Jump to content

Happy Vuncle నాపై కక్ష కట్టి కేసులో ఇరికించాడు: తారా చౌదరి


M KCR

Recommended Posts

నాకు ఏ పాపం తెలియదు: తారా చౌదరి


హైదరాబాద్: అమాయక యువతులతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి తారాచౌదరి.. తనకు ఏ పాపం తెలియదని పేర్కొన్నారు. ఇద్దరు ఎంపీల లైంగిక వాంఛలు తీర్చేందుకు తాను నిరాకరించటంతో.. తనపై కక్ష కట్టి కేసులో ఇరికించారని పోలీసు విచారణలో ఆరోపించారు. అయితే వారి పేర్లను వెల్లడించేందుకు నిరాకరించారు. వారిలో ఒక ఎంపీని తన ఇంట్లో లభ్యమైన వీడియో సీడీల్లో చూసి ఉంటారు కదా అని పోలీసులతోనే వ్యాఖ్యానించటం విశేషం. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. సెక్స్ రాకెట్ కేసులో అరెస్టయిన తారా చౌదరిని బంజారాహిల్స్ పోలీసులు నాలుగు రోజుల కస్టడీ నిమిత్తం సోమవారం తమ అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమెను మంగళవారం బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఎం.సుదర్శన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విచారించారు. ఈ విచారణలో పదేపదే ఆమె తనకేం తెలియదని చెప్పటంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం విచారణ సందర్భంగా సీఐ అడిగిన ప్రశ్నలు, తారాచౌదరి సమాధానాలు ఇలావున్నాయి...

సీఐ: నీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఇద్దరు ఎంపీలు ఎవరు?

తార: ఒకరు కోస్తా ప్రాంతానికి చెందినవారు. మరొకరు రాయలసీమ ప్రాంతానికి చెందినవారు. వారి పేర్లను మాత్రం మీడియా ముందే బయటపెడతాను. నా దగ్గర లభించిన సీడీలలో ఒక ఎంపీని మీరు చూసేవుంటారు.

నగ్నదృశ్యాలను స్పై కెమెరాల ద్వారా చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేయడం నిజమేనా?

నా ఇంట్లో లభించినవి మామూలు కెమెరాలే. మీరు స్పై కెమెరాలని భ్రమపడ్డారు. బెడ్‌రూమ్‌లో కెమెరాలు లభించినంత మాత్రాన అవి నగ్నదృశ్యాలు చిత్రీకరించటానికే అనుకుంటే ఎలా? నా వ్యక్తిగత విషయాలలోనూ తలదూరుస్తున్నారు. నాకంటూ ఆత్మాభిమానం ఉంది.

సినిమా వాళ్లతో పరిచయాలు ఎలాంటివి?

నా ఇంట్లో లభించిన సీడీలలో కొన్ని న్యూడ్ దృశ్యాలను చూసి వారు సినిమాకు సంబంధించిన ప్రముఖులని అనుకుంటున్నారు. అందులో ఒకరిద్దరు సినిమా పరిశ్రమకు చెందినవారు ఉన్నా వారి పేర్లను బయటపెడితే నా కెరీర్ దెబ్బతింటుంది. నా నోటితో చెప్పటమెందుకు మీరు ఇప్పటికే చూసివుంటారు.

ఇప్పటివరకు ఎంత మందిని వ్యభిచార ఉచ్చులోకి దింపావు?

అమ్మ తోడు... అదంతా ఒట్టి పుకారు. నామీద ఫిర్యాదు చేసిన లక్ష్మి ఎవరో కూడా తెలియదు. టీవీల్లో చూడటమే. ఆమెను వ్యభిచార వృత్తిలోకి దింపాననటం అబద్ధం. నేనెవరినీ వ్యభిచారంలోకి దింపలేదు. మీకు లభించిన వాయిస్ రికార్డింగ్ లో నా వాయిస్‌ను ఎవరో అనుకరించారు. ఇదంతా పకడ్బందీ వ్యూహంతో జరిగింది.

ఇంట్లోనే గడిపేదానివా? బయటకు వెళ్లేదానివా?

నాకు గత రెండేళ్లుగా ప్రాణహాని ఉన్నట్లు అనుమానం వచ్చింది. కొంతమంది చంపేస్తామంటూ బెదిరించారు. ఒకరైతే ఏకంగా యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడు. అందుకే బయటకు వెళ్లేదాన్ని కాదు. ఇంట్లోనే ఎక్కువగా ఉండేదాన్ని.

నీకు ఎన్ని కార్లు ఉన్నాయి?

ఒకటే కారు ఉంది. మా అన్నయ్యకు కూడా ఓ కారు ఉంది. నేను అమీర్‌పేటలో ఓ వ్యాపారి నుంచి మూడు కార్లు తీసుకున్నట్లు ఆధారాలు లేవు. ఇందులో వాస్తవం లేదు.

చాలా మంది పోలీసులతో పరిచయాలు ఉన్నాయంటూ బ్లాక్‌మెయిల్ చేస్తుంటావు?

నాకెవరెవరు పోలీసు అధికారులతో సంబంధాలున్నాయో త్వరలోనే బయటపెడతా. ఇది పోలీసు విచారణలో చెప్పటం వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందనుకోను. మీడియా ముందయితే అన్ని విషయాలు స్పష్టంగా చెప్తాను.

ఏం చేద్దామని హైదరాబాద్ వచ్చావు?

నాకు సినిమాల్లో నటించటమంటే ఇష్టం. చిన్నప్పుడు స్కూల్‌లో నువ్వందంగా ఉన్నావు.. సినిమాల్లో ట్రై చేయకూడదా.. అని స్నేహితులు అనేవారు. అప్పటినుంచే వెండితెర మీద వెలిగిపోవాలని కలలు కన్నాను. ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చి వేషాల కోసం ఢక్కామొక్కీలు తిన్నాను. ఒక వేషం కోసం ఎన్ని పాట్లు పడాలో కళ్లారా చూశాను. వేషాల కోసం అడ్డదారులు తొక్కటం గమనించాను. నాలో కసి పెరిగిపోయింది. ఏదో చేయాలన్న కక్ష పెంచుకున్నాను. అందుకే చాలామందితో పరిచయాలు ఏర్పరుచుకున్నాను. ఓ సినిమా తీయాలని తలపెట్టాను.

Link to comment
Share on other sites

×
×
  • Create New...