Jump to content

Jagan the aparichitudu


siru

Recommended Posts

తాజాగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విషయమే తీసుకుందాం. నిన్నమొన్నటివరకూ ఆయన జగన్ కు అత్యంత విదేయుడు. ఈ మధ్యనే సైకిల్ ఎక్కేసిన ఆయన.. మాజీ బాస్ మీద గయ్యిమంటున్నారు. జగన్ ఎంత ఇబ్బందికరమైన నేత అన్న విషయాన్ని చెప్పటమే కాదు.. ఉదాహరణలు జోడించి మరీ వ్యాఖ్యలు చేస్తున్నారు.

జగన్ వైఖరిని తాను భరించలేకనే పార్టీ మారినట్లుగా ఆయన చెప్పారు. జగన్ ను పార్టీ నేతలే కాదు.. సొంత బంధువులు కూడా భరింలేకపోతున్నారని.. ఈ కారణంగానే గౌరవప్రదమైన కటుంబాల నుంచి వచ్చిన వారు ఆయన ధాటికి తట్టుకోలేక పార్టీ మారుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగన్ కు.. ఆయన తండ్రి.. దివంగత వైఎస్ తో పోలిస్తూ ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచచారు.

వైఎస్ అవినీతి విషయాన్ని పక్కన పెడితే.. పార్టీ నేతల్ని నవ్వుతూ పలుకరించేవారని.. కానీ జగన్ లో మాత్రం అవినీతితో పాటు నిరంకుశత్వం ఉందన్నారు. ఎవరినీ ఏ విషయం మీద అభిప్రాయం అడగకపోవటం.. వారి మాటల్ని వినకపోవటం లాంటివే కాదు.. ఎవని సలహాను స్వీకరించని వైనం ఉందని చెప్పిన జలీల్ ఖాన్.. అసెంబ్లీలో ఆయన చేయి ఊపితే పోడియం దగ్గరకు పోవటం మినహా మరో పని ఉండదన్నారు.

ఆయన్ను కలవాలంటే ఎమ్మెల్యేలకు ఎంత కష్టమన్న విషయాన్ని చెబుతూ.. జగన్ అపాయింట్ మెంట్ కోసం మూడు రోజుల ముందుగా ఆయన పీఏను  అడగాలని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఆయన నిద్ర పోతుంటే.. లేచే వరకూ వెయిట్ చేయాలే తప్పితే ఎంత అర్జెంట్ అయినా లేపకూడదని చెప్పటం విశేషం. అంతేకాదు.. జగన్ నిద్రపోతున్నప్పుడు లేచే వరకూ వెయిట్ చేయాలే తప్పించి.. ఆ మధ్యలో ఎవరైనా మనల్ని హత్య చేసినా దిక్కుండదంటూ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...