Jump to content

Dedicated To Godavari

Ruler4Dmasses

Recommended Posts

around 2 years avuthundhi i believe..okaroju night godavari bridge gurinchi aalochittho godavari river meeda raayalani edho lolopala anipinchindhi...raasaka intlo cheppa... maa voollo chadivaaru anta ..

india vellinappudu andaru pedddalu baaga rasaavu antunte .. theleeni aanandam. 

గోదావరి... ఆవిర్భావం మహారాష్త్ర యందు పశ్చిమ ప్రాంతం.సమాప్తం ఆంధ్రరాష్ట్రమందు తూర్పు తీరం..

ప్రవాహపు నిడివి రమారమి 1500 కిలోమీటర్లు...పల్లెలు , పట్టనంబులు , మరియు ఆధునిక నాగరికతకు పరాకాష్ట ఐనట్టి నగర ప్రాంతాలు వేవేల సంవత్సరములుగా .. ఈ నదీ రాజసమందు సేద తీర్చుకొనుచు.. చరిత్ర పుటలలో నిత్య కీర్తిని ఆర్జిన్చుకున్నవి. కుల, మత, లింగ , వయో, ప్రాంత భేదాలు లేని మాతృ మూర్తిగా పేరుగాంచిన గోదారమ్మ ప్రేమాభిమానాలకు, ఆహ్లాద కరమైన ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఆంధ్ర రాష్ట్రం " అన్నపూర్ణేశ్వరి" గా అవతరించడం లో గోదావరి పాత్ర మరపురానిది, మరిచిపోలేనిది, వర్ణించుటకు వీలులేనట్టిది, కృష్ణ తుంగభద్ర, పెన్నా మొదలుగు సోదరీమణుల సాంగత్యం తో జనులలో సమైక్యతను, సామరస్యాన్ని సదా నిలుపుటకు పూనుకున్నది. ఆస్తికుడైనా.. నాస్తికుడైనా ..వేదమైనా .. నాదమైనా..తర్కానికి సైతం అందని మహా నయనానందకర వన్నెల తపస్సంపన్ని.. నాసికం " నాసిక్" ..అంతం " అంతర్వేది" .. మార్గమధ్యమున శక్తీ స్వరూపమైన ఎన్నో తీర్ధాలకు ఆశ్రయం ఈ నదీ తీరం. 

నాసిక్ "త్రయంబకేస్వరు"డి జటాజూటం.. "కాళేశ్వరం" త్రివేణి సంగమం. "బాసర" లోని చదువుల తల్లి వేదపూరితమైన పుస్తకాల సమాహారం.. ఏడు పాయలు "రాజమహేంద్ర" వరమున సంగమించి "మహా గోదావరి "గా రూపాంతరం గావించి..తూర్పు,పశ్చిమ జిల్లాల ను కలగలుపు రైలు, రోడ్డు వంతెన, ఇతరత్రా ప్రదాన వంతెనలను అక్కున చేర్చుకుంటూ.. ఉగ్ర రూపం పోతెట్టినపుడు వరదల భారి నుంచి వ్యవసాయాన్ని, లోతట్టు ప్రాంతాల్ని పరి రక్షిస్తూ వృధా నీటిని సమగ్రంగా నిక్షిప్త పరిచే " కాటన్" దొర కలల రూపాంతరం, స్వేద బిందువు ఐనట్టు ఆ " ధవలేశ్వరం" ఆనకట్ట ను లేలేత పలుకులతో కుశల ప్రశ్నలతో పలకరించి .. రివ్వుమని కొండలు ..కోనలు.. వాగులు.. లోయలు.. ఒక్కొక్కటిగా దాటుకొంటూ .. పక్షుల రాగాలు.. మృగముల ఘీంకారాలు.. అడవుల పసిడి కాంతుల సమగ్ర రూపమైన " పాపికొండ" లను చంటి పాప వలె బుజ్జగించి పరుగుపరుగున "నరసాపుర" ముకు వీడ్కోలు పలుకుతూ... అంతర్వేది లో అంతిమ ఘడియలను వేగరహితంగా.. స్తబ్దత తో కూడిన నింపాది అడుగులతో బంగాళా ఖాతం లో సమాప్తమయ్యే ఘట్టం .. తత్సమయమున "అస్తమించు" సూర్యుని ఎర్రటి మేఘాల తివాచి సందర్శనం .. తో నిరంతర ప్రయాస తో కూడిన ప్రేమాభి ప్రయాణాన్ని తిలకించిన, తలంచిన జీవనం ధన్యం..

Link to comment
Share on other sites

  • Replies 62
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Ruler4Dmasses

    27

  • agora

    6

  • tom bhayya

    5

  • timmy

    3

Nice.... oka book eyyu ba ..

Link to comment
Share on other sites

×
×
  • Create New...