Jump to content

Cbn And Ap


BuzzShah

Recommended Posts

  • Replies 75
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • BuzzShah

    15

  • NO17

    8

  • mahesh1

    6

  • HECTOR08

    5

Top Posters In This Topic

సింగపూర్ మొలిచిందా… ఆంధ్రప్రదేశ్ ఏమైనా అమెరికా అయిపోయిందా… ఏం మారిందని ఏం చేశాం ? అంటూ ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాస్తవాలు తెలియక అయినా అయ్యుండాలి. వాళ్ల మీద వాళ్లకి నమ్మకం లేకపోవడం అయినా అవ్వాలి. ఎందుకంటే ఈ 20 నెలల్లో ఏపీ అసాధ్యమనిపించేవెన్నో సాధించింది. ఏకంగా గ్రోత్ పాయింట్స్ లో 40కి పైగా స్కోర్ తో ఢిల్లీనే ఆశ్చర్యపరిచింది. అవునా…మీ మీటర్ ఇంత స్పీడ్ ఉందని అనుకోలేదంటూ నీతిఆయోగ్ కూడా సర్ ప్రైజ్ అయ్యిందంటే పరిస్థితేంటో అర్థమవుతుంది. అదంతా సరే… అసలు మేటర్ కి వద్దాం. చంద్రబాబు ఏం సాధించాడో చూద్దాం ?
ఏపీ ఏర్పడేనాటికి… చంద్రబాబు పగ్గాలు అందుకునే నాటికి ఏపీలో ఉన్నది ఒకే ఒక్క సిటీ. విశాఖ. దానికి కూడా పరిమితులున్నాయ్. అంతలోనే తుఫాను వచ్చిపడింది. ఆటంకాలు ఎదురయ్యాయ్. విజయవాడ సిటీ అని మనం అనుకున్నా నిజానికది పెద్ద పల్లెటూరు. ఏర్ పోర్ట్ కి హంగులొచ్చాక…రోడ్లు వేసి రూపురేఖలు తీర్చిదిద్దాక ఇప్పుడిప్పుడే సిటీ అవుతోంది బెజవాడ. అంటే చెప్పుకోదగ్గ నగరం లేదు. ఆదాయ మార్గం లేదు. మేజర్ ఎట్రాక్షన్ అస్సలే లేదు. పరిశ్రమలు లాంటివి కూడా ఎక్కడా లేవు. ఇలాంటి సమయంలో మైదానం లాంటి రాష్ట్రాన్ని స్టేడియంలా తీర్చిదిద్దడానికి సీటింగ్ నుంచి పిచ్ వరకూ అన్నీ ప్రిపేర్ చేయడానికి 20 నెలల్లోనే ఎన్నో ఫర్లాంగులు నడిచాడు చంద్రబాబు. అవునా… అనిపించే, ఆశ్చర్యాన్ని పెంచే ప్రాజెక్టులు తేవడమే కాదు… ఏపీలోని 13 జిల్లాల్ని చుక్కుల ముగ్గతో కలిపినట్టు ఓ ప్రణాళికతో అనుసంధానించాడు. అదేంటో వన్ బై వన్ చూద్దాం !
1. ఉత్తరాంధ్ర నుంచి వద్దాం. తుఫాను దెబ్బ నుంచి విశాఖ కోలుకుంది. పెట్టుబడుల రాజధానిగా అవతరించింది. పర్యాటక రాజధానిగా నిలబడింది. స్మార్ట్ సిటీ కాబోతున్న విశాఖ 100% ఎల్ ఈడీ వెలుగులు విరజిమ్ముతున్న తొలి నగరంగా రికార్డు సృష్టించింది. ఆకర్షణ, పరిశుభ్రతలతో ప్రధాని మోడీనే ఆశ్చర్యపరిచింది విశాఖ. ఇది చంద్రబాబు ముద్ర.
2. కన్వెన్షన్ సెంటర్ లాంటివేమీ లేకుండానే భారీ పెట్టుబడుల సదస్సును విజయవంతంగా నిర్వహించిన విశాఖ ఐఐఎం, మెడికల్ డివైజెస్ పార్క్, భారీ సోలార్ మేనిఫ్యాక్చరింగ్ యూనిట్లకి కేంద్రం కాబోతోంది. దక్షిణాదిలోనే అతిపెద్ద యూనిట్ ని ఏషియన్ పెయింట్స్ ఇప్పటికే మొదలుపెట్టింది. రిలయన్స్ త్వరలోనే షిప్ బిల్డింగ్ యూనిట్ కూడా ప్రారంభించబోతోంది వైజాగ్ దగ్గర్లో !
