Jump to content

Inside News On Arrest


tigersathii

Recommended Posts

[b]హైడ్రామా?
నీ వల్లే ఇదంతా.. నిమ్మగడ్డ ఆవేదన
విసురుగా మీదమీదకెళ్లిన జగన్
సీబీఐ అధికార్లపైనా దురుసుగా..
అందుకే ముందుకు జరిగిన అరెస్ట్ ముహూర్తం[/b]



[b]ఇంకొక్క రోజులో కోర్టులో హాజరు! అంతలోనే... అనూహ్యంగా అరెస్ట్! ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రాకముందే... ముందస్తుగానే అరెస్ట్! సీబీఐ ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో... ఆ గదిలో... ఏం జరిగింది? జగన్ దూకుడే దీనికి కారణమా? తన వ్యాపార భాగస్వామి, 'సాటి నిందితుడు' నిమ్మగడ్డ ప్రసాద్‌పై జగన్ దురుసుగా ప్రవర్తించారా? సీబీఐ అధికారులతోనూ దుందుడుకుగా వ్యవహరించారా? 'ఇక లాభంలేదు! తక్షణం అరెస్ట్ చేయాల్సిందే' అని సీబీఐ అప్పటికప్పుడు ఒక నిర్ణయానికి వచ్చిందా? ఈ ప్రశ్నలకు 'ఔను' అనే సమాధానం లభిస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం అసలేం జరిగిందంటే...[/b]


[color=#282828][font=helvetica, arial, sans-serif]హైదరాబాద్, మే 27: దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లోని సీబీఐ కార్యాలయం! ఒక గదిలో... జగన్ విచారణ జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్న భోజనానికి ముందు జగన్, విజయసాయి రెడ్డిలతోపాటు ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి సీబీఐ కస్టడీలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఒకేచోట కూర్చోబెట్టారు. వాన్‌పిక్‌కు భూములు... జగతిలోకి నిమ్మగడ్డ పెట్టుబడుల గురించి ప్రశ్నించారు. కాసేపటి తర్వాత... సాయిరెడ్డిని పక్కకు పంపించారు.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]ఇక... జగన్, నిమ్మగడ్డ ఫేస్ టు ఫేస్! "మీ నాన్న నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి మేళ్లు పొందే నిమ్మగడ్డ ప్రసాద్ మీ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు కదా! అని సీబీఐ అధికారులు జగన్‌ను ప్రశ్నించారు. దీనికి జగన్... "మా నాన్న ముఖ్యమంత్రి. నేను ఎంపీని. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు'' అని బదులిచ్చారు. జగన్ కంపెనీల్లో నిమ్మగడ్డ పెట్టిన పెట్టుబడుల వివరాలన్నీ చెబుతూ... 'వీటన్నింటికీ ఆధారాలు ఉన్నాయి కదా!' అని సీబీఐ అధికారులు అడిగారు.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]దీనిపై జగన్ స్పందిస్తూ... "ఔను... నిమ్మగడ్డ పారిశ్రామిక వేత్త. వ్యాపారంలో లాభాలు ఆశించి మాత్రమే ఆయన మా కంపెనీలో పెట్టుడులు పెట్టారు'' అని తెలిపారు. ఫార్మా రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన... విజయవంతమైన 'ఇన్వెస్టర్'గా ప్రసిద్ధి చెందిన నిమ్మగడ్డ ఈ దశలో నోరు తెరిచారు. లాభాల కోసమే తన కంపెనీలో పెట్టుబడులు పెట్టారన్న జగన్ మాటలపై స్పందించారు. "ఎక్కడి లాభాలు! నేను నష్టపోయాను. నేను పెట్టిన పెట్టుబడుల్లో సగం నీడబ్బే కదా! మిగతా సగం నేను పూర్తిగా నష్టపోయాను! అసలు ఇదంతా నీ వల్లే జరిగింది'' అని జగన్‌ముందు ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]తన ముందే తనకు వ్యతిరేకంగా, సీబీఐ వాదనను బలపరిచేలా మాట్లాడటంతో జగన్‌కు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. పట్టరాని కోపంతో కుర్చీలోంచి లేచి, దానిని వెనక్కి తోశారు. విసురుగా నిమ్మగడ్డవైపు వెళ్లబోయారు. హఠాత్పరిణామంతో అక్కడే ఉన్న సీబీఐ అధికారులు అవ్వాక్కయ్యారు. జగన్‌ను నిలువరించేందుకు ప్రయత్నించారు. వీరిపైనా జగన్ దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాత జగన్, నిమ్మగడ్డలను వేర్వేరు గదుల్లోకి కూర్చోబెట్టారు. జగన్ తీరు గురించి ఢిల్లీలోని సీబీఐ డైరెక్టరేట్‌కు తెలియజేశారు.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]"ఇప్పుడే, మా ముందే సహ నిందితుడిపై దురుసుగా వ్యవహరించారు. మాపైనా అలాగే ప్రవర్తించారు. మున్ముందు ఏం చేస్తారో!'' అనే సందేశాన్ని పంపించారు. దీంతో... ఇక ఆలస్యం చేయడం అనవసరమని, తక్షణమే అరెస్టు చేసేయాలని సీబీఐ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. చకచకా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు. సాయంత్రం 6.35 గంటల సమయంలో జేడీ లక్ష్మీనారాయణ సీరియస్‌గా బయటకు వచ్చారు.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]తన వాహనంలో తాజ్‌కృష్ణా హోటల్‌కు వెళ్లి... అక్కడ బస చేసిన సీబీఐ ఉన్నతాధికారులతో మాట్లాడారు. చివరగా... 7.20 గంటలకు జగన్ అరెస్టును సీబీఐ «ద్రువీకరించింది. ఇక... రెండు రోజులుగా జగన్ వెన్నంటే ఉంటున్న బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు కూడా సాక్షులను బెదిరించినందునే జగన్‌ను అరెస్టు చేసినట్లు చెప్పడం గమనార్హం! మొదటి రెండు రోజుల్లాగా జగన్ 'కూల్'గా ఉండి ఉంటే.... బహుశా ఆయన అరెస్టు ఒకరోజు వాయిదా పడేదేమో! [/font][/color]

Link to comment
Share on other sites

Pilla kaki politician ki loukyam teliyadu papam jagan. Place manadi kanappudu kallaberaniki ravadam jagan ki teluyadam ledu

But good news for Nimmagadda Prasad, otherwise he has to get beaten by Jagan in presence of CBI officers

well done CBI officers
sSa_j@il

Link to comment
Share on other sites

×
×
  • Create New...