Jump to content

మధ్యతరగతికి తీపి కబురు! ఆదాయపన్ను పరిమితి పెంపు?


JANASENA

Recommended Posts

23BRK98-INCOMETAX.jpg

న్యూదిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ కోసం అందరూ, ముఖ్యంగా మధ్య తరగతి ఆదాయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి తాజా బడ్జెట్‌లో పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. వ్యక్తిగత ఆదాయపన్ను, సెక్షన్‌ 80సీ పరిమితులు పెంచడంతో పాటు గృహ రుణాలను మరింత చౌకగా చేసే దిశగా ఈ బడ్జెట్‌ ఉంటుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) పరిశోధన నివేదిక ఎకోరాప్‌ అంచనా వేసింది. అంతేకాకుండా కదలించడానికి వీలులేని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై పన్ను మినహాయింపు కూడా ఇచ్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

‘ప్రస్తుతం ఆదాయపన్ను పరిమితి రూ.2.5లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచవచ్చు. అదే విధంగా సెక్షన్‌ 80సీ కింద ఉన్న పరిమితిని రూ.1.5లక్షల నుంచి రూ.2లక్షలు, గృహ రుణ పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచే అవకాశం ఉంది. పన్ను మినహాయింపుకోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల లాకిన్‌ పీరియడ్‌ను ఐదేళ్లనుంచి మూడేళ్లకు తగ్గించే అవకాశం ఉంది’ అని నివేదిక వెల్లడించింది.

ఎస్‌బీఐ గుర్తింపు పొందిన, ఆర్థిక పరిశోధనశాఖకు చెందిన చీఫ్‌ ఆర్థిక సలహాదారు సౌమ్య ఘోష్‌ నివేదికను ధ్రువీకరించారు. ఈ ఉపశమనాలను కల్పించడం ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.35,300కోట్లు అవుతుందని, ఆదాయ వెల్లడి పథకం2(ఐడీఎస్‌2) ద్వారా వచ్చే సొమ్ముతో దీనిని సమతూకం చేయడం, నోట్లపై ఆర్‌బీఐ భారాన్ని తగ్గించడం ద్వారా దీనిని అమలులోకి తెస్తారని అంచనా వేస్తున్నారు. ఐడీఎస్‌ పథకం ద్వారా రూ.50వేల కోట్లు, ఆర్‌బీఐపై నోట్ల భారాన్ని తగ్గించడం ద్వారా రూ.75వేల కోట్లు సమకూరతాయని ఎస్‌బీఐ పరిశోధన అంచనా వేసింది.

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రత్యక్షపన్నులను పునర్వ్యవస్థీకరించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు వూతం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

Link to comment
Share on other sites

1 minute ago, alpachinao said:

5l daaka cheyochu vedavalu 3l edi latho kor lafangis

 

Opposition unnappudu tega gola pettaru 3-5 lakhs cheyyali ani first 2 nunchi 2.5 chesaaru next year didn't change...Ippudu 5 Lakhs ani news vastadi gaani 3 lakhs cheste goppe...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...