3. సాఫ్టు సిటీ రేసులో గట్టిపోటీని తట్టుకొని తొలి 20 నగరాల్లో ఒకటిగా నిలిచింది విశాఖ.
4. స్మార్ట్ రేసులో కాకినాడ కూడా తొలి 20 నగరాల్లో ఒకటిగా నిలిచింది.
5. ఆర్ఎల్ఎన్ జి ప్లాంట్ కాకినాడలో మొదలుకాబోతోంది. మరో పోర్టు నిర్మాణమూ జరగబోతోంది. కంటైనర్ టెర్మినల్, దివీస్ ఫార్మా లాంటి అసైన్ మెంట్స్ తో రేసులో ముందుంది కాకినాడ.
6. ఇప్పటి వరకూ దేశంలో మరెక్కడా జరగనంత ఘనంగా గోదావరి పుష్కరాల్ని నిర్వహించింది ఏపీ. రాజమండ్రిలో తొలి రోజు దుర్ఘటన మినహా… అపూర్వ హారతి లాంటి ఘట్టాలన్నీ చరిత్రలో నిలిచిపోయేవే !
7. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా అంతర్వేదిలో రిపైర్ అండ్ బేస్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయబోతోంది డ్రెడ్జింగ్ కార్పొరేషన్.
8. తాడేపల్లి గూడెంలో నిట్ మొదలైంది… క్లాసులు కూడా జరుగుతున్నాయ్ ఇప్పటికే !
9. గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు వందల కోట్ల ప్రాజెక్టులు ఇప్పటిేక పట్టాలెక్కాయ్.
10. రికార్డు స్థాయి వేగంతో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయ్యింది. సీమకి నీళ్లివ్వడమే కాదు క్రిష్ణా డెల్టా స్థిరీకరణకీ ఇది కీలకం.
11. పోలవరం ప్రాజెక్టు టాప్ గేర్ లో లేకపోయినా పనుల్లో వేగం పెరిగింది. 8 ఏళ్లలో జరిగిన పనులకన్నా.. గత 20 నెలల్లో అయిన పనులు దాదాపు పదిరెట్లు ఎక్కువ.
12. పెద్ద పల్లెటూరు లాంటి బెజవాడలో ఇపుడు రోడ్లు, వీధిలైట్లు లాంటివి మెరుగుపడ్డాయ్. రూపురేఖలు ఇప్పుడిప్పుడే మారుతున్నాయ్. మెట్రో టెండర్లు ఓ కొలిక్కివస్తున్నాయ్. వేగంగా పనులు అవుతున్నదుర్గ గుడి దగ్గర ప్లైఓవర్ కూడా పూర్తయితే ఇక సిటీ రూపురేఖలు మారిపోతాయ్.
13. నూజివీడు దగ్గర మెగా ఫు్డ పార్కు ఓ కొలిక్కి వస్తోంది. భూ కేటాయింపులు పూర్తయ్యాయ్
14. ల్యాండ్ పూలింగ్ లో 33 వేల ఎకరాల భూ సమీకరణ పూర్తయ్యింది రాజధాని కోసం. మాస్టర్ ప్లాన్ పైనలైజ్ కాబోతోంది. నిర్మాణాల రూపు రేఖలు కూడా అయిపోతే అపురూప నగరం అమరావతి నిర్మాణం మరో 6 నెలల్లో మొదలవుతుంది. అదే జరిగితే.. రెండేళ్లలోనే ఇంత వేగంగా పనులు పూర్తిచేసిన నగరంగా అమరావతి ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది కూడా !
15. గుంటూరులో ఎయిమ్స్, అగ్రివర్సిటీతోపాటు ఇతర కేంద్రం సంస్థల ఏర్పాటు కోసం పనులు మొదలయ్యాయ్
16. దేశంలోనే తొలిసారిగా కేంద్రం కేటాయించిన నిమ్జ్ కి ప్రకాశం జిల్లాలో భూములు కూడా ఇచ్చింది రాష్ట్రం. ఇక నిమ్జ్ యాక్టివిటీ మొదలుకావడమే మిగిలింది.
