Jump to content

Balayya Thrills Fans With Horse Ride


Prabhas_Fan

Recommended Posts

Balayya-thrills-Fans-with-Horse-ride-145

Nandamuri Balakrishna is the chief guest for state-level bull race held in Tenali on Tuesday night. He entertained the fans by riding a horse after flagging off the competition.

The Hindupur MLA advised Youth not to forget Telugu culture and tradition. He described Telugu as Mother's Milk and Other Languages to that of Packaged Milk. 'We need to save Telugu language. Its very unfortunate to face such as situation. Sadly, We have been learning from states like Tamil Nadu,' he opined.

Balayya recalled the services of his father NT Rama Rao to uplift the Telugus. He appealed people to take inspiration from NTR to safeguarding our language and culture.

An official announcement on Balakrishna's 100th Movie will be made on Telugu New Year, Ugadi.

 

Link to comment
Share on other sites

Balayya-Horse-Riding-1459325936-1744.jpg

నందమూరి బాలకృష్ణ మరోసారి పబ్లిగ్గా తన ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. నిన్న రాత్రి తెనాలిలో గుర్రపు స్వారీ చేసి.. అభిమానుల్ని ఉర్రూతలూగించాడు. రాత్రి పూట పబ్లిక్ లో గుర్రపు స్వారీ చేయడమంటే అంత తేలికైన విషయమేమీ కాదు కదా. తెనాలిలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేల్ని ఆరంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన బాలయ్య.. గుర్రమెక్కి సవారీ చేశాడు. తన కొత్త సినిమా కోసం విభిన్నమైన మీసకట్టుతో కనిపిస్తున్న బాలయ్య.. ధగధగా మెరిసిపోతున్న బట్టలేసుకుని రాజులా తయారయ్యాడు. మరి ముందే ప్లాన్ చేసి తెప్పించారో ఏంటో కానీ.. బాలయ్యకు అక్కడ గుర్రం కనిపించగానే ఎక్కేసి స్వారీ చేస్తూ అభిమానుల్ని థ్రిల్ చేశారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ నేటి యువత తెలుగు భాష.. సంస్కృతిని మరువరాదన్నారు. మాతృభాష అన్నది తల్లి పాల లాంటిదని.. మిగతా భాషలు ప్యాకెట్ పాల వంటివని బాలయ్య తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరముందని.. ప్రస్తుత దుస్థితి చాలా ఆవేదన కలిగిస్తోందని.. తమిళనాడును చూసి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని.. బాలయ్య చెప్పాడు. తెలుగు భాషకు తన తండ్రి ఎన్టీ రామారావు చేసిన సేవాల్ని గుర్తు చేసుకున్న బాలయ్య.. ఆయన స్ఫూర్తితో మనం తెలుగు భాష పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చాడు. బాలయ్య తన వందో సినిమాను తెలుగు సంవత్సరాది అయిన ఏప్రిల్ 8నే ప్రారంభించబోతుండటం విశేషం.

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...