Jump to content

N9 B'day Gift !


akhil79

Recommended Posts

నయనతార అసలు పేరు డయానా మరియమ్గ కురియన్‌. ఆమె 1984 సంవత్సరం నవంబర్‌ 18న జన్మించారు. కర్ణాటకలోని బెంగళూర్‌లో ఆమె పుట్టారు. ఆమె తల్లిదండ్రులు కురియన్‌ కొడియట్టు, ఒమన కురియన్‌లు. నయనతార 2003లో మళయాళ చిత్రం ‘మనస్సినక్కరే’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె చేసిన తొలి తమిళ చిత్రం ‘అయ్య(2004)’ కాగా తొలి స్ట్రయిట్‌ తెలుగు చిత్రం ‘లక్ష్మి(2005)’. ఆ తర్వాత మళయాళ, తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో పలువురు అగ్ర హీరోల సరసన కథానాయికగా చేసి పలు హిట్‌ సినిమాల్లో నటించారు.

త్వరలో ప్రభుదేవాను పెళ్లాడనున్న నయనతార తన చివరి చిత్రం ‘శ్రీరామరాజ్యం’గా చెబుతున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటన చేయలేదు. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న నయనతార నటించిన ‘శ్రీరామరాజ్యం’ చిత్రం విడుదలై మంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా నయనతార, బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావుల నటన ఈ చిత్ర విజయానికి దోహదం చేసిందంటున్నారు. లవకుశులుగా నటించిన చిన్నారులతో మంచి నటన రాబట్టుకున్నారని దర్శకుడు బాపును అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.

చాలా రోజులు ఒక మంచి తెలుగు చిత్రాన్ని చూశామని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. అలనాడు ఉత్తరరామ చరిత్ర ఆధారంగా తండ్రీ కొడుకులు సి. పుల్లయ్య, సి.ఎస్‌. రావు దర్శకత్వంలో రూపొందిన ‘లవకుశ’కు రీమేక్‌గా వచ్చిన చిత్రం ఇది. దాంతో చాలా మంది పౌరాణిక చిత్రాల అభిమానులు ఈ చిత్రాన్ని ‘లవకుశ’తో పోల్చి చూస్తున్నారు. వారి టాక్‌ ఏమిటంటే... ‘లవకుశ’ సినిమాని పాడు చెయ్యలేదు.. అలాగే నేటి తరం ప్రేక్షకులు కూడా ఎక్కడా బోర్‌ ఫీల్‌ కాకుండా ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తారంటున్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ చాలా సార్లు సీనియర్‌ నటుడు ఎన్టీఆర్‌ని గుర్తుచేసాడంటున్నారు. టోటల్‌గా ఓ కమనీయ కావ్యం చూసామని అంటున్నారు. ఈ సినిమా ప్రభావంతో అయినా మళ్ళీ పౌరాణికాలు తెలుగులో మొదలైతే చూడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...