17. వెయిటింగ్ లో ఉన్న ఇఫ్కో, క్రిభ్ కో ప్రాజెక్టులు ఇక మొదలవుతున్నాయ్. వీటి కోసం క్రిష్ణపట్నంలో రిలయన్స్ గ్యాస్ ప్లాంట్ కూడా పెడుతోంది.
18. 8కి పైగా మొబైల్ మేనిప్యాక్చరింగ్ యూనిట్లతో చిత్తూరు శ్రీసిటీ ఇపుడు ఇండియా మొబైల్ హబ్ లా కనిపిస్తోంది
19. చిత్తూరులో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రికార్డు స్థాయిలో మొదలవుతున్నాయ్. ఇప్పటికే పెప్సీ మేంగో పల్ప్ యూనిట్ స్టార్ట్ చేసింది. బ్రిటానియా యాక్టివిటీతోపాటు ఇతర ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు కూడా చిత్తూరులో వేగంగా పనులు ప్రారంభించబోతున్నయ్.
20. ఆటోమొబైల్స్ ఇండస్ట్రీలో ఆంధ్రా ముద్ర పడబోతోంది. ఇసుజి మేనిఫ్యాక్చరింగ్ మొదలు పెడుతోంది. హీరోహోందా అదే పనిలో ఉంది. అతిపెద్ద తయారీ బ్రాండ్లలో ఒకటైన భారత్ ఫోర్జ్ కూడా త్వరలో నెల్లూరులో కాలుపెట్టబోతోంది.
21. తిరుపతి ఐఐటీలో తరగతులు మొదలయ్యాయ్
22. అనంతపూర్, కర్నూలు ఇపుడు గ్రీన్ కేపిటల్స్. 2500 మెగావాట్ల సోలార్, 3000 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లు ఓ తీరుకి వస్తున్నాయ్.
23. అనంతపురంలో ఎనర్జీ యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎక్సైజ్ రాబోతున్నాయ్.
24. మిస్సైల్ గైడెన్స్ ఎలక్ట్రానిక్స్ మేనిప్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ అనంతలో , ఐఆర్ డివైస్ యూనిట్ మచిలీ పట్నంలోనూ ఏర్పాటు చేయబోతోంది బెల్.
25. కర్నూల్లో డీఆర్డీఎల్ కేంద్రం ఏర్పాటు కాబోతోంది.
26. కర్నూలులో ట్రిపుల్ ఐటీ, అనంతలో సెంట్రల్ వర్సిటీ ఖరార్యయాయ్.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్. అయినా… ఇవీ సాధించాం… అని చెప్పుకోవడం అంటే గొప్పకోసమో ఆర్భాటం కోసమో కాదు. వాస్తవం తెలుసుకోవడం కోసం ! మన శక్తి ఏంటో మన సామర్థ్యం ఏంటో… మన స్పీడు ఏంటో అర్థం చేసుకోవడం కోసం ! ఎక్కడి వరకూ వచ్చామో అర్థమైతేనే…ఇంక ఎక్కడివరకూ వెళ్లగలమో తెలుస్తుంది. మన సామర్థ్యమెంతో తేలుతుంది. ఇలాంటి ఆలోచన లేకుండా ఏం పెట్టారని ఏం పెట్టారని… ఖాళీ కంచాలతో గొవడ చేస్తే ఒరిగేదేముంటుంది ! ఇప్పుడిప్పుడే సరుకులు సమకూర్చుకుంటున్నాడు చంద్రబాబు. వంట మొదలవుతున్నదిప్పుడే ! కొత్తగా మనం మంటపెట్టక్కర్లేదు. వండనిస్తే… ఓపిగ్గా ఉంటే… ఏపీ కడుపు నిండటం పెద్ద కష్టం కాదు. ఈలోపే గొవడ చేస్తే మిగిలేది అర్థాకలే !

 

 

manchidi..subha sakunaaley anni kuuda..ATB to AP.

Link to comment
Share on other sites

×
×
  • Create New...