Jump to content

google google eh..hardworking hardworking eh


kakatiya

Recommended Posts

కొడుకు గూగుల్‌లో.. తండ్రి కూలీగా! 
21brk-google1a.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: కొడుకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అదీ ప్రఖ్యాత గూగుల్‌ కంపెనీలో. వేతనం గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఇక ఇల్లు, కారు, నగలు ఒకటేమిటి ఆ డబ్బులతో ఏది కావాలంటే అది పొందొచ్చు. కొడుకు ఇంతమొత్తంలో సంపాదిస్తే తండ్రి దర్జాగా కాలుమీద కాలు వేసుకుని బతికేయొచ్చు కదా. కానీ ఆ తండ్రి అలా కాదు. కొడుకు లక్షల్లో సంపాదిస్తున్నా తాను మాత్రం ఇప్పటికీ కూలి పనులకు వెళ్తూ సాధారణ జీవనం గడుపుతున్నాడు. కష్టపడేతత్వానికి అలవాటు పడ్డ తనకి కూలికి వెళ్లడంలోనే ఆనందం ఉందంటున్నాడు.

21brk-google1b.jpg

రాజస్థాన్‌లోని సోజత్‌కు చెందిన తేజారామ్‌ రోజు కూలీ. కొడుకు రామచంద్రను కష్టపడి చదివించాడు. హిందీ మీడియం విద్యార్థి అయిన రామచంద్ర ఆంగ్ల సినిమా సబ్‌టైటిళ్లను చదువుతూ ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సాధించాడు. 70 శాతం మార్కులతో 12వ తరగతి పాసయ్యాడు. అతడిని ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలని కోటాలో ఐఐటీ-జేఈఈకి కోచింగ్‌ ఇప్పించాడు ఆ తండ్రి. అందుకోసం తెలిసినవారి వారందరి దగ్గరా అప్పులు చేశాడు. అనుకున్నట్లే ఉన్నత చదువు చదివిన రామచంద్రను అదృష్టం వరించింది. ఏకంగా గూగుల్‌లోనే ఉద్యోగం లభించింది. సియాటెల్‌లో లక్షల్లో గడిస్తున్న రామచంద్ర ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే అప్పులన్నీ తీర్చేశాడు. వూళ్లొ కొంత భూమి కూడా కొన్నాడు. ఇంటిని తల్లిదండ్రులకోసం సౌకర్యవంతంగా తీర్చిదిద్దాడు. అయితే, తండ్రిని మాత్రం మార్చలేకపోయాడు. రోజూ కూలికి వెళ్లి రూ.100నుంచి 400 వరకు సంపాదిస్తూ ఆ మొత్తంతోనే జీవితాన్ని సాగిస్తున్నాడు అతడి తండ్రి. కూలికి వెళ్లొద్దని ఎంత వారించినా తనకు అందులోనే సంతోషం ఉంటుందంటున్న తండ్రికి ఏం చెప్పాలో తెలియడం లేదంటున్నాడు రామచంద్ర.

Link to comment
Share on other sites

in india blue collar workers are not paid minimum salary /wage and are treated as poor.

 

in any other developed country dignity of work is same across all sectors.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...