Jump to content

Bollywood Ki Tollywood


akhil79

Recommended Posts

[b] [size=5]బాలీవుడ్‌కి టాలీ..వుడ్‌[/size][/b]
[color=#333333][font=arial][size=1]


[size=5]బాలీవుడ్‌ టాప్‌ హీరోలంతా ఇప్పుడు తెలుగులో సూపర్‌డూపర్‌ హిట్టయిన చిత్రాలపైనే కాదు...కొత్తగా క్రేజీ ప్రాజెక్టులు ఏమైనా ఉంటే ముందుగానే వాటి రీమేక్‌ హక్కులను సొంతంచేసుకునేందుకు బ్లాంక్‌ చెక్కులతో సిద్ధమైపోతున్నారు.[/size]
[size=5][img]http://suryaa.com/Main/gallery/2012/Jan/30/btp.jpg[/img]ఒకప్పుడు దక్షిణాదివారిని ఉత్తరాదివారు ఇడ్లీసాంబార్‌, పొంగల్‌, ఉప్మాలంటూ దెప్పిపొడిచేవారు. దక్షిణాది పొడ అస్సలు గిట్టేదికాదు సినిమా ఇండస్ట్రీలో ఈ ధోరణి విపరీతమైన స్థాయిలో ఉండేది. హిందీలో హిట్టయిన చిత్రాల కోసం దక్షిణాది భాషా నిర్మాత, దర్శకులు రీమేక్‌ చేసేందుకు క్యూ కట్టేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. గత రెండు మూడు సంవత్సరాల బాలీవుడ్‌ ట్రాక్‌ రికార్డులు పరిశీలిస్తే ఎక్కువగా దక్షిణాదినుంచి కోలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్రాల రీమేకులపైనే బాలీవుడ్‌ ట్రెండ్‌ నడుస్తోందంటే అతిశయోక్తికాదు. అసలు తెలుగు సినిమా మార్కెట్‌ మన రాష్ట్ర సరిహద్దులుదాటి పొరుగురాష్ట్రాలకు కూడా విస్తరించేదికాదు. అలాంటిది ఇప్పుడు కోలీవుడ్‌ కన్నా కూడా బాలీవుడ్‌కి రీమేక్‌ కథలను అందించడంలో ముందంజలో ఉంది. బాలీవుడ్‌ టాప్‌ హీరోలంతా ఇప్పుడు తెలుగులో సూపర్‌డూపర్‌ హిట్టయిన చిత్రాలపైనే కాదు...కొత్తగా క్రేజీ ప్రాజెక్టులు ఏమైనా ఉంటే ముందుగానే వాటి రీమేక్‌ హక్కులను సొంతంచేసుకునేందుకు బ్లాంక్‌ చెక్కులతో సిద్ధమైపోతున్నారు. తెలుగులో ఇటీవల విడుదలైన ‘బిజినెస్‌మేన్‌’ హిందీ రీమేక్‌ హక్కులను సొంతంచేసుకునేందుకు విపరీతమైన పోటీ ఏర్పడింది. రణబీర్‌కపూర్‌ హిందీ రీమేక్‌ హీరోగా చేయబోతున్నట్లు సమాచారం. ఇంకా ఈ చిత్రమేకాకుండా త్వరలో రామ్‌చరణ్‌ నటించిన ‘రచ్చ’, జూ.ఎన్టీఆర్‌ నటించిన ‘దమ్ము’ చిత్రాలేకాకుండా లేటెస్ట్‌గా షూటింగ్‌ ప్రారంభమైన సీతమ్మవాకిట్లో సరిమల్లె చెట్టు చిత్రంపై కూడా బాలీవుడ్‌ నిర్మాతల కన్ను పడిందని సమాచారం. ప్రిన్స్‌ మహేష్‌బాబు, వెంకటేష్‌ల క్రేజీకాంబినేషన్‌లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రంపై బాలీవుడ్‌లో కొందరు పెద్ద హీరోలు కూడా కన్నేసినట్లు తాజా సమాచారం. ఇవేగాక రవితేజ ‘నిప్పు’, సునీల్‌ ‘పూలరంగడు’ చిత్రాలపై కూడా కొందరు హీరోలు కన్నేసినట్లు సమాచారం. ఈ రకంగా చూసుకుంటే రాబోయే రెండు మూడు సంవత్సరాలలో టాలీవుడ్‌ సినిమాలు హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా రీమేక్‌లుగ మలిచేందుకు బాలీవుడ్‌ ప్రముఖులు రెడ్‌ కార్పెట్‌ పరిచి మరీ ఆహ్వానం పలుకుతారనడంలో ఎటువంటి సందేహం లేదు.[/size][/size][/font][/color]

Link to comment
Share on other sites

×
×
  • Create New...