారు. 400 పైగా సీట్లు గెలిచేస్తున్నాం." ఇదీ కేంద్రంలో అధికార పార్టీ ఆశించింది, బలంగా నమ్మింది. కానీ, దేముడ్ని అంతగా రాజకీయాలకు వాడుకోవటం సగటు హిందువుకు నచ్చలేదు. ఉత్తరాదిన జరిగిన మొదటి రెండు ఫేసుల్లో జరిగిన ఎన్నికలో ఓటింగు సరళి చూసాక వారు చేసిన అతి ఇప్పుడు వారికి ఎదురు తిరిగినట్లు అనిపిస్తుంది అని వార్తలు వస్తున్నాయి. అందుకే కాంగ్రెసు వస్తే ఆడవారి మంగళసూత్రాలు కూడా అమ్మేస్తారు అనే స్థాయికి ప్రధాని పడిపోయారు. నమ్ముకున్న హిందూ సెంటిమెంట్ ను మరింత రగల్చటానికి రిజర్వేషన్స్ నుంచి ప్రతి అంశం మీద మాట్లాడుతున్నారు. డిల్లీలో ఉన్న 7 పార్లమెంటు స్థానాలను గతంలో ప్రతి స్థానంలో 3 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన బిజె పి నేడు హోరాహోరి పోటీ ఎదుర్కొంటుంది. ఏదో రకంగా డిల్లి ముఖ్యమంత్రిని ఎన్నికలు అయ్యేవరకు ప్రచారానికి దూరంగా ఉంచాలని అన్ని అస్త్రాలు ప్రయోగించింది. కానీ, నేడు సుప్రీం కోర్టు ఎన్నికల ప్రచారం ముగిసే వరకు బెయిల్ ఇవ్వటం ప్రతిపక్ష కూటమికి ఊపిరి పోసింది. ఉత్తర ప్రదేశ్ లో కూడా గతం కన్నా స్థానాలు తగ్గుతాయి అని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఇప్పటివరకు నయానో భయానో ఇతర పార్టీ ప్రతినిధులను చేర్చుకొని ప్రభుత్వాలను ఏర్పరిచిన పార్టీకి మొదటిసారిగా హర్యానాలో ముగ్గురు ఇండిపెండెంట్లు అక్కడ ఆ పార్టీ ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం గవర్నర్ బండారు దత్తాత్రేయ దయ మీద ఉంది. ఎప్పుడూ లేనిది అంబానీ, అదానీలు కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇస్తున్నారు అని ప్రధానమంత్రిగారు ఆరోపించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవన్నీ చూసిన మార్కెట్ వర్గాలు షేర్ మార్కెట్లో అమ్మకాలు చేయటం మొదలుపెట్టారు. పదేళ్లు పాలించి ఇవిగో మేము సాధించిన విజయాలు అని ప్రజల ముందుకు రావాల్సింది పోయి దేముడి బొమ్మ ముందు పెట్టుకొని, ఇతర వర్గాలను దూషిస్తూ ముందుకు రావటం చేసిన తప్పు! 3 1 Quote Link to comment Share on other sites More sharing options...
dosth Posted May 10 Report Share Posted May 10 still "ab ki baar 400 par" Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.