Jump to content

సామాజిక న్యాయం ఓ మేకప్‌ : పరకాల


kingmakers

Recommended Posts

సామాజిక న్యాయమనేది ప్రజారాజ్యానికి ఓ మేకప్‌ లాంటిదని, అది ఆ పార్టీ ఓనర్లు వేసుకునే కాస్టూ్యమ్‌‌స వంటిదని పరకాల ప్రభాకర్‌ అభివర్ణించారు. ఆ పార్టీ ఓనర్లకు డబ్బే parakala_prabhakarలక్ష్యం  సీటే మార్గమని ఆయన ఆరోపించారు. టిక్కెట్లు అమ్ముకున్నారని, వారు డబ్బుకోసమే పార్టీ పెట్టారని అందుకే తాను ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేశానని ప్రకటించి సంచలనం సృష్టించిన పరకాల ప్రభాకర్‌ మరోసారి ఆ పార్టీని దుమ్మెత్తి పోశారు. ఇవాళ హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజారాజ్యం ఓన…ర్లకు కల్పవృక్షం.. ప్రజలకు విషవృక్షం మని ఆయన ఆరోపించారు. 104 మంది బీసీలకు సీట్లిచ్చి సామాజిక న్యాయం చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, వాస్తవానికి అందులో దాదాపు 40 మంది బోగస్‌ అని ఆయనన్నారు. చివరకు ఆదికేశవులు నాయుడు కుమారున్ని కూడా బీసీని చేశారని ఆయన ఎద్దేవా చేశారు. తాను చేసిన ఆరోపణలన్నీ వాస్తవాలని పరకాల చెప్పారు. వారు చెబుతున్నట్లు సామాన్యులకు సీట్లవ్వలేదని, వేల కోట్ల రూపాయల ఆస్తి పరులకు సీట్లు అమ్ముకున్నారని పరకాల అన్నారు.

ప్రజారాజ్యం ఎప్పుడో పట్టాలు తప్పింది. పీఆర్‌పి సర్వేలని బూటకమని, అదంతా ప్రజలను మభ్య పెట్టడానికి చెప్పిన మాటలని ఆయన ఆరోపించారు. రాత్రికి పగటికి తేడా లేకుండా సీట్లిచ్చార, పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని పక్కన బెట్టి ఊరు, పేరు తెలియని వారికి సీట్లిచ్చారని ఆయన ఎండగట్టారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు, నిర్మాణ సంస్థ ఓనర్లకు, ఇంకా వేల కోట్ల టర్నోవరున్న దనవంతులకే పీఆర్‌పీ సీట్లిచ్చిందని పరకాల అన్నారు. ఎదో చేద్దాము, రాషా్టన్న్రి మారుద్దాము, రాజకీయాల్లో ఓ మార్పు తీసుకు రావాలంటే పార్టీలోకి రావాలని పట్టుబడితేనే తాను పీఆర్‌పీలో చేరానని పరకాల వివరించారు. రాజకీయాల్లో ఉంటానో లేదో తెలియదని, బహుషా ఇక రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లేనని పరకాల తెలిపారు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...