Jump to content

మల్లన్నసాగర్కు రైతు బలి


Buttertheif

Recommended Posts

- భూమి పోతుందనే భయంతో బచ్చలి నర్సయ్య ఆత్మహత్య 
- గాంధీ ఆస్పత్రిలో మృతి 
- గుండెలవిసేలా రోదించిన భార్య, కుమార్తె 
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌/తొగుట 
టీఆర్‌ఎస్‌ సర్కారు నిర్మించతలపెట్టిన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. సాగునీటి నిపుణులు, మేధావులు, విపక్షాల సూచనలను పెడచెవిన పెట్టి 'ప్రాజెక్టును నిర్మించి తీరతాం...' అంటూ హూంకరించిన ప్రభుత్వ పెద్దల తీరుతో తీవ్ర ఆందోళనకు గురైన ఓ వృద్ధ రైతు 'గుండె' పగిలింది. ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి, నీటిపారుదలశాఖ మంత్రి రోజుకో విధంగా 'దరువేస్తున్న' నేపథ్యంలో...తనకున్న 'ఆదరువు'ను కోల్పోవాల్సి వస్తుందన్న బెంగతో మెదక్‌ జిల్లా తొగుట మండలం పల్లెపహాడ్‌కు చెందిన బచ్చలి నర్సయ్య (75) బుధవారం తన ఇంట్లో ఉరేసుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ను చికిత్స నిమిత్తం తొలుత గజ్వేల్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించటంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం 6 గంటలకు నర్సయ్య మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని రైతు సంఘాల జేఏసీ ఛైర్మన్‌ జస్టిస్‌ బి.చంద్రకుమార్‌, భూ నిర్వాసితుల కమిటీ కో-కన్వీనర్‌ టి.సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బి.ప్రసాద్‌, సామాజిక ఉద్యమ నాయకులు గాదె ఇన్నయ్య, రైతుసంఘం మెదక్‌ జిల్లా కార్యదర్శి జయరాజు తదితరులు సందర్శించారు. నర్సయ్య కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా వారు పరామర్శించారు. 
మల్లన్నసాగర్‌ వల్ల తాము భూములు, ఇండ్లు కోల్పోవాల్సి వస్తుందంటూ నర్సయ్య ఇరుపొరుగుతో పదేపదే చెబుతుండేవాడని పల్లెపహాడ్‌ గ్రామవాసులు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఈ విషయమై ఆయన తీవ్రంగా ఆలోచించేవాడని వారు చెప్పారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురై...ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దూలానికి ఉరేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత నర్సయ్య ఇంటిపక్కన ఉండే పోతుల కనకరాజు, గూడూరు స్వామి...'ఉరేసుకున్న' విషయాన్ని గమనించారు. నర్సయ్య మెడకున్న ఉరితాడును వారు తప్పించారు. చికిత్స నిమిత్తం గజ్వేల్‌కు, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించామని ఈ సందర్భంగా నర్సయ్య బంధువులు తెలిపారు. 
నర్సయ్య మృతి నేపథ్యంలో...గాంధీ ఆస్పత్రి మార్చూరీ వద్ద పరిస్థితి హృదయ విదారకంగా మారింది. నర్సయ్య భార్య బూదవ్వ, కుమార్తె ఇలమ్మ...గుండెలవిసేలా రోదించారు. 'నువ్వు పోతే ఎలా బతకాలంటూ...' కంటతడిపెట్టారు. నర్సయ్య అల్లుడు యాదగిరి మాట్లాడుతూ...'మా మామకు పిల్లలు లేకపోతే నా భార్య(ఇలమ్మ)ను దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసిండు. ఆ తర్వాత నాకిచ్చి పెండ్లి చేసిండు. ఇప్పుడు మా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది...' అని రోదించాడు.

మా అయ్య గుండె పగిలింది...
ఇలమ్మ, నర్సయ్య కూతురు 
''మాకు ఊర్లో ఎకరాన్నర దాకా పొలం ఉంది. అది దున్తెతే మాకు బువ్వ. దాంట్లో మా అయ్య పొద్దస్తమానం పన్జేసొటోడు. ఇప్పుడు మల్లన్నసాగర్‌ కింద భూమి పోద్దని పొద్దస్తమానం దిగులుపడ్డడు. ఈ ఆదరువు పోతే మన బతుకులేమైతయ్యని ఆయన బెంగపెట్టుకుండు. అందుకే గుండెపగిలి ఉరేసుకుని మాకు అన్యాయం జేసిండు...''

ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి...
జస్టిస్‌ చంద్రకుమార్‌ 
''నర్సయ్యది ఆత్మహత్య కాదు...ఇది ముమ్మాటికీ టీఆర్‌ఎస్‌ సర్కారు హత్యే. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితుల్లో రేకెత్తుతున్న భయాందోళలనకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. అందువల్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, సాగునీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు ఇప్పటికైనా తమ ఆలోచనలను మార్చుకోవాలి. ఇంజనీర్లు, నిపుణులు, మేధావుల సూచనలను పరిగణనలోకి తీసుకుని...2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేపట్టాలి. తద్వారా బాధితుల్లో ధైర్యాన్ని నింపాలి. లేదంటే ఇలాంటి ఘటన (నర్సయ్య ఆత్మహత్య)లే పునరావృతం అయ్యే ప్రమాదముంది...'' 

ప్రభుత్వానిదే బాధ్యత...టి.సాగర్‌
భూ నిర్వాసితుల కమిటీ 
''నర్సయ్య ఆత్మహత్యకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. 2013 చట్టాన్ని ధిక్కరించటం ద్వారా ప్రభుత్వం భూ నిర్వాసితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఈ క్రమంలోనే నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికైనా మల్లన్నసాగర్‌పై ప్రభుత్వం పునరాలోచన చేస్తే మంచిది. మృతుడు నర్సయ్య కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలి...''

Link to comment
Share on other sites

  • Replies 36
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Buttertheif

    10

  • PeruguVada

    6

  • psycopk

    5

  • JAPAN

    5

Top Posters In This Topic

Just now, JAPAN said:

aa project redesign chesthe asalu evi povu cheptunnaru....mari adhe try cheyachuga TG father 

evadi maata vinadu seetaih :(

Link to comment
Share on other sites

1 minute ago, JAPAN said:

aa project redesign chesthe asalu evi povu cheptunnaru....mari adhe try cheyachuga TG father 

real father aaite ade chesevadu... inkokadi kastam ni nadi ani chepuku tirige father kabati ita chestunadu..

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

who knows and who cares.. maa dora palana gurinchi goppaga rayaledu..

vooo artham ainadi paper anamata... andhrola kutra paper andhrodidi with tg name man 

Link to comment
Share on other sites

5 minutes ago, psycopk said:

real father aaite ade chesevadu... inkokadi kastam ni nadi ani chepuku tirige father kabati ita chestunadu..

nawab maavade kadha ankul 

Link to comment
Share on other sites

12 minutes ago, psycopk said:

real father aaite ade chesevadu... inkokadi kastam ni nadi ani chepuku tirige father kabati ita chestunadu..

ante KTR ki real father kaadha maa CM

Link to comment
Share on other sites

28 minutes ago, psycopk said:

Navatelangana should be banned ... thats only brilliant solution to this problem..

Bro.. mari lokesh sontha party ne kula pichi, matha pichi, avineeti, chese party edaina undi antey...adhi telugu desam party annadu..... Loki anna ni ban cheyyali ani annara Loafers andaru?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...