Jump to content

I Will Show Difference !


akhil79

Recommended Posts

[size=6][b] ప్రత్యేకత చూపిస్తా[/b]


[color=#333333][font=arial][img]http://suryaa.com/Main/gallery/2012/Feb/09/sms.jpg[/img]మహేష్‌ ఉన్నప్పుడు మా కుటుంబం నుంచి వేరే స్టార్‌ అక్కర్లేదనుకున్నా. అయితే హీరోగా నేను వస్తున్నా. నాకంటూ ప్రత్యేకత చూపించాలనే కసితో ఉన్నాను. జీరో అంచనాలతో మొదలైన నా సినిమా మావయ్య (కృష్ణ) నన్ను స్టేజిలపై పరిచయం చేయడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే సినిమా ఉంటుంది’’ అన్నారు సుధీర్‌బాబు. ఈ యువహీరో కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఎస్‌ఎంఎస్‌’. శివ మనసులో శృతి’ అనేది ట్యాగ్‌లైన్‌. రెజీన కథానాయిక. తాతినేని సత్య దర్శకుడు. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సమర్పణలో వేగ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై విక్రమ్‌రాజ్‌ నిర్మిస్తున్నారు. సెల్వ గణేష్‌ సంగీతం అందించిన ఆడియో ప్లాటినం వేడుక జరుపుకుంది. ఈ వేడుకలో సుధీర్‌ పైవిధంగా స్పందించారు.

మరిన్ని సంగతులు చెబుతూ ‘చక్కని సంగీతం వల్లే కాదు..హీరో వల్ల కూడా ఆడియో సీడీలు అమ్ముడుపోతాయి. మహేష్‌ వల్లే ‘బిజినెస్‌మేన్‌’ హెక్సా ప్లాటినం వేడుక జరుపుకుంది. ఆ స్థాయికి నేనూ ఎదగాలి. సంగీతదర్శకుడు సెల్వ కాన్సెర్టుల కోసం సరికొత్త బాణీలను సిద్ధం చేస్తుంటాడు. అందువల్లే మా సినిమాకి మరింత ఫ్రెష్‌గా ఉండే పాటలిచ్చాడేమో’ అన్నారు. ఈ నెల 10న విడుదలవుతున్న మా చిత్రాన్ని బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నానని నిర్మాత విక్రమ్‌రాజ్‌ అన్నారు. వి.వి.వినాయక్‌ (వీడియో రికార్డింగ్‌లో) మాట్లాడుతూ సుధీర్‌ పెద్ద హీరోలా జాబితాలో చేరతాడని అన్నారు. హీరో నాని మాట్లాడుతూ ‘‘సుధీర్‌ ప్రతిభ లైవ్‌గా సెట్స్‌లోనే చూశాను.

తన కష్టం, తపన కళ్లముందే చూశాను. ఈ చిత్రంలో కొన్ని బిట్లు చూశాను. హిట్‌ చిత్రమిది. సెల్వ సంగీతం, సత్య దర్శకత్వం అద్భుతం’’ అన్నారు. 4,5 సినిమాల హీరోలా సుధీర్‌ నటించారని దర్శకుడు వీరూపోట్ల అన్నారు. తమిళ్‌లోలానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని హీరో శివాజీ అన్నారు. కార్యక్రమంలో తాతినేని సత్య, నంద్యాల రవి తదితరులు పాల్గొన్నారు. చిత్రయూనిట్‌ అతిథుల సమక్షంలో షీల్డ్‌‌స అందుకుంది. నీ మూన్‌ వాక్‌, వాల్‌ ఫ్లిప్‌, సై్వప్‌ వాక్‌..డాన్సులను సుధీర్‌ అద్భుతంగా చేశారని వక్తలు అభినందించారు.[/font][/color][/size]

Link to comment
Share on other sites

[quote name='kidmakers' timestamp='1328747378' post='1301392855']
veediki anavasrram ga ekkuva hype istunnaaremo ani naa uddesam.. aa dialogue delivery m laaga undhi asalu :3D_Smiles_38: :3D_Smiles_38:
[/quote]agreed.
first film kada.

Link to comment
Share on other sites

×
×
  • Create New...